మన దేశంలో రాజకీయాలు బాగా ఫాలో అయ్యే వారికి అన్నీ రాజకీయ పార్టీల గురించి తెలుస్తుంది. అయితే ఓ రెండు పార్టీల గురించి చాలా మందికి ఓ అనుమానం ఉంటుంది. అదే సీపీఐ – సీపీఎం. అసలు ఈ రెండు పార్టీలు ఒకటేనా వీటి మధ్య తేడా ఏమిటి అని చాలా మందికి డౌట్. అసలు ఈ రెండు పార్టీల మధ్య తేడా ఏమిటి అనేది ఈ రోజు తెలుసుకుందాం.
సీపీఐ మరియు సీపీఎం ఈ రెండు పార్టీల మూలాలు ఒకటే, అయితే వారి సైద్దాంతిక విధానాలు వేరు, అవలంభించే విధానాలు వేరుగా ఉంటాయి.
CPI కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఇది మన దేశంలో అత్యంత పురాతన కమ్యునిస్ట్ పార్టీ.1925లో దీనిని స్ధాపించారు
అయితే CPI లో నుంచి కొందరు నాయకులు బయటకు వచ్చి CPM కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ ఏర్పాటు చేసుకున్నారు.1964లో CPI నుండి విడిపోయి కొత్తగా CPM ఏర్పాటు చేసుకున్నారు.
అయితే కలిసి మెలిసి ఉన్న ఈ నాయకులు ఎందుకుగా ఇలా విడిపోయారు అనేది చూస్తే, జాతీయ అంతర్జాతీయ రాజకీయాల కారణంతో విడిపోయారు.
1950 తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీ దేశంలో చాలా వేగంగా విస్తరించింది. ఈ సమయంలో ఈ పార్టీ నిర్ణయాల పట్ల ఎలా వ్యవహరించాలి అనేదానిపై కమ్యూనిస్టులలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాంగ్రెస్ లో ప్రగతిశీల ఆలోచనలో ఉన్న వారితో కలిసి పనిచేయాలి అని CPI భావించింది, కానీ కాంగ్రెస్ పెట్టుబడి దారులకి భూ స్వాములకి పక్షపాతంగా ఉంది అని వారిని వ్యతిరేకించాలి అని సీపీఎం వ్యతిరేకించింది. ఇలా సీపీఐ సీపీఎం వేరు వేరుగా మారాయి.
ప్రపంచ స్థాయిలో కమ్యూనిస్ట్ దేశాలైన రష్యా చైనాల మధ్య సిద్దాంతాల్లో విభేదాలు వచ్చినప్పుడు, ఇక్కడ సీపీఐ.సీపీఎం మధ్య కూడా చీలిక వచ్చింది. సీపీఐ పూర్తిగా రష్యా విధానాలను సమర్ధించింది. ఇక సీపీఎం చైనా విధానాలను సమర్ధించింది. అయితే కొంత కాలం తర్వాత సీపీఎం చైనా విధానాల నుంచి దూరంగా జరిగింది
ఇక ఇండియా చైనా 1962లో యుద్దం జరిగిన సమయంలో కూడా జాతీయవాదాన్ని బలపరచాలి అని భావించాయి.
ఇక మొత్తానికి చీలిక తర్వాత సీపీఎం బలమైన పార్టీగా దేశంలో అవతరించింది.
పశ్చిమ బెంగాల్, కేరళ, త్రిపుర రాష్ట్రాలని సీపీఎం కంచుకోటగా మార్చుకుంది. ఇటీవల కేరళలో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పినరయి విజయన్ అక్కడ సీపీఎం తరపున ఓటమి చెందారు. 10 ఏళ్లు విజయన్ సీఎంగా అక్కడ కొనసాగారు. తాజాగా అక్కడ కాంగ్రెస్ గెలుచుకుంది.
అయితే సీపీఎం దేశ వ్యాప్తంగా ఎదిగింది కానీ, సీపీఐ ఎదగలేకపోయింది. సీపీఐ ఓటు బ్యాంకు పెరగలేదు. సీపీఎం పెద్ద పార్టీగా సీపీఐ చిన్నపార్టీగా స్దిరపడ్డాయి.
మార్క్సిజం లెనినిజం ఈ రెండు పార్టీలు సిద్దాంతాల పరంగా ఒకేలా పాటిస్తాయి. అయితే దేశ వ్యాప్తంగా ఎలా ముందుకు సాగాలి ఎవరితో సపోర్ట్ గా ఉండాలి అనే విధానంలో రెండు పార్టీలు వైఖరి విభిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం బీజేపీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా మాత్రం రెండు పార్టీలు కలిసి కట్టుగానే పోరాటం చేస్తున్నాయి. రెండు పార్టీలు ఇండియా కూటమిలోనే ఉన్నాయి.

