మనం ఏదైనా బ్యాంక్ నుంచి లోన్ పొందాలన్నా, లేదంటే ఎన్. బీ. ఎఫ్. సీ నుంచి లోన్స్ తీసుకోవాలన్నా మీ క్రెడిట్ స్కోర్ చాలా ముఖ్యం. దాదాపు 100 మంది లోన్లకి అప్లై చేస్తే 80 మందికి ఈ సిబిల్ స్కోర్ తక్కువ ఉండి లోన్ రిజెక్ట్ అవుతుంది. ప్రభుత్వ బ్యాంకులు అయితే ఫస్ట్ సిబిల్ స్కోర్ చూసి వెంటనే మీకు లోన్ వస్తుందో రాదో అని చెప్పేస్తున్నాయి.ఇక ఇప్పుడు మరోకొత్త అంశం తెరపై చర్చకు వచ్చింది. ఇప్పుడు రుణానికి మాత్రమే కాదు మీకు ఉద్యోగం కావాలన్నా క్రెడిట్ స్కోర్ బాగుండాల్సిందే. మీ క్రెడిట్ హిస్టరీ మీకు జాబ్ ఇవ్వాలా వద్దా అని డిసైడ్ చేయనుంది. ఇటీవల పెళ్లిళ్ల విషయంలో అమ్మాయిని అబ్బాయికి ఇవ్వాలంటే, ఆ అబ్బాయి క్రెడిట్ స్కోర్ చూసి సంబంధం ఒకే చేసుకుంటున్నారు అనే వార్తలు చూశాం. ఇప్పుడు ఉద్యోగాలకి కూడా ఈ సిబిల్ స్కోర్ కీలకం కానుంది. మరి దీని గురించి ఓసారి చూద్దాం.
సిబిల్ స్కోర్ మినిమం 750 పాయింట్లకు మించి ఉండాలి లేదంటే మీకు లోన్ రాదు. 300 నుంచి 900 మధ్య ఈ పాయింట్లు లెక్కిస్తారు. అంటే మీరు 800 స్కోర్ పైన ఉంటే మీకు వడ్డీ కూడా బాగా తక్కువకి వస్తుంది. లోన్లు ఇవ్వడానికి చాలా కంపెనీలు ముందకు వస్తాయి బ్యాంకులు ఇంట్రస్ట్ చూపిస్తాయి.
అయితే ఇటీవల కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు ఫైనాన్స్ తరహా సంస్దలు ఇంటర్వ్యూ సమయంలో వారి క్రెడిట్ స్కోర్ కూడా చెక్ చేస్తున్నారు. ఒకవేళ ఇంటర్వ్యూ అంతా బాగా జరిగినా సిబిల్ స్కోర్ సరిగ్గా లేకపోతే వారికి జాబ్ ఇవ్వకపోవచ్చు. ముఖ్యంగా గత ఏడాది నుంచి బ్యాంకులో జాబ్ పొందాలి అంటే కచ్చితంగా వారి సిబిల్ స్కోర్ బాగుండాలి అని కండిషన్ కూడా పెడుతున్నారు.
ఈ ఉద్యోగాల్లో రోజు లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్లు జరుగుతాయి. కస్టమర్ల గురించి అనేక సమాచారం కూడా ఉంటుంది. ఇక లోన్లు అప్పులు ఉద్యోగికి ఉంటే ఇక్కడ పనిపట్ల అంకితభావం ఉండదు. బాగా ఒత్తిడికి కూడా గురి అవుతారు. జరగరాని తప్పులు జరగవచ్చు. అందుకే ఈనిర్ణయం తీసుకున్నారు అని తెలుస్తోంది.
ఇకహోమ్ లోన్ లాంటివి ఉండి వాటి చెల్లింపులు అన్నీ సజావుగా సాగితే ఒకే , లేదంటే కచ్చితంగా ఉద్యోగం కష్టం అవుతుంది . ఇక మీ పేరుపై ఏమైనా క్రెడిట్ బిల్లు ఉంటే పే చేయండి. ఒక నెల రోజుల్లో మీ సిబిల్ స్కోర్ మళ్లీ పాజిటీవ్ గా అప్ కి చేరుతుంది. అందుకే బ్యాంకు ఉద్యోగాల కోసం చూసేవారు లోన్ల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది అంటున్నారు నిపుణులు.

