శ్రీరామ నవమి పండుగ వచ్చిందంటే చాలు పల్లెల నుంచి పట్టణాల వరకూ ఎంతో సందడి కనిపిస్తుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో చెప్పాలంటే భద్రాచలం ఒంటిమిట్ట ఆలయాల్లో కల్యాణాలు జరుగుతాయి. అయితే ఈరోజు సీతారాముల కల్యాణం చూసేందుకు కోట్లాది మంది భక్తులు ఎదురుచూస్తారు. దేశ వ్యాప్తంగా రామాలయాలు ఆంజనేయ స్వామి ఆలయాల్లో పెద్ద ఎత్తున పూజలు చేస్తారు.
ఇక ఈ ఏడాది 2026 రామనవమి ఎప్పుడు అనేది చూస్తే. మార్చి 27వ తేదీ శుక్రవారం చైత్రమాసం శుక్లపక్షం నవమి రోజు జరుపుకుంటాం.త్రేతాయుగంలో శ్రీ మహావిష్ణువు ధర్మస్ధాపన కోసం శ్రీరాముడు అవతరించిన రోజు చైత్ర శుక్ల పక్ష నవమి శ్రీరామ నవమి పర్వదినం. అందుకే ఈ రోజు శ్రీరామజననం, పట్టాభిషేకం, సీతారాముల కల్యాణం మూడు ఘట్టాలు నిర్వహిస్తారు.
జ్యోతిష్యం ప్రకారం కొన్ని సందర్భాలు గడియల్లో రాశులు వాటి స్ధానాలు మార్చుకుంటాయి. ఈరామనవమికి రెండు గ్రహాలు కలవనున్నాయి. దీంతో రెండు రాశులకి అద్బుతమైన సమయం రానుంది.. ఈ నెల 26న చంద్రుడు, గురు గ్రహాల కలవనున్నారు. దీంతో ఈ రెండు రాశులకి గజకేసరి యోగం ఏర్పడనుంది.
మరి ఆ రెండు రాశులు ఏమిటి అనేది చూస్తే
1.మిథున రాశి : శ్రీరామ నవమి తర్వాత మిథున రాశి వారి జాతకం మారిపోనుంది. వీరు విదేశాలకు వెళ్లాలి అనుకుంటే వారికి మంచి సమయం కనిపిస్తుంది. అంతేకాదు ఈ ఏడాది వీరికి ఇళ్లు కొనే యోగం కనిపిస్తుంది. అలాగే అప్పుల బాధలు తగ్గిపోతాయి. పిల్లల విషయంలో వారికి పెళ్లి చేస్తారు. అలాగే ప్రయోజకులు అవుతారు. పిల్లలు విదేశాలకు వెళతారు. ప్రభుత్వ ఉద్యోగాలు పదవులు వచ్చే అవకాశం మిధునరాశి వారికి కనిపిస్తుంది.
2.సింహ రాశి : ఇక వీరికి ఎక్కడకు వెళ్లినా తిరుగు ఉండదు వీరి కష్టాలు అన్నీ తీరిపోతాయి, వీసా వస్తుంది విదేశాల్లో చదువుకి ఉద్యోగానికి 100 కి 100 శాతం సమయం అనుకూలంగా ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కెరియర్ లో మంచి స్ధానానికి చేరుకుంటారు. పారిశ్రామిక వేత్తలు వ్యాపారం చేసేవారు ప్రభుత్వ ఉద్యోగులకి మంచి సమయం కనిపిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ వరకూ ఏ పని చేపట్టినా అందునా విజయం చేకూరుతుంది.

