HomeFinanceపోస్టాఫీసులో నెల‌కి 2200 క‌ట్టండి 160000 పొందండి బెస్ట్ స్కీమ్

పోస్టాఫీసులో నెల‌కి 2200 క‌ట్టండి 160000 పొందండి బెస్ట్ స్కీమ్

ప్ర‌భుత్వ బ్యాంకులు, పోస్టాఫీసుల్లో సేవింగ్స్ పెట్టుకోవ‌డానికి చాలా మంది ఆస‌క్తి చూపిస్తారు. ఎందుకంటే ప్ర‌భుత్వానికి సంబంధించిన సంస్ధ‌లు కాబ‌ట్టి అందులో ఉన్న డ‌బ్బుకి సెక్యూరిటీ ఉంటుంది. కాస్త త‌క్కువ ఇంట్ర‌స్ట్ వ‌చ్చినా అందులో డ‌బ్బు దాచుకుంటారు. అయితే ఎప్ప‌టి నుంచో చూస్తున్నాం పోస్టాఫీసుల్లో చాలా మంది ఆర్డీ క‌డ‌తారు. అంటే రిక‌రింగ్ డిపాజిట్ .ఈ డిపాజిట్లపై మంచి వడ్డీ రేట్లను అందిస్తోంది పోస్ట్ డిపార్ట్ మెంట్. మ‌నం పెట్టిన డ‌బ్బుకి ఎలాంటి రిస్క్ ఉండ‌దు. మ‌న పెట్టుబ‌డితో పాటు కాస్త రిట‌ర్న్ ఇంట్ర‌స్ట్ రూపంలో వ‌స్తుంది. కాబ‌ట్టి చాలా మందికి ఇది ఓ బెస్ట్ ఛాయిస్.

రికరింగ్ డిపాజిట్ ఆర్డీ పథకంలో మీరు మినిమం 5 సంవ‌త్స‌రాల వ‌ర‌కూ పెట్టుబ‌డి పెట్టుకోవ‌చ్చు. మీకు ఆదాయానికి ఎలాంటి ఢోకా ఉండ‌దు. అయితే ఎంత డ‌బ్బులు ఇందులో పెట్టుబ‌డి పెడితే మ‌న‌కు మంచి రిట‌ర్న్ వ‌స్తుంది అనేది చూస్తే.

మీరు ఆర్డీ ప‌థ‌కంలో నెల‌కి 2,200 జ‌మ చేయాలి అంటే
సంవ‌త్స‌రానికి 26,400
ఇలా ఐదు సంవ‌త్స‌రాల‌కి 1,32,000 మీరు పెట్టుబ‌డిగా పెట్టిన‌ట్లు

త‌న ఖాతాదారుల‌కి ఈ ప‌థ‌కం ద్వారా పోస్ట‌ల్ వారు 6.7 శాతం వార్షిక వ‌డ్డీ అందిస్తారు. సో మొత్తంగా మెచ్యూరిటీ సమయంలో రూ. 1,57,004 లభిస్తాయి. ఇలా అర‌వై నెల‌లు మీరు పెట్టుబ‌డి పెటుకున్నా మంచి లాభం వ‌స్తుంది. మీ డ‌బ్బుకి ఢోకా ఉండ‌దు. క‌చ్చితంగా ప్ర‌భుత్వం సెక్యూరిటీ ఉంటుంది. అయితే ఇంత పెద్ద మొత్తంలో మీరు నెల నెలా క‌ట్టుకోలేక‌పోతే 100 రూపాయ‌ల నుంచి ఎంతైనా క‌ట్టుకోవ‌చ్చు. ఐదు సంవ‌త్స‌రాల్లో మీరు క‌ట్టిన 1,32,000 కి మొత్తం 25000 వ‌డ్డీ వ‌స్తుంది. అయితే బ‌య‌ట వ‌డ్డీతో పోల్చుకుంటే త‌క్కువ వ‌డ్డీ అయినా, మీకు మంచి రిట‌ర్న్ సెక్యూరిటీ ఇవ్వ‌డంలో ది బెస్ట్ ఛాయిస్ అనే చెప్పాలి పోస్టాఫీస్ ఆర్డీ స్కీమ్ లు.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments