రవీంద్ర కౌశిక్ ఇతనే ఒరిజినల్ ధురంధర్
ప్రపంచానికి తెలియని గూఢచారి
పాక్ గుండెల్లో దడ పుట్టించిన బ్లాక్ టైగర్
ఒక దేశంలోకి మారు పేరుతో వెళ్లి అక్కడ చదువు చదివి, అక్కడ ఉద్యోగం చేస్తూ, పెళ్లి చేసుకుని పిల్లల్ని కని, ఆ దేశ రహస్యాలు మన దేశానికి చేరవేయడం అంటే చిన్న విషయం కాదు. దీనికి ఎన్నో గట్స్ ఉండాలి. ఇప్పుడు ధురంధర్ సినిమా చూస్తున్నాం కానీ నిజమైన ధురంధర్ మనకు 1970లో ఉన్నాడు. ఆయన చేసిన సేవలు అన్నీ ఇన్నీకావు. ఇప్పటి తరానికి తెలియకపోయినా ఆనాటి మీడియా అంత ప్రాముఖ్యత లేకపోవడంతో అతని గురించి పెద్దగా తెలిసింది లేదు. కానీ ఇప్పుడు అతని గురించి దేశ మంతా కీర్తిస్తోంది. అతని గొప్పతనాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. ఆయనే రవీంద్ర కౌశిక్, నిజమైన భారత ధురంధర్, బ్లాక్ టైగర్ అనే బిరుదుని పొందారు ఈ రియల్ సోల్జర్. మరి ఆయన గురించి ఆయన చేసిన సేవల గురించి తెలుసుకుందాం.
రవీంద్ర కౌశిక్. భారత గూఢచార సంస్థ RAW తరఫున పనిచేసిన అండర్‌కవర్ ఏజెంట్. ఆనాటి ప్రధాని ఆయన సేవలకు మెచ్చి బ్లాక్ టైగర్ అనే బిరుదు ఇచ్చారు. ఆయన తన జీవితాన్ని మన భారత దేశం కోసం త్యాగం చేశారు. 1952లో రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో పుట్టారు కౌశిక్, ఆయనకు సినిమాలు నటన అంటే ఇష్టం, అందుకే రంగస్ధల నటుడిగా జీవితం ప్రారంభించారు.
ఆయన్ని చూసిన రా టీమ్ ఆయనని సంప్రదించి RAW లోకి తీసుకున్నారు. ఆయన దేశ సేవ కోసం RAW లో చేరుతాను అన్నారు. ఇక ఆయనకు ఉర్దూ భాష నేరపించారు ఇస్లాం ఆచారాలు నేర్పించారు, గూఢచారి శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. చివరకు ఒక ముస్లిం వ్యక్తిగా మారారు కౌశిక్. ఆ తర్వాత పాకిస్దాన్ లోకి 70 ల్లో ప్రవేశించారు.నబీ అహ్మద్ షకీర్ అనే పేరుతో అక్కడ అందరికి దగ్గర అయ్యారు. అంతేకాదు లా డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం మిలటరీ అకౌంట్స్ విభాగంలో సెక్షన్ ఆఫీసర్ గా చేరారు. అక్కడ ఐదారు సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత అమానతన్ అనే ఆమెని వివాహం చేసుకుని పిల్లల్ని కన్నారు. ఈ సమయంలో వారి ఆయుధాలు, నిధులు ఎక్కడ ఏఏ బేస్ లో ఎంత ఆయుధ నిల్వ ఉంది ఇవన్నీ కూడా సమాచారం సేకరించి భారత్ కు పంపించేవాడు.
ఇలా 1979 నుంచి 1985 మధ్య కాలంలో కౌశిక్ పంపిన సమాచారం వల్ల పాకిస్దాన్ ప్లాన్స్ ఫెయిల్ అయ్యాయి. చాలా మంది భారత పౌరుల ప్రాణాలు కాపాడినట్లు అయింది. ఆ వివరాలు అన్నీ చాలా రహస్యంగా ఉంచారు. ఈ సమయంలో దేశానికి ఇంత సేవ చేస్తున్నందుకు ఆయనకు ప్రధాని ఇందిరా గాంధీ బ్లాక్ టైగర్ అని పేరు పెట్టారు. వారి కుటుంబం గురించి కూడా ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు.
ఒక రా ఏజెంట్ దొరికిపోవడంతో చిన్న తప్పిదం వల్ల ఆయన కూడా పాకిస్దాన్ సైన్యానికి దొరికిపోయారు. చివరకు ఆయన్ని చిత్ర హింసలు పెట్టారు. నాలుగు ఐదు సంత్సరాలు అనేక జైళ్లు తిప్పారు. ఎంత హింసించినా ఆయన మాత్రం నిజం చెప్పలేదు. చివరకు అనారోగ్యం గుండెపోటుతో ఆయన 2001లో ముల్తాన్ జైలులో కన్నుమూశారు. భారతదేశానికి ఇంత సేవ చేసిన ఆయన వర్దంతి నేడు అందుకే ఇలాంటి గొప్ప వ్యక్తిని కచ్చితంగా మనం స్మరించుకోవాలి.

