బీహార్ కొత్త సామ్రాట్
ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి రియల్ స్టోరీ
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ రాజీనామా చేయడంతో అక్కడ ఉప ముఖ్యమంత్రి బీజేపీ నేత సామ్రాట్ చౌదరి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. రాష్ట్రంలో తొలిసారి బీజేపీ అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బీహార్ లో కమల వికాసంగానే చెప్పాలి. బీహార్ 24వ ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు.ఇక బీహార్ లో అత్యంత సీనియర్లుగా ఉన్న విజేంద్ర ప్రసాద్, విజయ్ కుమార్ కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నితీష్ కు ఎంతో దగ్గరైన నేతలు వీరు. నితీష్ రాజ్యసభకు వెళ్లడంతో సామ్రాట్ చౌదరి సీఎం అయ్యారు.ఇక బీహార్ కొత్త సీఎం సామ్రాట్ చౌదరి రియల్ స్టోరీ తెలుసుకుందాం.
సామ్రాట్ చౌదరి సాధారణంగా రాజకీయాల్లోకి రాలేదు. 40 ఏళ్ల పాటు వారి కుటుంబం రాజకీయాల్లో ఉంది. తండ్రి శకుని చౌదరి ప్రముఖ నేత ఏకంగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తల్లి పార్వతీ దేవి కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. చిన్నతనం నుంచి చదువు పూర్తి అయ్యాక తన తండ్రిలాగా ప్రజల్లో ఉన్నారు. చిన్నవయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు సామ్రాట్. వారసత్వ రాజకీయాల పునాదులపై ఎదిగిన నాయకుడు సామ్రాట్ చౌదరి. తండ్రి శకుని చౌదరి బీహార్ రాజకీయాల్లో దిగ్గజ నాయకుడుగా 40ఏళ్లు పనిచేశారు. బీహార్ లో ప్రముఖంగా వినిపించే తారాపూర్ సెగ్మెంట్ వారికి కంచుకోట. అక్కడ నుంచి ఆయన తండ్రి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక సామ్రాట్ చౌదరి బీహర్ లో అన్నీ ప్రముఖ రాజకీయ పార్టీల్లో వర్క్ చేశారు. అందుకే అందరికి నచ్చే నాయకుడు అయ్యారు స్టేట్ లో.
1. 1990లో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు.
2. 2000 లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఈ సమయంలో పర్బత్తా నుంచి ఆర్జేడీ తరపున పోటీ చేశారు, ఎన్నికల్లో గెలవడంతో రబ్రీ దేవి మంత్రివర్గంలో వ్యవసాయ మంత్రిగా పని చేశారు.
3.2010లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు, ఈ సమయంలో ప్రతిపక్ష పార్టీ చీఫ్ విప్ గా ఆయన్ని నియమించారు
4. ఇక 2014లో ఆర్జేడీ పార్టీ తిరుగుబాటు వర్గంలో చేరి జనతాదళ్ యూలో చేరారు.పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు
5. 2018లో భారతీయ జనతా పార్టీలో చేరి బీహార్ప్రదేశ్ ఉపాధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు
6..2023లో బీహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు
7. 2024 జనవరి 28న నితీష్ కుమార్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు, ఆ తర్వాత ఆయన్ని ఉప ముఖ్యమంత్రిని చేశారు.
8. తాజాగా ఏప్రిల్ 15-2026 న బీహార్ ముఖ్యమంత్రిగా ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు.
7. గతంలో ఆయన చేసిన శపథం ఇప్పుడు నెరవేరింది అది ఏమిటి అనేది చూస్తే?
2018లో బీజేపీలో సామ్రాట్ కీలక నేతగా ఎదుగుతున్నారు, ఈ సమయంలో బీజేపీతో నితీష్ తెగదెంపులు చేసుకుని మహాఘట్ బంధన్ ఏర్పాటు చేశారు. ఈ సమయంలో శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు సామ్రాట్.
నితీష్ ని సీఎం పదవి నుంచి దించే వరకూ తన తలపాగా తీయనని శపథం చేశారు. తాజాగా సీఎం అవ్వడంతో తలపాగా ఎపిసోడ్ ఆయన వర్గం హైలెట్ చేస్తోంది.
8. బీహార్ అంటేనే కుల రాజకీయాలు ఉంటాయి, ఓబీసీ ఓట్లు ఇక్కడ కీలకం, ఇక్కడ ఓబీసీల్లో ఆయన కీలక నాయకుడు. తారాపూర్ నియోజకవర్గంలో చాలా బలమైన లీడర్ అక్కడ ఏ ఎన్నిక జరిగినా వార్ వన్ సైడ్. అందుకే బీజేపీ తనకంటూ ఓ ప్రత్యేక లీడర్ ని నియమించుకోవాలి అని ఆలోచించినప్పుడు సామ్రాట్ ది బెస్ట్ అనిపించింది. అందుకే ఆయన్ని ఫైనల్ చేశారు మోదీ అమిత్ షా. సో మొత్తానికి రాజకీయంగా ఆయన ఎంతో కష్టపడ్డారు. పలు పార్టీల్లో ఆయన వెళ్లినా ఎక్కడ ఉన్నా ఆ పార్టీ గెలుపు కోసం పనిచేశారు. ఆ పట్టుదలే ఆయన్ని ఇంత స్ధాయికి నిలబెట్టింది.
**ఎండింగ్**
**సో కొత్త ప్రభుత్వం బీహార్ లో ఎలాంటి ప్రజా పాలన అందిస్తుందో చూడాలి**

