Homeఆంధ్ర ప్రదేశ్ఏపీలో స్లీప‌ర్ బ‌స్సులు ర‌ద్దు ? ట్రావెల్స్ కంపెనీల‌కి బిగ్ స్ట్రోక్

ఏపీలో స్లీప‌ర్ బ‌స్సులు ర‌ద్దు ? ట్రావెల్స్ కంపెనీల‌కి బిగ్ స్ట్రోక్

ఏపీలో స్లీప‌ర్ బ‌స్సులు ర‌ద్దు ?
ట్రావెల్స్ కంపెనీల‌కి బిగ్ స్ట్రోక్

ఏపీలో ఇటీవ‌ల జ‌రిగిన బ‌స్సు ప్ర‌మాదాలు ఎంత విషాదాల‌ను మిగిల్చాయో మ‌నం చూశాం. అయితే స్లీప‌ర్ బ‌స్సులు ఎక్కువ ప్ర‌మాదాల‌కు గురి అవుతున్నాయి, జ‌ర్నీ కంఫ‌ర్ట్ ఉన్నా ప్ర‌మాదాల్లో కూడా ఈ బ‌స్సులు ముందు ఉంటున్నాయి. అయితే ఏపీలో ప్ర‌భుత్వం ఓ ఆలోచన చేస్తోంది.
ప్రజల ప్రాణాలను బలిగొంటున్న స్లీపర్‌ బస్సులను అవసరమైతే భవిష్యత్తులో రద్దుచేస్తామని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఈ ప్ర‌క‌ట‌న ఒక్క‌సారిగా ట్రావెల్స్ యాజ‌మాన్యాల‌తో పాటు ప్ర‌యాణికుల‌ని కూడా షాక్ కి గురి చేసింది.

ఇప్పటికే దీనిపై కేంద్రాన్ని సంప్రదించామని ఆయ‌న ప్ర‌క‌ట‌న చేశారు, అంతేకాదు 300 కిమీ అంత‌కంటే ఎక్కువ దూరం ప్ర‌యాణం ఉంటే ఇద్ద‌రు డ్రైవ‌ర్లు ఉండాలి అనే రూల్ కూడా తీసుకువ‌చ్చారు. అంతేకాదు రాత్రిపూట డ్రైవర్‌ నిద్రపోయేందుకు ఒక సీటు కేటాయించాల‌ని ట్రావెల్స్ యాజ‌మాన్యాల‌కు తెలియ‌చేశారు. రహదారుల వెంబడి స్పీడ్‌ గన్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం 40 కోట్లు కేటాయించింది. ఇక డ్రైవ‌ర్ కి ఎదురుగా వెనుక వ‌చ్చే వాహ‌నాల గురించి తెలియ‌డానికి రెండు కెమెరాలు పెట్టాలి అని తెలిపారు. ట్రావెల్స్ యాజ‌మాన్యాలకు.

కర్నూలు ఘటన తర్వాత 50 బస్సుల్ని సీజ్‌ చేశాం. కానీ ఆ యాజమాన్యాలు కోర్టుకు వెళ్లి తిరిగి అనుమతి తెచ్చుకున్నాయి. ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేస్తామ‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఏపీలో జ‌రిగిన కొన్ని బ‌స్సు ప్ర‌మాదాలు ఎంత జాగ్ర‌త్త‌గా ఉండాలో హెచ్చ‌రిస్తున్నాయి, ఎప్ప‌టి క‌ప్పుడు ప్ర‌భుత్వాలు కూడా చెకింగ్ చేయాల్సిందే, బ‌స్సు ఫిట్ నెస్, అలాగే వాహ‌నాల వేగం ఇవ‌న్నీ కూడా గ‌మ‌నించాలి.

మార్చి 26, 2026 ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని రాయవరం ద‌గ్గ‌ర‌ ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టిప్పర్ లారీని ఢీకొని తగులబడింది. ఈ ఘోర ప్రమాదంలో 5 నెలల శిశువుతో సహా 14 మంది సజీవ దహనం అయ్యారు. దాదాపు 28 మంది గాయపడ్డారు.

జనవరి 22, 2026 నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ బస్సు టైర్ పేలడంతో నియంత్రణ కోల్పోయి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు (డ్రైవర్లు, క్లీనర్) మరణించారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రమాదం (డిసెంబర్ 12, 2025): భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తున్న ప్రైవేట్ బస్సు చింతూరు ఘాట్ రోడ్డులో లోయలో పడింది. ఈ ప్రమాదంలో 9 మంది యాత్రికులు మరణించారు.

కర్నూలు చిన్నటేకూరు ప్రమాదం (అక్టోబర్ 24, 2025): హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను ఢీకొని ఈడ్చుకుపోవడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.

రంగారెడ్డి (చేవెళ్ల సమీపంలో) ప్రమాదం (నవంబర్ 3, 2025): తాండూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న TGSRTC బస్సును కంకర లోడుతో ఉన్న టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఎంత భీభత్సంగా జరిగిందంటే, టిప్పర్‌లోని కంకర మొత్తం బస్సులోకి పడి ప్రయాణికులు అందులోనే కూరుకుపోయారు. ఈ ఘటనలో 19 మంది అక్కడికక్కడే మరణించారు.

ఈ సంవ‌త్స‌రం గ‌త సంవ‌త్స‌రం జ‌రిగిన బ‌స్సు ప్ర‌మాదాలు, చాలా మందికి బ‌స్సులో ప్ర‌యాణించాలంటే భ‌యాన్ని మ‌రింత పెంచాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments