Homeవినోదంఅఖిల్ లెనిన్ విడుద‌ల డేట్ మారుతుందా?

అఖిల్ లెనిన్ విడుద‌ల డేట్ మారుతుందా?

అఖిల్ లెనిన్ విడుద‌ల డేట్ మారుతుందా?

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ ఓ మంచి సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు, తాజాగా ఆయ‌న లెనిన్ అనే సినిమా చేశారు, ఈ సినిమా రిలీజ్ డేట్ పై పెద్ద స‌స్పెన్స్ అయితే కొన సాగుతోంది. ఈ సినిమా విడుద‌ల‌కు వ‌రుస బ్రేకులు ప‌డుతున్నాయి. ఈ చిత్రంలో అఖిల్ స‌ర‌స‌న భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా న‌టిస్తున్నారు. ఇది పూర్తిగా గ్రామీణ నేప‌ధ్యంలో వ‌స్తున్న సినిమా. అలాగే యాక్ష‌న్ ఎలిమెంట్స్ కూడా ఇందులో ఉండ‌నున్నాయి. ఈ సినిమా గురించి చూస్తే షూటింగ్ కి ప్రారంభం ముందు నుంచి కొన్ని అడ్డంకులు వ‌చ్చాయి ముందు శ్రీలీల హీరోయిన్ అని అనుకున్నారు, ఓ షెడ్యూల్ కూడా షూట్ జ‌రిగింది. త‌ర్వాత డేట్స్ వ‌ల్ల ఆమె ఈ సినిమా నుంచి త‌ప్పుకుంది. ఇక త‌ర్వాత భాగ్య‌శ్రీ బోర్సేని తీసుకున్నారు. చివ‌ర‌కు షూటింగ్ అనుకున్న స‌మ‌యానికి కాస్త ఆల‌స్య‌మైనా, రిలీజ్ కు సిద్ద‌మైంది.

అయితే ఆ రిలీజ్ డేట్ గురించి పెద్ద చ‌ర్చ‌, విడుద‌ల తేది పై క్లారిటీ రావడం లేదు. ఈ చిత్రం ఈ నెల అంటే ఏప్రిల్ 20 విడుద‌ల చేయాలి అని ప్లాన్ చేశారు మేక‌ర్స్. కాని పెద్ది సినిమా విడుద‌ల అదే రోజు ఉండటంతో మే 1 కి మార్చారు, కానీ అప్ప‌టికి కూడా సినిమా పూర్తి కాక‌పోవ‌డంతో ఈ సినిమా వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. ఇక రీసెంట్ గా ఈ చిత్రం జూన్ 26 న రిలీజ్ చేస్తాము అని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

అయితే ఇక్క‌డ మ‌రో స‌మ‌స్య పెద్ది సినిమా మ‌ళ్లీ జూన్ 25 న విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఒక్క రోజు గ్యాప్ లో రెండు సినిమాలు విడుద‌ల అంటే క‌చ్చితంగా థియేట‌ర్ల స‌మ‌స్య వ‌స్తుంది. సో మ‌రోసారి లెనిన్ వెన‌క్కి వెళుతుందా అనే డౌట్ చాలా మంది నుంచి వ‌స్తుంది. సో మ‌రో వార్త ఏమిటి అంటే లెనిన్ జూలై నెల‌కు వెళ్ల‌వ‌చ్చు అంటున్నారు. సో పెద్ది సినిమా భారీ బ‌డ్జెట్ సినిమా పైగా చ‌ర‌ణ్ అఖిల్ మంచి ఫ్రెండ్స్. రెండు సినిమాల మ‌ధ్య ఏ స‌మ‌స్య ఉండ‌కూడ‌దు అంటే కాస్త వెన‌క్కి వెళ్లే అవ‌కాశం ఉంది అంటున్నారు. సో మొత్తానికి విడుద‌ల‌కు సంబంధించి ఎన్ని డేట్స్ వినిపిస్తున్నా, మంచి కంటెంట్ ఉంటే ఎప్పుడు విడుద‌ల ఉన్నా స‌క్స‌స్ అవుతుంది. క‌చ్చితంగా అఖిల్ కు ఈ సారి మంచి విజ‌యం ప‌క్కా అంటున్నారు ఫ్యాన్స్ . చూడాలి మ‌రి రెండు నిర్మాణ సంస్ధ‌ల నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న‌లు వ‌స్తాయో.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments