Homeవినోదంపెద్ది చ‌ర‌ణ్- బుచ్చిబాబు రెమ్యున‌రేష‌న్ ఎంతంటే

పెద్ది చ‌ర‌ణ్- బుచ్చిబాబు రెమ్యున‌రేష‌న్ ఎంతంటే

పెద్ది చ‌ర‌ణ్- బుచ్చిబాబు రెమ్యున‌రేష‌న్ ఎంతంటే

ఈ ఏడాది జూన్ 4 వ తేదిన రామ్ చ‌ర‌ణ్ న‌టించిన పెద్ది సినిమా విడుద‌ల కానుంది. ఈ సినిమాకి ఉప్పెన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర‌ప‌డ‌టంతో ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు వేగ‌వంతం చేశారు టీమ్. ఇక సినిమా వ‌ర్క్ అంతా ఫినిష్ అయింది. ఈ చిత్రాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డ‌మే లేట్. అందుకే ట్రైల‌ర్ విడుద‌ల చేసిన త‌ర్వాత సినిమాని బాగా ప్ర‌మోట్ చేస్తున్నారు.

ఇప్ప‌టికే ట్రైల‌ర్ ఓ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.. మే 18 న గ్రాండ్ గా ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. డిజిట‌ల్ సోష‌ల్ మీడియాలో ఓ ట్రెండ్ క్రియేట్ చేస్తోంది ఈ ట్రైల‌ర్. ఇప్ప‌టికే పెద్ది ట్రైల‌ర్ టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ సినిమా బ‌డ్జెట్ గురించి విప‌రీత‌మైన బ‌జ్ క‌నిపిస్తోంది. ఈ సినిమా బ‌డ్జెట్ సుమారు 300 కోట్ల వ‌ర‌కూ అయ్యి ఉండ‌వ‌చ్చు అంటున్నారు.ఈ సినిమాలో భారీ కాస్టింగ్ ఉంది. న‌టీన‌టుల‌కి భారీ రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేశారు.

ఇక చ‌ర‌ణ్ కి దాదాపు 80 నుంచి 100 కోట్ల రెమ్యున‌రేష‌న్ అని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు నిర్మాత‌ల ద‌గ్గర ఎలాంటి అడ్వాన్స్ తీసుకోకుండా సినిమా విడుద‌ల త‌ర్వాత వ‌చ్చిన లాభాల నుంచి, త‌న రెమ్యున‌రేష‌న్ చ‌ర‌ణ్ తీసుకుంటారు అనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే నిర్మాత‌ల కోసం ఆలోచించి ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. ఇక ద‌ర్శ‌కుడు బుచ్చిబాబుకి కూడా సుమారు 20 కోట్ల రెమ్యున‌రేష‌న్ అని తెలుస్తోంది.
ఈ సినిమాలో బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఆమెకి ఆరు నుంచి 8 కోట్ల మ‌ధ్య రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌చ్చు అని అంటున్నారు.

ఇక శివ‌రాజ్ కుమార్ కి కూడా అత్యంత భారీ రెమ్యున‌రేష‌న్ ఇచ్చారు అనే టాక్ వినిపిస్తోంది.
దివ్యేందు త్రిపాఠి, జగపతి బాబు, బొమన్ ఇరానీ కీల‌క పాత్ర‌లు చేశారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ మూవీకి స్వరాలు సమకూర్చారు. సో మొత్తంగా ఈ సినిమా బ‌డ్జెట్ ఈజీగా మేకింగ్ రెమ్యున‌రేషన్ ప్ర‌మోష‌న్స్ తో 300 కోట్ల మార్క్ దాటుతుంది అంటున్నారు అన‌లిస్టులు.

మైత్రి నిర్మాత‌లు ఎంతో ప్ర‌స్టేజ్ గా ఈ సినిమా తీసుకువ‌చ్చారు. క‌చ్చితంగా మంచి బిజినెస్ కూడా చేస్తోంది. అయితే ప్ర‌స్తుతం వంద కోట్ల రెమ్యున‌రేష‌న్ క్ల‌బ్ లో ఉన్న హీరోలు క‌చ్చితంగా నిర్మాత‌కు స‌పోర్ట్ గా, లాభాల నుంచి వాటా తీసుకోవాలి అని నిర్ణ‌యించారు త‌మిళ‌నాడులో. తాజాగా మ‌న తెలుగు హీరోలు కూడా అదే పాటిస్తారు అనే టాక్ వినిపిస్తోంది.

 

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments