మన దేశంలో దూర ప్రాంతాలకు ప్రయాణం అంటే ట్రైన్ జర్నీ అందరికి కంఫర్ట్ గా ఉంటుంది.
విమాన ప్రయాణం తొందరగా డెస్టినేషన్ చేరుకోవచ్చు కానీ ఖర్చు ఎక్కువ. ఇది అందరూ బేర్ చేయలేనిది. అందుకే ట్రైన్ జర్నీకే సామాన్యులు, మిడిల్ క్లాస్ కూడా ఇంట్రస్ట్ చూపిస్తారు. అయితే ట్రైన్ జర్నీ చేసే వారి సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోంది కాని తగ్గడం లేదు. అందుకు అనుగునంగా ట్రైన్స్ మాత్రం కొత్తవి నడపడం లేదు. వందలాది మంది వెయిటింగ్ లిస్ట్ వల్ల బస్సు ప్రయాణాలు చేస్తున్నారు. రైల్వే శాఖకి బిజీ మార్గాల్లో కొత్త రైళ్లని ప్రవేశ పెట్టాలని ఇటు ప్రజల నుంచి నాయకుల నుంచి ఎన్నో రిక్వస్టులు వస్తున్నాయి.
అయితే ట్రాక్ సమస్య, కొత్త రైళ్లు లేకపోవడం, సేమ్ టైమ్ కి ఆట్రాక్ పై పాత ట్రైన్స్ వెళ్లే పరిస్దితుల వల్ల, సమయం షార్ట్ రావడం కూడా కొత్త ట్రైన్స్ ఏర్పాటుకి ఆటంకం, అయితే దీనికి సొల్యుషన్ కొత్త రైల్వే లైన్లు ఏర్పాటు చేయడమే .ప్రస్తుతం వందే భారత్, అమృత్ భారత్ రైళ్లు నడుస్తున్నాయి. వేగంగా తమ ప్రయాణం వందే భారత్ రైళ్ల ద్వారా ప్రయాణికులు చేస్తున్నారు.
ఇలాంటి వేళ తాజాగా రైల్వే శాఖ అధికారులు గుడ్ న్యూస్ తెలియచేస్తున్నారు. దేశ వ్యాప్తంగా 260 వందే భారత్ రైళ్లు నడపడానికి సిద్దం అవుతున్నారట. ఇందులో మేజర్ స్లీపర్ రైళ్లు నడపనున్నారు. రాత్రి పూట ప్రయాణాలకు సౌలభ్యంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. రద్దీ ఎక్కువ ఉన్నా ప్రాంతాలు చూసి ఆ రూట్లలో నడపటానికి సిద్దం అవుతోంది రైల్వే శాఖ. ఇప్పటికే రైల్వే ట్రాఫిక్ టీమ్ కి ఈ రద్దీ రూట్లు ఏమి ఉన్నాయి, ఎక్కువ వెయిటింగ్ లిస్ట్ ఎక్కడ నమోదు అవుతున్నాయి అనే దానిపై వర్క్ చేస్తున్నారు. వాటి అన్నింటిని అధికారులు పరిశీలించి ఈ కొత్త రైళ్లని ఆయా రూట్లలో నడపనున్నారు. అయితే ట్రాక్ మరమ్మత్తులు, కొత్త ట్రాక్ పనులు కూడా చేయాలి కాబట్టి ఈ రూట్లకి సంబంధించి మ్యాపింగ్ చేస్తున్నారు అధికారులు.
అయితే ప్రస్తుతానికి ఏఏ రూట్లలో ఈ ట్రైన్స్ నడుస్తాయి అనేది ఇంకా ప్రకటించలేదు. కానీ చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ లో మాత్రం ఈ రైళ్లు సిద్దం అవుతున్నాయి. ఇక ఎప్పుడు వీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తారు అనేదానిపై స్పష్టమైన డేట్ ఇవ్వలేదు రైల్వేశాఖ. అయితే ఈ ఏడాది దసరా సమయానికి కొన్ని ట్రైన్స్ తీసుకువచ్చే అవకాశం ఉంది.
1.ఇక ఆర్ ఏసీ లేకుండా బుకింగ్ కన్పమ్ చేసేలా కొత్తగా మార్పులు వీటికి చేయనున్నారు. అంటే వెయిటింగ్ లిస్ట్ అనేది లేకుండా టికెట్ కన్ ఫర్మ్ జరుగుతుంది.
2.ఇక వీటిని ఆన్ లైన్ లో మాత్రమే బుక్ చేసుకునేలా సౌకర్యం కల్పిస్తున్నారు.
3. చార్జీలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండేలా నిర్ణయిస్తారు అని తెలుస్తోంది. 350 నుంచి 400 కిలోమీటర్ల దూరానికి 960 రూపాయల చార్జ్ వసూలు చేయనున్నారు.
4.50 ఏళ్లు దాటిన వారికి దిగువ బెర్తులు కేటాయిస్తారు. టికెట్ కన్ ఫర్మ్ టైమ్ లో కేటాయిస్తారు
5.ఇక అత్యంత వేగంగా ఈ రైళ్లు ప్రయాణిస్తాయి ఈ రైలు గంటకి 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది
6.అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక వ్యవస్ద ఉంటుంది. అలాగే KAVACH వ్యవస్ధ కూడా తీసుకువస్తున్నారు.
7.కోచ్ లోపల ప్రయాణికుల సౌకర్యం కోసం యూవీ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు.
8.పై బెర్తులు ఎక్కేవారి కోసం సౌకర్యవంతమైన మెట్లు ఏర్పాటు చేస్తున్నారు.
9.ఈ ట్రైన్స్ అన్నీ జోన్స్ కి కేటాయిస్తారు. ఈ కొత్త ట్రైన్స్ వస్తే ప్రయాణికుల కష్టాలు తీరినట్టే. మరి తెలుగు రాష్ట్రాలకు ఎన్ని ట్రైన్స్ కేటాయిస్తారో చూడాలి.

