బాలయ్యతో సినిమా చేయాలంటే అంత ఈజీ కాదు. గతంలో ఆయన చాలా మంది దర్శకులకి తన అనుకున్న వారికి అవకాశాలు ఇచ్చేవారు. కానీ రోజులు మారాయి బాలయ్య అభిప్రాయం కధలు ఎంచుకునే తీరు మారింది. కొత్త దర్శకులు మంచి కంటెంట్ కథ ఇచ్చే దర్శకులతోనే బాలయ్య సినిమాలు చేస్తున్నారు. ఎందుకంటే గత చిత్రాల పరంపరని మనం చూస్తే ఇట్టే అర్దమవుతుంది. తాజాగా ఓ వార్త ఇప్పుడు టాలీవుడ్ లో బాగా వైరల్ అవుతోంది. నందమూరి బాలకృష్ణ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో త్వరలో ఓ సినిమా చేయనున్నారు అనే వార్త వినిపిస్తోంది.
నిజంగా ఫ్యాన్స్ కి ఇది కిక్కిచ్చే వార్త , గతంలో పైసా వసూల్ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చింది. బాలయ్యని మాస్ అవతార్ లో అద్భుతంగా చూపించారు ఆయన. ఇప్పుడు బాలయ్యతో సినిమా ఒకే అయితే ఆయన ఎలా చూపిస్తారా అని అందరూ ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. పూరీతో సినిమా అనేసరికి కొత్త జోష్ కనిపిస్తోంది అందరిలో.దీనికి సంబందించి పూరీ జగన్నాద్ టీమ్ వర్క్ కూడా చేస్తున్నారట. కథ విషయం ఫైనల్ అయిందని త్వరలోనే దీనిపై అధికారక ప్రకటన కూడా వస్తుందని టాలీవుడ్ ఇన్ సైడ్ టాక్ నడుస్తోంది.
ఈ సినిమాపై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా కచ్చితంగా వీరికాంబినేషన్ రిపీట్ అవుతుంది అంటున్నారు. ప్రస్తుతం బాలయ్య చేస్తున్న సినిమాలు ఆ దర్శకులని గమనిస్తే, బాబీ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని ఇలాంటి దర్శకులతో వర్క్ చేస్తున్నారు. వీరందరూ టాలీవుడ్ లో టాప్ సినిమాలు తీశారు. సక్సస్ రేసులో ఉన్నారు. చెప్పాలంటే పూరీ జగన్నాద్ కూడా వీరిందరి కంటే సీనియర్. అందుకే బాలయ్య కూడా జగన్ తో సినిమా అనేసరికి ఒకే చెబుతున్నారు.
ఇందులో బాలయ్యని చాలా మాస్ గా చూపించనున్నారని ఫ్యామిలీ ఎమోషన్ టచ్ తో పాటు, ఓ క్రైమ్ కి లింక్ చేస్తూ ఈ స్టోరీ రానుందని తెలుస్తోంది. పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ సేతుపతితో ఓ కొత్త సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. ఈ సినిమా తర్వాత బాలయ్య సినిమా సెట్స్ పైకి వెళ్లవచ్చు.అయితే బాలయ్య లైనప్ కూడా చాలా బిజీ షెడ్యూల్ తో కనిపిస్తుంది..గోపీచంద్ మలినేని సినిమా చేస్తున్నారు, ఆ తర్వాత అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయనున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత పూరి సినిమా ఒకే అవ్వచ్చు అని టాక్ వినిపిస్తోంది.

