Homeఆంధ్ర ప్రదేశ్బ‌స్సు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారికి ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించిన సీఎం చంద్ర‌బాబు

బ‌స్సు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారికి ఎక్స్ గ్రేషియా ప్ర‌క‌టించిన సీఎం చంద్ర‌బాబు

ఇటీవ‌ల ట్రావెల్ బ‌స్సు ప్ర‌మాదాలు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. క్షేమంగా గ‌మ్య‌స్దానానికి చేరుకునే వ‌ర‌కూ ఏ ప్ర‌యాణం ఎలా మారుతుందో అనే భ‌యం, ఇటు ప్ర‌యాణికుల‌కి ఆ కుటుంబ స‌భ్యుల‌కి కూడా ఉంటోంది. మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది అత్యంత దుర‌దృష్ట‌క‌రం. ఆ ప్ర‌మాదం నుంచి ప్ర‌యాణికులు బ‌య‌ట‌కు రాలేక‌పోయారు. బ‌స్సులో ముందు వ‌రుస‌లో కూర్చున్న వారు ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. కొంద‌రికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక వెనుక ఉన్న వారిని, పైన సీట్లో ప‌డుకున్న వారిని అగ్ని కిల‌లు చుట్టేశాయి చివ‌ర‌కు స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు.

డ్రైవర్‌ నిర్లక్ష్యానికి 13మంది ప్రాణాలు కోల్పోయారు.మార్కాపురం జిల్లా రాయవరం దగ్గర ట్రావెల్ బస్సు టిప్పర్‌ను ఢీకొట్టింది. ఇక్క‌డ డ్రైవ‌ర్ నిర్లక్ష్యం క‌నిపిస్తోందనే వార్త‌లు వినిపిస్తున్నాయి.ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే స్ధానికులు రెస్క్యూ టీమ్ సాయంతో 26 మందిని మార్కాపురం ఆస్ప‌త్రికి తీసుకువెళ్లారు. ఇక ఏడుగురి పరిస్దితి అత్యంత విష‌యంగా ఉంది అని తెలుస్తోంది.

హరికృష్ణ ట్రావెల్స్‌ బస్సు.. జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కలిగిరి వెళ్లుండగా ఈ ప్రమాదం జరిగింది.
పలకల క్వారీ దగ్గర ఎదురుగా వస్తోన్న టిప్పర్‌ను ఢీకొట్టింది ట్రావెల్స్‌ బస్సు. ఆ డీజీల్ ట్యాంక్ ప‌గ‌ల‌డంతో పెద్ద ఎత్తున మంటలు చెల‌రేగాయి.ఈ ప్ర‌మాదంపై ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డితో పాటు, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ కూడా విచారం వ్య‌క్తం చేశారు. అమ‌రావ‌తిలో కేబినెట్ స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశంలో బ‌స్సు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారికి సంతాపం ప్ర‌క‌టించారు మంత్రులు. ఆ బ‌స్సు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన ప్ర‌యాణికుల కుటుంబాల‌ని ఆదుకుంటామ‌ని సీఎం తెలియ‌చేశారు.

ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆ బ‌స్సు ప్రమాదంలో గాయ‌ప‌డిన వారికి వైద్య సేవ‌లు అందించాలి అని నిరంత‌రం అక్క‌డ ప‌రిస్దితి ప‌ర్య‌వేక్షించాలి అని అధికారుల‌కి తెలిపారు. ఏది ఏమైనా రోడ్డు పై ప్ర‌యాణం అంటే భ‌య‌ప‌డే ప‌రిస్దితి క‌నిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments