Homeజాతీయమ‌హిళ‌ల‌కే కాదు పురుషుల‌కి బ‌స్సు ప్ర‌యాణం ఫ్రీ

మ‌హిళ‌ల‌కే కాదు పురుషుల‌కి బ‌స్సు ప్ర‌యాణం ఫ్రీ

మ‌హిళ‌ల‌కే కాదు పురుషుల‌కి బ‌స్సు ప్ర‌యాణం ఫ్రీ

నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. ఈ స‌మ‌యంలో అన్నిటి కంటే ఎక్కువ‌గా త‌మిళ‌నాడు ఎన్నిక‌ల గురించి చ‌ర్చ సాగుతోంది. ఎందుకంటే త‌మిళ‌నాడులో సినిమా న‌టులు రాజ‌కీయాల్లో ఎక్కువ మంది ఉన్నారు. అంతేకాకుండా డీఎంకే అధినేత స్టాలిన్ కాంగ్రెస్ పార్టీ క‌మ‌ల్ ఓ ప‌క్క ఉంటే , మ‌రో ప‌క్క విజ‌య్ ఒంట‌రి పోరాటం చేస్తున్నారు. మ‌రో ప‌క్క అన్నాడీఎంకే బీజేపీ క‌లిసి పోటి చేస్తున్నాయి. ఇలాంటి వేళ ఎన్నిక‌ల హామీల గురించి పెద్ద ఎత్తున చ‌ర్చ సాగుతోంది.

ముఖ్యంగా ఉచిత ప‌థ‌కాల గురించి త‌మిళ‌నాడులో ప్ర‌జ‌లు రాజ‌కీయ పార్టీలు చ‌ర్చ‌కు తావిస్తున్నాయి. ఇక అన్నీ పార్టీల మ‌ధ్య ఉచిత ప‌థ‌కాల గురించి యుద్దం మొద‌లైంది. ఒక‌రిని చూసి మ‌రొక‌రు తాయిలాలు ప్ర‌క‌టిస్తున్నారు. ఇప్ప‌టికే స్టాలిన్ ప్ర‌భుత్వం డీఎంకే పార్టీ అక్క‌డ ఉచితంగా బ‌స్సు ప్ర‌యాణం మ‌హిళ‌ల‌కు క‌ల్పిస్తోంది. అయితే తాజాగా అన్నా డీఎంకే ఈ ప‌థ‌కంలో మ‌హిళ‌ల‌కే కాదు పురుషుల‌కి కూడా ఉచితంగా బ‌స్సు ప్ర‌యాణం క‌ల్పిస్తాము అని హ‌మీ ఇస్తోంది. తాము గెలిస్తే రాష్ట్రం అంతా పురుషులు కూడా ఇలా ఉచితంగా బ‌స్సు ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు అని చెబుతోంది.

ఇక 60 ఏళ్లు దాటిన వారికి పెన్ష‌న పెంపు, మ‌హిళ‌లు పొందే ఆర్దిక సాయం కూడా డ‌బుల్ చేస్తాము అని ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నాయి. ఇక రేష‌న్ కార్డు ఉంటే వారికి ఉచిత ఫ్రిడ్జ్ ఇస్తామంటున్నారు. పేద మ‌హిళ‌లు బండి కొనుక్కుంటే వారికి స‌బ్సిడీ ఇస్తాము అంటున్నారు. ఇళ్లు లేని పేద‌ల‌కు రెండు సంవ‌త్స‌రాల్లో ఇళ్లు క‌ట్టిస్తామ‌ని చెబుతున్నారు. తాజాగా అన్నాడీఎంకే హామీలు చూసి జ‌నం షాక‌వుతున్నారు. బ‌డ్జెట్ మాత్రం అలాగే ఉంటుంది. మ‌రి ఈ కొత్త ప‌థ‌కాల‌కి డబ్బులు ఎక్క‌డ నుంచి తీసుకువ‌స్తారు అనేది ప్ర‌జ‌ల నుంచి పెద్ద ప్ర‌శ్నగా వ‌స్తోంది.

ఏపీలో తెలంగాణ‌లో త‌మిళ‌నాడులో ఈ ఉచిత బ‌స్సు ప్ర‌యాణాలు ప్ర‌భుత్వాలు క‌ల్పిస్తున్నాయి. ఇక పురుషుల‌కి కూడా ఉచితంగా ప్ర‌క‌టిస్తే, కేవ‌లం లాంగ్ రూట్లో వెళ్లే బ‌స్సుల నుంచి వ‌చ్చే ఆదాయం త‌ప్ప ప్ర‌భుత్వ రోడ్డు ర‌వాణా సంస్ధ‌ల‌కు ఆదాయం ఉండ‌దు. ఇది రాష్ట్ర ఆర్దికస్దితి పై ప్ర‌భావం చూపిస్తుంద‌ని, అంతేకాకుండా ఆటో డ్రైవ‌ర్లు మ‌రింత రోడ్డున ప‌డే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు తెలియ‌చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments