అడవిశేష్ తాజా చిత్రం డెకాయిట్ ఈ సినిమా గురించి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా విడుదలకు ముందు సంచలనం క్రియేట్ చేస్తోంది. ఈ సినమా ఏప్రిల్ 10 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అంతేకాదు ఈ మూవీ పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక ముందు రోజు అమెరికాలో ప్రీమియర్స్ పడతాయి అనే విషయం తెలిసిందే. ఈ సినిమాకి అదిరిపోయే రేంజ్ లో ఓపెనింగ్స్ కనిపిస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా..
ఏప్రిల్ 9 వ తేదికి యూఎస్ ప్రీమియర్ల ద్వారా ఈ సినిమా 220,000 డాలర్లకు సుమారు రూ. 1.80 కోట్లు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి భిన్నంగా లేదు. ప్రముఖ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోలో గత 24 గంటల్లోనే దాదాపు 30,000 టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ ఖాయం అని అంటున్నారు. మొత్తం అమెరికాలో 14 వేల టికెట్లు అమ్ముడయ్యాయి, గతంలో అడవి శేష్ నటించిన మేజర్ చిత్రానికి సంబంధించి వసూల్లు కూడా దాటేసింది. ఈ సినిమా ఓవర్సీస్లో మోక్ష మూవీస్ పంపిణీ చేస్తోంది.
ఈ సినిమాకి షనీల్ దర్శకత్వం వహిస్తున్నారు, ఇక ఈ సినిమాకి అడవి శేష్, అలాగే షనీల్ కలిసి కథ అందిస్తున్నారు. ఇక ఈ మూవీ హిందీ అలాగే తెలుగు రెండు భాషల్లో ఒకేసారి తెరకెక్కించారు.
ప్రకాశ్ రాజ్, అతుల్ కులకర్ణి, అనురాగ్ కశ్యప్ వంటి ప్రముఖ నటులు ఇందులో కీలక రోల్స్ చేశారు.ఆమిర్ ఖాన్ కూడా ట్రైలర్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు, సో మొత్తానికి ఈ సినిమాపై మంచి బజ్ కనిపిస్తోంది.అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో, సుప్రియా యార్లగడ్డ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

