HomeFinanceబంగారం ధ‌ర‌లకు రెక్క‌లు - ఎప్పుడు త‌గ్గుతాయంటే?

బంగారం ధ‌ర‌లకు రెక్క‌లు – ఎప్పుడు త‌గ్గుతాయంటే?

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దంతో బంగారం ధ‌ర‌లు ఒక్క‌సారిగా 12 శాతం పెరుగుద‌ల న‌మోదు చేశాయి. ఇక మిగిలిన దేశాల్లో కూడా బంగారం ధ‌ర‌లు క్ర‌మంగా పెర‌గ‌డం మొద‌లు అయ్యాయి. ఈ రెండు దేశాల్లో ఉద్రిక్త ప‌రిస్ధితులు ఏర్ప‌డ‌టంతో ప్ర‌జ‌లు త‌మకు సుర‌క్షిత పెట్టుబ‌డిగా స్టాక్స్ – డిపాజిట్స్ కంటే బంగారం లో పెట్టుబ‌డి మేలు అని భావిస్తున్నారు . అందుకే బంగారం ధ‌ర మ‌ళ్లీ అమాంతం పెరిగింది. శ‌నివారం సాయంత్రం నుంచి పెరుగుద‌ల న‌మోదు చేసిన బంగారం ధ‌ర సోమ‌వారం ఉద‌యం వ‌ర‌కూ హై ర్యాలీ న‌మోదు చేసింది. ఇలాంటి యుద్ద వాతావ‌ర‌ణ ప‌రిస్దితులు ఉన్న స‌మ‌యంలో ప్ర‌జ‌లు పెట్టుబ‌డి పెట్టేందుకు బంగారం పై న‌మ్మ‌కం ఉంచుతారు.

Gold price climbs ₹10 to ₹98,410; silver falls ₹100, trades at ₹1,08,900 | Commodity News - Business Standard

మొన్న‌టి వ‌ర‌కూ క్ర‌మంగా 25 వేలు త‌గ్గిన బంగారం ధ‌ర ఒక్క‌సారిగా 1,65,000 చేరింది. ఇక ఇలాంటి యుద్ద‌వాతావ‌ర‌ణ ప‌రిస్దితులు మ‌రో నెల వ‌ర‌కూ ఉంటే క‌చ్చింతంగా 24 క్యారెట్ల బంగారం ధ‌ర తులం 2 లక్ష‌ల మార్క్ చేరుకోవ‌చ్చు అంటున్నారు అంత‌ర్జాతీయ ట్రేడ్ నిపుణులు. అయితే మ‌నదేశంలో అత్య‌వ‌స‌రం అయితేనే బంగారం కొనుగోలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం పెళ్లిళ్ల సీజ‌న కావ‌డంతో డిమాండ్ కూడా అమాంతం పెరిగింది. వెండి రేటు కేజీ నాలుగు ల‌క్ష‌ల నుంచి 2.80 ల‌క్ష‌ల‌కు చేర‌డంతో , వెండి కంటే బంగారం పై పెట్టుబ‌డి సుర‌క్షిత‌మ‌ని భావిస్తున్నారు. మొత్తానికి ఇరాన్ ఇజ్రాయిల్ యుద్దంతో బంగారం ధ‌ర‌ల‌కు రెక్క‌లు వ‌చ్చాయి అనేది స్ప‌ష్టంగా తెలుస్తోంది.

వ‌చ్చే రోజుల్లో ఉద్రిక్త ప‌రిస్దితులు సాధార‌ణం అయితే ధ‌ర‌లు త‌గ్గ‌వ‌చ్చు లేదంటే , అంత‌ర్జాతీయంగా బంగారం ధ‌ర‌లు భారీగా పెరుగుతాయంటున్నారు.Will gold retain its value in the future? | GOLDMARKET

March 3- 2026 ఈ రోజు బంగారం ధ‌ర‌లు చూసుకుంటే
24-karat 10 grams 1,69,800
22-karat 10 grams 1,55,650 కి ట్రేడ్ అవుతున్నాయి

ఒక‌వేళ యుద్ద ప‌రిస్దితులు ఇలాగే ఉంటే క‌చ్చింగా స్టాక్స్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు చాలా మంది ఆస‌క్తి చూపించ‌రు. వారు అంద‌రూ బంగారం పై ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే గోల్డ్ ర‌ష్ ఇలా కొన‌సాగితే క‌చ్చితంగా 2 ల‌క్ష‌ల మార్క్ అందుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఒక‌వేళ సాధార‌ణ ప‌రిస్దితులు ఉంటే మాత్రం మ‌రో 10 వేల నుంచి 15 వేల మ‌ధ్య ధ‌ర‌లు పెర‌గ‌డం త‌గ్గ‌డం ఉండ‌వ‌చ్చు అంటున్నారు ట్రేడ్ అన‌లిస్టులు.

ఇటీవ‌ల వెండికి భారీగా డిమాండ్ పెరిగింది. ఈ స‌మ‌యంలో వెండి అమ్మ‌కాలు కొనుగోళ్లు భారీగా జ‌రిగాయి. సోలార్ ప్యానెల్ త‌యారీ అలాగే కొన్ని వ‌స్తువుల వాడ‌కంలో చిప్ ఆధారిత ప‌రిశ్ర‌మ‌ల్లో వెండి వాడ‌కం ఎక్కువ అవ్వ‌డంతో దానికి అమాంతం డిమాండ్ పెరిగింది. దాదాపు కేజీ నాలుగు ల‌క్ష‌ల మార్క్ దాటింది వెండి ధ‌ర‌, అయితే వెండి విష‌యంలో పెట్టుబ‌డిగా పెద్దగా ప్ర‌జ‌లు ఆస‌క్తి చూపించ‌రు. కానీ బంగారం విష‌యంలో పెట్టుబ‌డి సాధ‌నంగా ఆలోచిస్తారు. అందుకే ఏదైనా దేశంలో ఇలాంటి అస్ధిర ప‌రిస్దితి వ‌చ్చిన స‌మ‌యంలో వారు పెట్టుబ‌డులు అన్నీ ఉప‌సంహ‌రించుకోవ‌డం, లేదంటే కొత్త‌గా పెట్టుబ‌డి పెట్టాలంటే దానిని స్టాక్స్, మ్యూచువ‌ల్ ఫండ్స్ సేవింగ్స్ లో కాకుండా ఇలా బంగారం లో పెట్టుబ‌డి పెట్ట‌డం జ‌రుగుతుంది.

ప్ర‌స్తుతం ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికా వార్ నేప‌థ్యంలో ఇదే ప‌రిస్దితి క‌నిపిస్తుంది. ఇన్వెస్ట‌ర్లు అంద‌రూ బంగారం పైనే మొగ్గు చూపుతున్నారు. శ‌నివారం నుంచి ట్రేడ్ లో 16 శాతం అమ్మ‌కాల ర్యాలీ జ‌రిగితే, 32 శాతం కొనుగోళ్ల ర్యాలీ జ‌రిగింది. దీంతో బంగారానికి డిమాండ్ 24 గంట‌ల్లోనే పెరిగింది. అందుకే రానున్న రోజుల్లో బంగారానికి మ‌రింత డిమాండ్ పెర‌గ‌వ‌చ్చు ధ‌ర‌లు అమాంతం ఆకాశాన్నంట‌వచ్చు అనేది ప్ర‌స్తుత ప‌రిస్దితులు తెలియ‌చేస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments