Homeఆంధ్ర ప్రదేశ్మ‌హానాడు శ్రీకాకుళం కాదు - ఈసారి నెల్లూరులో

మ‌హానాడు శ్రీకాకుళం కాదు – ఈసారి నెల్లూరులో

మ‌హానాడు శ్రీకాకుళం కాదు – ఈసారి నెల్లూరులో

తెలుగుదేశం పార్టీ నిర్వ‌హించే పసుపు పండుగ అంటే మ‌హానాడు గురించి ఇప్పుడు అంద‌రూ ఎదురుచూస్తున్నారు. ఈ సారి శ్రీకాకుళం జిల్లాలో మ‌హానాడు నిర్వ‌హించాలి అని భావించారు. అయితే ఇప్ప‌డు ఈ ప్రాంతంలో కాకుండా మ‌రో ప్రాంతానికి మ‌హానాడు వేదిక మార‌నుంది. మే 27, 28, 29 తేదీల్లో సిక్కోలు వేదికగా ఈ కార్యక్రమాన్ని చేయాలి అని భావించారు. అయితే తాజాగా ఈ వేదిక‌ని నెల్లూరుకు మార్చనున్నారు. ఇప్ప‌టికే దీని గురించి పార్టీ నాయ‌క‌త్వం చ‌ర్చ‌లు జ‌రుపుతోంది. మ‌రో రెండు రోజుల్లో సీఎం చంద్ర‌బాబు ఈ ప్రాంతాన్ని ఫైన‌ల్ చేయ‌నున్నారు.

అయితే దీనికి గ‌ల కార‌ణాలు చూస్తే. ప్రధాని న‌రేంద్ర‌మోదీ ఉత్త‌రాంధ్రా ప‌ర్య‌ట‌న‌కు రానున్నారు. అందుకే మ‌హానాడు వేదిక మారుతుంది అని తెలుస్తోంది. జూన్ నెల‌లో ప్ర‌ధాని మోదీ భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభించ‌నున్నారు. ఉత్త‌రాంధ్రాలో ఆయ‌న ప‌ర్య‌ట‌న జరుగుతుంది. అంతేకాదు ఆరోజు మ‌రిన్ని అభివృద్ది కార్య‌క్ర‌మాల్లో ఆయ‌న పాల్గొంటారు. అయితే అదే కార్య‌క్ర‌మానికి రెండు వారాల ముందు మ‌హానాడు జ‌రుగుతుంది.

ఒకే స‌మ‌యంలో రెండు పెద్ద ఈవెంట్లు అక్క‌డ జ‌ర‌గ‌డం సెక్యూరిటీ ఇబ్బందులు ఉంటాయి. అంతేకాదు ప్ర‌ధాని ప‌ర్య‌ట‌న అంటే 15 రోజులు ముందు నుంచి అక్క‌డ ఏర్పాట్లు జ‌రుగుతాయి. సో ఒకే ప్రాంతంలో భ‌ద్రాతా ఏర్పాట్ల‌లో అధికారులు బిజీగా ఉంటారు. ఢిల్లీ నుంచి ప్ర‌త్యేక బ‌ల‌గాల ఆధినంలో ఆ ప్రాంతాలు ఉంటాయి. అందుకే శ్రీకాకుళం కాకుండా ఈసారి నెల్లూరులో ఈ స‌భ పెట్టుకోవాలి అని ఆలోచిస్తున్నార‌ట‌.

సో నెల్లూరు జిల్లాలో ఎక్క‌డ ఈ మ‌హానాడు నిర్వ‌హిస్తారు అనేది ఇప్పుడు పెద్ద స‌స్పెన్స్ . అయితే ముందు నుంచి శ్రీకాకుళం నేత‌లు ఇక్క‌డ మ‌హానాడు ఉంటుంది అని ఆశ‌లు పెట్టుకున్నారు. చివ‌రి నిమిషంలో ఈ వార్త కాస్త షాక్ కి గురిచేసింది. గ‌త ఏడాది మ‌హానాడుని క‌డ‌ప‌లో ఏర్పాటు చేశారు. వ‌చ్చేసారి కోస్తాలో ఏర్పాటు చేయాలి అని భావించారు. సో ఇప్పుడు నెల్లూరుకి మార‌నుంది ఈ వేదిక‌. సో మే 3 వ తేది లోపు మ‌హానాడు వేదిక గురించి క్లారిటీ రానుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments