Homeజాతీయస్నేహమంటే ఇదే - మ‌న‌కు సంక్షోభంలో సాయం చేసిన దేశాలు ఇవే

స్నేహమంటే ఇదే – మ‌న‌కు సంక్షోభంలో సాయం చేసిన దేశాలు ఇవే

స్నేహమంటే ఇదే
మ‌న‌కు సంక్షోభంలో సాయం చేసిన దేశాలు ఇవే

మిడిల్ ఈస్ట్ లో యుద్ద‌మేఘాలు క‌మ్ముకోవ‌డంతో ప‌రిస్దితి గ‌త నెల రోజులుగా ఎలా మారిందో తెలిసిందే. ఇజ్రాయిల్ అమెరికా ఇరాన్ ఈ మూడు దేశాల వ‌ల్ల అన్నీ దేశాలు కూడా ఇబ్బంది ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా గ్యాస్ పెట్ర‌లో డీజీల్ సంక్షోభం ఈ దేశాల‌పై చాలా ఎఫెక్ట్ చూపించింది. ఇరాన్ హుర్ముజ్ జ‌ల‌సంధిని క్లోజ్ చేయ‌డంతో దాదాపు 60 దేశాల‌కు చ‌మురు ర‌వాణా నిలిచిపోయింది. ఇక మ‌న దేశం పై కూడా చాలా ఎఫెక్ట్ ప‌డింది. ఎందుకంటే మ‌న‌కు దిగుమ‌తి అయ్యే చ‌మురు ఎల్ పీజీ దాదాపు 60 శాతం ఈ మార్గం ద్వారా వ‌స్తుంది. అయితే క‌ష్ట‌కాలంలో భార‌త్ కు కొన్ని దేశాలు ఎంతో సాయం చేశాయి. గ‌త నెల‌లో పోలిస్తే ఈనెల చాలా వ‌ర‌కూ ఈ గండం నుంచి బ‌య‌ట‌ప‌డ్డాం.

గ‌త నెల‌లో చ‌మురుసంక్షోభం లేక‌పోయినా నిండుకుంటున్న నిల్వ‌ల‌ను మ‌ళ్లీ ఫిల్ చేయ‌డం పెద్ద టాస్క్. మొత్తానికి కొన్ని దేశాల నుంచి ఈ చ‌మురు కొనుగోలు చేయ‌డం, ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డినందుకు ప్ల‌స్ అయింది.ఈ మార్పు వెనుక చిన్న ఆఫ్రికా దేశాలు ఉన్నాయి. చివ‌ర‌కు ఎల్‌పిజి కోసం భారత్, అమెరికా, రష్యా, కెనడా, నార్వే, నైజీరియా , అల్జీరియా , గనా , కాంగో , అంగోలా ఈ వెస్ట్ కంట్రీస్ నుంచి సంప్ర‌దింపులు జ‌రిపి అక్క‌డ నుంచి దిగుమ‌తులు చేసుకుంటోంది.

మ‌న దేశ అవ‌స‌రాలు ఎల్‌ఎన్‌జి కోసం కామెరూన్ , ఈక్వటోరియల్ గినియా, మొజాంబిక్ ఈ దేశాల‌తో సంప్ర‌దింపులు జ‌రిపారు. మ‌రోప‌క్క మొయిన్ పైప్ లైన్ ద్వారా సౌదీ అరేబియా – యూఏఈ మ‌న దేశానికి కొంత చ‌మురు చేర‌వేస్తున్నాయి. సో ఇత‌ర దేశాల్లో పెట్రోల్ డిజీల్ ధ‌ర‌లు భారీగా పెరిగాయి కానీ భార‌త్ మాత్రం చాక‌చ‌క్యంగా ఈ చ‌మురు కొనుగోలు చేసి భార‌త్ లో ప‌రిస్దితి చేయి దాటిపోకుండా స‌క్స‌స్ అయింది అనే చెప్పాలి. అన్నీ బాగున్న‌ప్పుడు సాయం అందరూ చేస్తారు. ప‌రిస్దితి బాగోని స‌మ‌యంలో సాయం చేసేవారు ముఖ్యం. ఇప్పుడు మ‌న దేశానికి ఈ చ‌మురు సాయం అందించిన దేశాల విష‌యంలో, భార‌త్ కూడా ఎప్పుడు కృత‌జ్ఘ‌త‌తో ఉంటుంది అనే చెప్పాలి.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments