దావుద్ ఇళ్లు పాకిస్ధాన్ లో ఎక్కడ ఉంది
అతనికి ఎవరు సాయం చేస్తున్నారు
దావూద్ ఇబ్రహీం ముంబై పేలుళ్లకు ప్రధాన సూత్రదారి. ఈ ఘటన తర్వాత పాకిస్ధాన్ కి తన మకాం మార్చుకున్నాడు. అప్పటి నుంచి అతన్ని అరెస్ట్ చేయడానికి మన దేశం ప్రయత్నిస్తూనే ఉంది.
పాకిస్ధాన్ అతనికి ఆశ్రయం కల్పించడంతో అతని ఆటలు సాగుతున్నాయి. అసలు పాకిస్దాన్ తో అతని బంధం ఎలాంటిది అనేది తాజాగా ధురంధర్ 2 సినిమాతో మనకు క్లారిటీ వచ్చింది. మన దేశంలో పుట్టి ఆ దేశానికి ఎంతలా ఊడిగం చేస్తున్నాడు అనేది క్లారిటీ వచ్చింది. అయితే సినిమాలో అతనికి భారత స్పై ద్వారా ఏదో మందు ఇచ్చినట్లు చూపించారు. కాని సినిమా కల్పిత కథ అనేక అంశాలు ఉంటాయి కాబట్టి అలా చూపించారు.
డీ కంపెనీ ద్వారా తన సామ్రాజ్యాన్ని విస్తరించిన దావుద్, ప్రస్తుతం పాకిస్దాన్ లో ఉన్నాడు, అతని ఇంటిని ధురంధర్ సినిమాలో చూపించారు. అయితే నిజంగా దావుద్ అక్కడే ఉన్నాడా అనే డౌట్ చాలా మందికి వస్తోంది. అసలు దావుద్ ఎప్పుడో చనిపోయాడు అని అందరూ అనుకుంటున్నారు, కాని కొందరు మాత్రం మనల్ని బురిడి కొట్టించడానికి అతను మరణించాడు అనే వార్తలు వైరల్ చేశారు అని అంటున్నారు, వాస్తవం ఏమిటి అనేది మాత్రం ఎవరికి తెలియదు అయితే కొన్ని సంవత్సరాల క్రితం ప్రముఖ అంతర్జాతీయ పత్రిక దావుద్ కుటుంబంతో పాక్ లో ఉంటున్నాడు అని వార్త ఇచ్చింది.
అతని సోదరుడితో పాటు కరాచీలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఉంటున్నాడు అని తెలిపింది.
పాకిస్తాన్‌లో ఐఎస్ఐ, పాక్ ఆర్మీ రక్షణలో దావూద్ ఇబ్రహీం ఉన్నట్లు చెబుతున్నారు.లగ్జరీ ప్రాంతమైన 13 క్లిఫ్టన్ రోడ్ ప్రాంతంలో దావూద్ నివసిస్తున్నట్లు మన రక్షణ వర్గాలు చెబుతున్నాయి దావూద్ ఇంటిపై వైట్ హౌజ్, 13 క్లిఫ్టన్ రోడ్, కరాచీ అని ఉంటుంది. అందుకే ఇది దావుద్ ఇళ్లు అని అంటున్నారు.
కరాచీలోనే క్లిఫ్టన్ అత్యంత సంపన్నమైన ఏరియా. ఈ ఏరియాలో పాకిస్తాన్ ఆర్మీ అధికారులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఉంటారు. బిగ్ షాట్స్ ఉంటారు. ఇది అక్కడ స్టేట్ లో ఖరీదైన రియల్ ఎస్టేట్ ప్రాంతం. డిఫెన్స్ హౌసింగ్ ఏరియాలో తనకంటూ ఓప్రత్యేక ఇంటిని కట్టించుకున్నాడు ఈ డాన్.
తన సోదరుడు అనీస్ ఇబ్రహీంతో కలిసి కరాచీలోని ఖయ్యూమాబాద్ సెక్టార్ బి-ఫేజ్ 5, స్ట్రీట్ నంబర్ 30లో అక్కడ రెండు విల్లాల్లో ఉంటున్నాడు అనే వార్తలు వినిపించాయి. 1992 ముంబై దాడుల తర్వాత భారత్ నుంచి పారిపోయి వచ్చిన దావూద్ ఇబ్రహీం కరాచీలోని ఉండిపోయాడు అక్కడ నుంచి తన నెట్ వర్క్ నడుపుతున్నాడు, వందల కోట్ల డబ్బు అతని దగ్గర ఉంది అంటారు.

