Homeజాతీయకిరోసిన్ నీలి రంగులో ఎందుకు ఉంటుంది క‌ల‌ర్ క‌లుపుతారా

కిరోసిన్ నీలి రంగులో ఎందుకు ఉంటుంది క‌ల‌ర్ క‌లుపుతారా

మ‌నం ఇప్పుడు అంటే గ్యాస్ వాడుతున్నాం కాని గ‌తంలో చూస్తే అంద‌రూ క‌ట్టెల పొయ్యిలు వాడేవారు. ఆ త‌ర్వాత కిరోసిన్ ప్ర‌భుత్వం పేద‌ల‌కు రేష‌న్ ద్వారా అందించేది. అయితే మ‌నం చిన్న‌త‌నం నుంచి చూస్తున్నాం. క‌ల‌ర్ విష‌యంలో ఈ కిరోసిన్ బ్లూ క‌ల‌ర్ ఉంటుంది. ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది. అస‌లు ఎందుకు నీలం రంగులో ఈ కిరోసిన్ ఉంటుంద‌ని. అయితే ప్ర‌భుత్వం క‌ల‌ర్ క‌లుపుతుందా అనే అనుమానం కూడా చాలా మందికి ఎప్ప‌టి నుంచో ఉంది.

అయితే తాజాగా నిపుణులు చెప్పేదాని ప్ర‌కారం చూస్తే కిరోసిన్ కి ఈ రంగు రావ‌డానికి డై ని క‌లుపుతారు.
సాధారణంగా కిరోసిన్ సహజంగా పారదర్శకంగా లేదా లేత పసుపు రంగులో ఉంటుంది. దీనికి డైయింగ్ అనే ప్ర‌క్రియ ద్వారా క‌ల‌ర్ క‌లిపి ఇలా నీలిరంగులోకి మారుస్తారు. ఎందుకంటే ప్ర‌భుత్వం ఈ కిరోసిన్ రేష‌న్ ద్వారా చౌక‌గా ఇస్తుంది. ఒక‌వేళ ఇలా క‌ల‌ర్ క‌ల‌ప‌క‌పోతే ఈ కిరోసిన్ ని క‌ల్తి చేసి పెట్రోల్ డిజీల్ లో క‌లిపి అక్ర‌మార్కులు విజృంభిస్తారు. అందుకే దీనికి ఇలా డైయింగ్ చేయ‌డం ద్వారా అక్ర‌మార్కుల చేతికి ఈ కిరోసిన్ వెళ్ల‌దు.

అయితే ఈ డైను సాల్వెంట్ బ్లూ 35 లేదా ఆయిల్ బ్లా 35 అని పిలుస్తారు.ఇది కిరోసిన్ లో చాలా ఈజీగా క‌లిసిపోతుంది. గాఢ‌త విష‌యంలో బ్లూ క‌ల‌ర్ క‌నిపిస్తుంది. ఒక‌వేళ మీరు డిజీల్ పెట్రోల్ లో ఈ కిరోసిన్ క‌లిపినా మీకు బ్లూ క‌ల‌ర్ వ‌స్తుంది. దీంతో అక్క‌డ వాహ‌న‌దారులు కూడా గ‌మ‌నిస్తారు ఇది క‌ల్తీ జ‌రిగింద‌ని. వెంట‌నే వారిపై చ‌ర్య‌ల‌కు ఆస్కారం ఉంటుంది. పెట్రోలియం కంపెనీలకు పెట్రో మంత్రిత్వ శాఖ‌ దీనికి కొన్ని నియ‌మాలు మెస‌ర్మెంట్స్ ఇచ్చింది. దాని ప్ర‌కారం కంపెనీలు ఈ క‌ల‌ర్ ప్రాసెస్ చేస్తాయి. సో మార్కెట్లో పెట్రోల్ డిజీల్ క‌ల్తి జ‌ర‌గ‌కుండా ప్ర‌భుత్వం దీనికి నీలిరంగు క‌లుపుతుంది అని అంటున్నారు నిపుణులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments