చమురు నిల్వలు భారీగా ఉన్నదేశాలతో చాలా దేశాలు మిత్రులుగానే ఉంటాయి. ఎందుకంటే అంతర్జాతీయ పరిస్దితులు, వర్తక వాణిజ్య పరిస్దితుల వల్ల చమురు నిల్వలు ఉన్న దేశాలు తమ ఆధిపత్యాన్ని ఎప్పుడూ ప్రదర్శిస్తూ ఉంటాయి. ఏదైనా యుద్ద పరిస్దితులు వచ్చాయంటే, ఈ చమురు రేట్లు అమాంతం పెరిగిపోతాయి. డిమాండ్ ఉంటుంది దానికి తగ్గ సప్లై ఉండదు. తాజాగా ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ మధ్య యుద్ద పరిస్దితులు కనిపిస్తున్నాయి. ఆ మూడు దేశాలతో పాటు మరో 8 దేశాలు కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ మరణంతో అమెరికా పై కసి తీర్చుకుంటున్నాయి అక్కడ సేనలు. అమెరికా ఆర్మీ నావల్ బేస్ లపై దాడి చేస్తున్నాయి. అమెరికా కూడా వాటిని మిస్సైల్స్ తో తిప్పి కొడుతోంది. ప్రస్తుతం డ్రోన్ మిస్సైల్స్ తో ఇరు దేశాల మధ్య భీకర పోరు సాగుతోంది.
ఇటువంటి పరిస్దితుల్లో మిడిల్ ఈస్ట్ లో పరిస్దితులు ఏమీ బాగాలేదు. అక్కడ ఉన్న భారతీయులు కూడా ఎంతో టెన్షన్ లో ఉన్నారు. ఇక భారత్ చాలా వరకూ ఇతర దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకుంటుంది. ఈ యుద్దంతో భారత్ కు కష్టాలు కనిపిస్తున్నాయి. హార్ముజ్ జల సంధి ద్వారా భారత్ కు చమురు రవాణా అవుతుంది. అయితే ఇరాన్ దాడులు చేస్తున్న సమయంలో ఈ జల సంధి పూర్తిగా క్లోజ్ అవుతోంది. ఈ సమయంలో ఎలాంటి చమురు నౌకలు మన దేశానికి వచ్చే అవకాశం ఉండదు. అందుకే భారత్ రష్యాపై ఆధారపడే పరిస్దితి కనిపిస్తోంది.

మన డిమాండ్ కు తగ్గ చమురు సప్లై ఆగిపోతే అన్నీ రంగాల్లో భారత్ కు ఇబ్బంది ఏర్పడుతుంది. అందుకే భారత్ రష్యాతో చర్చలు జరిపే అవకాశం కూడా ఉందంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. మరో నెల పరిస్దితి ఇలాగే ఉంటే భారత్ రష్యా దగ్గర చమురు కొనుగోలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే ప్రపంచ జల మార్గాల్లో ఈ చమురు దాదాపు 20 శాతం హార్ముజ్ జలసంధి మార్గం ద్వారా వెళుతుంది. దానిని క్లోజ్ చేస్తే చాలా దేశాలు ఎఫెక్ట్ అవుతాయి. భారత్ కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్దితి వస్తుంది.
ఇటీవల వాణిజ్య ఒప్పందాల్లో భారత్ అమెరికా మధ్య ఒప్పందం జరిగింది. దీంతో ఈనెల రష్యా నుంచి కొనుగోళ్లు తగ్గించాలని భారత్ భావించింది. కానీ పరిస్దితి చూస్తే రష్యా నుంచి చమురు కొనుగోళ్లు పక్కా జరపాలి అనేది అర్దం అవుతోంది. ఒకవేళ కాదు అని వెనెజులా నుంచి కొనుగోలు చేసినా ఆ నౌకలు కూడా హార్ముజ్ జలసంధి మార్గం ద్వారా భారత్ రావాలి ఇది కుదరని పని.. మనం రష్యా నుంచి మళ్లీ చమురు కొనుగోలు చేస్తే ట్రంప్ మళ్లీ సుంకాల భారం భారత్ పై మోపే అవకాశం కూడా ఉంది. చూడాలి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో.

అయితే ట్రంప్ ఇప్పటికే ఈ యుద్దం నెల రోజుల పాటు వరకూ జరగవచ్చు అని తెలియచేశారు. అయితే భారత్ దగ్గర సుమారు 45 రోజుల వరకూ సరిపడే చమురు నిల్వలు ఉన్నాయి అనేది నిపుణులు తెలియచేస్తున్నారు.

