Homeజాతీయఎల‌క్ష‌న్ స‌మ్మ‌ర్ - నాలుగు స్టేట్స్ ఒక యూటి - ప్ర‌జాఆలోచ‌న ఏమిటి

ఎల‌క్ష‌న్ స‌మ్మ‌ర్ – నాలుగు స్టేట్స్ ఒక యూటి – ప్ర‌జాఆలోచ‌న ఏమిటి

ఈ ఏడాది తొలి ఎన్నిల‌క సంద‌డి మొద‌లైంద‌నే చెప్పాలి. ఇప్ప‌టికే ఎన్నిక‌ల‌కు సంబంధించి నోటిఫికేషన్ వ‌చ్చేసింది. నాలుగు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నిక‌లు జ‌రుగ‌నున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ అన్నీ స్టేట్స్ లో స‌ర్వేలు కూడా మొదలు అయ్యాయి.. ఈ ప్ర‌జా ఓపీనియ‌న్ పోల్స్ ఆసక్తిక‌ర‌మైన రిజ‌ల్ట్ ఇస్తున్నాయి. మ‌నం ఒక‌టి గుర్తించాలి. ఈ స‌ర్వేలు ప్రీ పోల్ స‌ర్వేలు ఇవ‌న్నీ కూడా ఓ లెక్క ఉజ్జాయింపుకి మాత్ర‌మే.
అని చెప్పుకోవాలి.

ఎందుకంటే ఇప్పుడు ఏ పార్టీకి త‌న మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ఓట‌రు చెప్పాడో, ఎన్నిక‌ల ప్ర‌చారంలో త‌న ఆలోచ‌న మార్చుకోవ‌చ్చు. సో రాష్ట్రంలో ఏపార్టీ ప‌రిస్దితి ఎలా ఉంది అని ఓ ఆలోచ‌న‌కు మాత్ర‌మే. ఈ ప్రీ పోల్ స‌ర్వేలు ఒపీనియన్ పోల్స్ అనేది మ‌నం గుర్తించాలి. అర్బ‌న్ ఓటు బ్యాంకుపైనే ఈ స‌ర్వేలు ఎక్కువ ఆధార‌ప‌డి ఉంటాయి. కానీ ప‌ది సంవ‌త్స‌రాలుగా అక్క‌డ నుంచి కూడా స‌రైన ఓపీనియ‌న్ రావ‌డం లేదు.

అంతెందుకు మ‌నం ఏపీ తెలంగాణ కూడా చూశాం. జ‌గ‌న్ గెలుస్తాడు కేసీఆర్ గెలుస్తాడు అని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు జ‌నం. కానీ ఇద్ద‌రు ఓడిపోయారు. అయితే సౌత్ లో ఈ రెండు స్టేట్స్ లెక్క వేరు కానీ ఇప్పుడు త‌మిళ‌నాడు కూడా ఉంది. ఇక్క‌డ ప్ర‌జ‌లు కూడా ఒక‌సారి ఒక‌రికి అధికారం ఇస్తే మ‌రోసారి ఇంకొక‌రికి అధికారం ఇస్తారు. అయితే స్టాలిన్ కు త‌గ్గా సీనియ‌ర్ అంత ఫేమ్ ఉన్న పొలిటిషియన్ మ‌రొక‌రు లేరు. ఇది కూడా ఆయ‌న చ‌రిష్మా మ‌రింత పెర‌గ‌డానికి కార‌ణం అయింది.

సో ఈ స్టేట్ లో జ‌రిగిన ఒపీనియన్ పోల్స్ స‌ర్వేల్లో ఎలాంటి ఫ‌లితాలు వ‌చ్చాయి అనేది చూద్దాం.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో అధికార పార్టీలే తిరిగి పీఠం ద‌క్కించుకుంటాయ‌ట‌. ఇక అస్సాం మ‌ళ్లీ కమలం స్వీక‌రిస్తుంది అంటున్నారు. కేర‌ళ మాత్రం నువ్వా నేనా అనే పోటీ ఉంటుంది అంటున్నారు.

ముందు బెంగాల్ చూద్దాం, దీదీ ఇక్క‌డ మ‌రోసారి అధికారంలోకి వ‌స్తుందట‌. బీజేపీ సీట్లు పెర‌గ‌వ‌చ్చు కానీ అధికారం క‌ష్టం అని ఓపీనియ‌న్ పోల్స్ చెబుతున్నాయి. మొత్తం ఇక్క‌డ 297 స్ధానాలు ఉన్నాయి. టీఎంసీ 194 సీట్లు గెల‌వ‌వ‌చ్చు అంటున్నారు. బీజేపీ 95 నుంచి 100 సీట్లు గెల‌వ‌వ‌చ్చు అంటున్నారు. ఇది ట‌ఫ్ వార్ కానీ ఎన్నిక‌ల ప‌రిస్దితుల్లో ఏమైనా జ‌ర‌గ‌వ‌చ్చు.

త‌మిళ‌నాడు చూస్తే ఇక్క‌డ కూడా ప‌రిస్దితి స్టాలిన్ కు అనుకూలంగా ఉంది. ఐదేళ్ల పాల‌న అంతేకాకుండా అంత చ‌రిష్మా ఉన్న లీడర్ లేక‌పోవ‌డం కూడా ఆయ‌న‌కు క‌లిసి వ‌స్తుంది అంటున్నారు. మొత్తం 234 స్ధానాలు ఉన్న ఈ స్టేట్ లో డీఎంకే మ‌రోసారి అధికారంలోకి వ‌స్తుంది అంటున్నారు. 160 సీట్లు గెల‌వ‌వ‌చ్చు.బీజేపీ అన్నాడీఎంకే 50 సీట్లు పొంద‌వ‌చ్చు అంటున్నారు. ఇక టీవీకే 10 శాతం ఓట్లు 20 సీట్లు గెల‌వ‌వ‌చ్చు అంటున్నాయి ఒపీనియన్ పోల్స్

అస్సాం లో మ‌రోసారి బీజేపీ అధికారంలోకి రావ‌చ్చు అంటున్నారు. ఇక 126 సీట్ల‌కు 80 సీట్లు ఎన్డీయే గెల‌వ‌వ‌చ్చు అంటున్నారు.

కేరళలో మాత్రం అధికార, విపక్ష కూటముల మధ్య నువ్వా? నేనా? అన్నట్లుగా పోరు సాగనుంది. 140 స్థానాలున్న కేరళలో ఎల్డీఎఫ్ కూటమికి 61 సీట్లు రావ‌చ్చు అంటున్నారు..యూడీఎఫ్‌కు 58-69 సీట్లు వచ్చే అవ‌కాశం ఉంది అని అంటున్నారు.

చూడాలి మ‌రి ప్ర‌జ‌ల ఓపీనియ‌న్ ఎలా ఉండ‌బోతోంది అనేది

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments