Homeజాతీయభ‌ర్త ఆఫీసుకి ప్రియుడు ఇంటికి - ప్రియుడితో అడ్డంగా దొరికిన భార్య‌

భ‌ర్త ఆఫీసుకి ప్రియుడు ఇంటికి – ప్రియుడితో అడ్డంగా దొరికిన భార్య‌

భ‌ర్త ఆఫీసుకి ప్రియుడు ఇంటికి
ప్రియుడితో అడ్డంగా దొరికిన భార్య‌
భ‌ర్త‌కి అస‌లు విష‌యం చెప్పిన వాచ్ మెన్

పెళ్లి చేసుకోవాలి అంటేనే అబ్బాయిలు భ‌య‌ప‌డుతున్నారు. వ‌చ్చే అమ్మాయి మ‌న‌తో సంసారం చేస్తుందా లేదా, పైకి పంపుతుందా అనే భ‌యం కనిపిస్తోంది. ఎందుకంటే ఇటీవ‌ల జ‌రుగుతున్న ఘ‌ట‌న‌లు చూసి పెళ్లి అనేస‌రికి చాలా ఆలోచ‌న‌లు చేస్తున్నారు అబ్బాయిలు. ఎందుకంటే ప్రియుడిపై మోజుతోనో డ‌బ్బుపై వ్యామోహంతోనో త‌ల్లిదండ్రుల మాట కాద‌న‌లేక, ఇష్టం లేని పెళ్లి చేసుకుని అబ్బాయిల జీవితాల‌ను క‌డ‌తేరుస్తున్న అమ్మాయిల ఘ‌ట‌న‌లు మ‌నం ఎన్నో చూశాం. ఇది కూడా అలాంటి సంఘ‌ట‌నే. కానీ భ‌ర్త ముందు మేల్కొన్నాడు అనే చెప్పాలి.

బెంగ‌ళూరు సిటీలో ఉంటున్న గౌరీకి న‌గ‌రంలో ఉంటున్న ప్ర‌ణవ్ గౌడ్ తో వివాహం అయింది. ఎంతో అంగ‌రంగ‌వైభ‌వంగా పెళ్లి చేశారు. అమ్మాయికి క‌ట్న‌కానుల‌కు బాగానే ఇచ్చారు. అబ్బాయికి సొంత ఫ్లాట్ ఉండ‌టంతో వివాహం అయిన 10 రోజుల‌కి ఆమెని కొత్త ఇంటిలోకి తీసుకువెళ్లాడు.పెళ్లికి ముందు ఆమెని పెళ్లి ఇష్ట‌మేనా అని అడిగాడు, ల‌వ్ ఇలాంటివి ఉంటే చెప్పు అని కోరాడు, ఆమె ఏమీ లేవు అని చెప్పింది.

ఇక పెళ్లి అయిన త‌ర్వాత ఎవ‌రికి వారు ఉద్యోగాలు చేసుకుంటూ నెల రోజులు సంసారం బాగానే చేశారు. అబ్బాయి నైట్ షిఫ్ట్ కి వెళ్లిన త‌ర్వాత రోజు నుంచి ఆమెలో మార్పు మొద‌లైంది. పెళ్లికి ముందు నాలుగు సంవ‌త్స‌రాలుగా త‌మ ఆఫీసులో ప‌నిచేసే ఓ యువ‌కుడితో ఆమెకి అఫైర్ ఉంది. అయితే అత‌న్ని పెళ్లి చేసుకోవ‌డానికి కుటుంబ స‌భ్యులు ఒప్పుకోలేదు.

దీంతో పేరెంట్స్ చెప్పినట్లు ప్ర‌ణ‌వ్ ని పెళ్లి చేసుకుంది. అత‌ను ఆఫీసుకి వెళ్లిన త‌ర్వాత రాత్రి ప్రియుడ్ని ఇంటికి ర‌మ్మ‌ని ఇద్ద‌రు స‌ర‌సాల్లో మునిగిపోయారు. అయితే ఇటీవ‌ల ఆమె ప్రెగ్మెంట్ అయింది. ప్ర‌ణ‌వ్ కూడా ఎంతో సంతోషించాడు. అయితే అపార్ట్ మెంట్ కింద ఉండే వాచ్ మెన్ ఆమెపై అనుమానంతో ఓ రోజు ప్ర‌ణ‌వ్ కు మీరు వెళ్లిన త‌ర్వాత ఓ వ్య‌క్తి వ‌స్తున్నాడు, రాత్రి 1 గంట‌ స‌మ‌యంలో అని చెప్పాడు. ప్ర‌ణ‌వ్ షాక్ అయ్యాడు. చివ‌ర‌కు సీసీ కెమెరా చెక్ చేస్తే రాత్రి 1 గంట నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కూ అత‌ను ఇంట్లో ఉన్న‌ట్లు తెలిసింది.

అయితే పుట్ట‌బోయే బిడ్డ కూడా నా సంబంధం ఉండి ఉండ‌దు అని భావించి, నేరుగా పెద్ద మ‌నుషుల‌ని ఇక్క‌డ‌కు పిలిపించి, ఆ వాచె మెన్ సాయం తీసుకుని, ఆ సీసీ ఫుటేజీని పేరెంట్స్ కి చూపించాడు. పెద్ద‌లు ఈ వివాదాన్ని ప‌రిష్క‌రించి కాపురం చేసుకోవాలి అని సూచించారు. చావ‌నైనా చ‌స్తాను కానీ ఆమెని ఏలుకోను అని చెప్పాడు చివ‌ర‌కు రెండు నెల‌ల‌కే ఆమె కాపురం ముక్క‌లైంది. ప్రియుడ్ని ఇచ్చి పెళ్లి చేయాలి అని చూడంతో అత‌ను కూడా ప‌రార్ అయ్యాడు. నా కొడుకు ముందు మేల్కొన్నాడు లేదంటే అత‌ని ప్రాణాలు కూడా తీసేవార‌ని అత‌ని త‌ల్లిదండ్రులు సంతోషించారు.

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments