Homeవినోదంవ‌రుడు కోసం వెతుకుతున్న క‌మ‌ల్ హాస‌న్

వ‌రుడు కోసం వెతుకుతున్న క‌మ‌ల్ హాస‌న్

 

సినిమా ఇండ‌స్ట్రీలో త‌న తండ్రి వార‌స‌త్వంగా ఎంట్రి ఇచ్చిన శ్రుతి హాసన్, త‌న న‌ట‌న‌తో ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకుంది, సౌత్ లో అంద‌రు స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించింది, అయితే ప్రేమ విష‌యంలో రిలేష‌న్ విష‌యంలో ఆమె పై ఎన్నో వార్త‌లు వినిపించాయి. అయితే ఆమెకు బ్రేక‌ప్ లు అలాగే జ‌రిగాయి. ఇక త‌న కుమార్తెపై ఉన్న ప్రేమ‌తో క‌మ‌ల్ ఇప్ప‌టికే ఆమెకి ఓ విష‌యం క్లారిటీ ఇచ్చార‌ట‌. తాను మంచి సంబంధం చూస్తాను వివాహం చేసుకోమ‌ని చెప్పార‌ట. ఆమె కూడా ఒకే చెప్పింది అని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇప్ప‌టికే ద‌గ్గ‌ర బంధువులు తెలిసిన వారి ద్వారా సంబంధాలు చూస్తున్నారు అనే వార్త‌లు కోలీవుడ్ లో వినిపిస్తున్నాయి, అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ అఫీషియ‌ల్ గా ఎలాంటి ప్ర‌క‌ట‌న వారి నుంచి రాలేదు
అయితే శృతిహాస‌న్ సినిమా ప‌రిశ్ర‌మ‌లో వ‌చ్చి ద‌శాబ్దం దాటేసింది అంతేకాదు ఆమెకి వ‌య‌సు 40 ఏళ్లు దాటాయి. అందుకే ఆమె పెళ్లి గురించి ఫ్యాన్స్ కూడా ఆమె ఓ ఇల్లాలు అయితే బాగుంటుంది అని కోరుకుంటున్నారు.

ప్ర‌స్తుతం సెల‌క్టీవ్ గా మాత్ర‌మే సినిమాలు ఎంచుకుంటుంది ఆమె, మంచి క‌థ‌లు వ‌స్తే చేయ‌డానికి సిద్దంగా ఉంది. సో త‌న పెద్ద కుమార్తె పెళ్లి వైభ‌వంగా చేయాలి అని క‌మ‌ల్ కూడా ఆశ‌లు పెట్టుకున్నారు.ఇక క‌మ‌ల్ తో వియ్యం అనేస‌రికి చాలా మంది ప్ర‌ముఖులు పారిశ్రామిక వేత్త‌లు వ్యాపారులు ముందుకు వ‌స్తారు. అయితే ద‌గ్గ‌ర వారు బంధువుల అబ్బాయి అయితే బాగుంటుంది అని ఆలోచ‌న చేశారు. సో మొత్తానికి త్వ‌ర‌లో శ్రుతీ కూడా వివాహ బంధంలోకి అడుగు పెడుతుంది అనే వార్త కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వ‌ర‌కూ వినిపిస్తోంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments