అందమైన నల్లటి కురులు ఉండాలి అని అమ్మాయిలు అందరికి కోరిక ఉంటుంది. దీని కోసం అనేక టిప్స్ ఫాలో అవుతూ ఉంటారు. ముఖ్యంగా షాంపులు, సీరమ్ లు, అలాగే ఆయిల్స్ కూడా పెద్ద ఎత్తున వాడుతూ ఉంటారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా చైనాలో ఓ గ్రామం గురించి జనం ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ ప్రజలు పాటించే ఓ పద్దతి వారి కేశాలను చాలా పొడుగుగా మారేలా చేస్తోంది. ఇది అందరిని ఆకట్టుకుంటోంది ఆకర్షిస్తోంది. సో ఈ పద్దతి తెలిసి మన ఇండియన్స్ చాలా మంది మహిళలు కూడా ఫాలో అవుతున్నారు మరి ఆ బ్యూటీ సీక్రెట్ ఏమిటి అనేది చూద్దాం.
జుట్టు సంరక్షణ కోసం ఆసియా దేశాలలో వాడుతున్న బియ్యం కడిగిన నీరు .. రైస్ వాటర్ ని కేశాలకు వాడుతున్నారు మహిళలు. దీని వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే రూట్స్ నుంచి కూడా బలంగా మారుతుంది. చైనాలో దీనిని ఎక్కువగా వాడుతున్నారు అక్కడ మహిళలు.
చైనాలోని హువాంగ్లువో గ్రామంలో నివసించే యావో తెగ మహిళలు తమ కేశ సౌందర్యం కోసం వీటిని వాడుతున్నారు. చైనాలో ఇక్కడ ఉన్న అమ్మాయిల్లో 95 శాతం మంది అమ్మాయిలకి 4 నుంచి 6 అడుగులు పొడవు జుట్టు పెరుగుతుంది. ఇక్కడ ఆశ్చర్యకరం ఏమిటి అంటే, వయసు పెరుగుతున్న కొద్ది కూడా జుట్టు ఊడదు, అంతేకాదు 80 ఏళ్ల మహిళలకు కూడా ఇలాగే ఉంటుంది.
వారు తరతరాలుగా పాటిస్తున్న రహస్యం గురించి చూస్తే… పులియబెట్టిన బియ్యం నీటితో దానిని వడగట్టి ఆ నీటిని తలకు పట్టించి నాలుగు గంటల తర్వాత జుట్టు బాగా ఆరుతుంది. ఆ సమయంలో తలస్నానం చేయాలి, దీని వల్ల జుట్టు చాలాపొడవు పెరుగుతుంది.
మనం అన్నం ఉడకబెట్టేటప్పుడు పైన వచ్చే స్టార్చ్ ని వాటర్ రైస్ అంటారు. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. అమైనో ఆమ్లాలు, విటమిన్లు ఎక్కువశాతం ఖనిజాలు ఉంటాయి ఇవి కేశాలు పెరగడానికి ఉపయోగపడతాయి.. అయితే ఆ దేశంలో ఉన్న ప్రజలు దీనిని బాగా ఫాలో అవుతున్నారు, దీనిపై పూర్తిగా శాస్త్రీయ ఆధారాలు ఇంకా లభించాలి అంటున్నారు నిపుణులు. అయితే చుండ్రు సమస్య ఉన్న వారు దీనిని వాడకపోవడం మంచిది అంటున్నారు నిపుణులు.

