Homeవినోదంఊర్మిళ చేసిన ఒక్క మిస్టేక్ - చివ‌ర‌కు ఇలా అయిపోయింది

ఊర్మిళ చేసిన ఒక్క మిస్టేక్ – చివ‌ర‌కు ఇలా అయిపోయింది

ఊర్మిళ చేసిన ఒక్క మిస్టేక్
చివ‌ర‌కు ఇలా అయిపోయింది

బాలీవుడ్ లో ఎన్నో అద్బుత‌మైన సినిమాలు చేసింది ఊర్మిళా మటోండ్కర్ . స్టార్ న‌టిగా ఎదిగింది. శ్రీదేవి లాంటి అందం. బాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన ఈ అందాల భామ చేసిన ఒక్క మిస్టేక్ చివ‌ర‌కు అవ‌కాశాలు త‌గ్గేలా చేసింది. ఇంత‌కీ ఊర్మిల చేసిన మిస్టేక్ ఏమిటి అనేది ఓసారి ఈ స్టోరీలో చూద్దాం. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన రంగీలా చిత్రంతో దేశ వ్యాప్తంగా మంచి పేరు పొందింది. అందానికి అందం అద్బుత‌మైన న‌ట‌న‌తో మెస్మ‌రైజ్ చేసింది.

ఆ తర్వాత ఆమెకి అనేక సినిమా అవ‌కాశాలు వ‌చ్చాయి. సత్య, దౌడ్, మున్నాభాయ్ MBBS ప్ర‌త్యేక సాంగ్ లో న‌టించింది. ఇలా అనేక సినిమాలు చేసింది. అవి కూడా మంచి పేరు తెచ్చాయి. న‌ట‌న‌కు ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ల్లో మెరిసింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్న స‌మ‌యంలో ఒకే త‌ర‌హ సినిమాలు ఆమె ఒప్పుకుంది. దీంతో ఆమె కెరీర్ దెబ్బ‌తింది అంటారు అన‌లిస్టులు.

ఎందుకంటే ఆమె చేసిన సినిమాలు అన్నీ ఒకేత‌ర‌హాలో ఉన్నాయి అనే టాక్ వ‌చ్చింది. ఇక మంచి మంచి క‌థ‌లు వ‌చ్చినా ఆమె డేట్స్ ఎడ్జిస్ట్ కాక వాటిని వ‌దులుకుంది. దీంతో త‌ర్వాత పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. ఆమె చేసిన సినిమాలు కూడా ప‌రాజ‌యం పొందాయి. దీంతో ద‌ర్శ‌కులు కూడా ఆమెని అప్రోచ్ అవ్వ‌డం మానేశారు. ఇలా ఆమె కెరిర్ త‌ను తీసుకున్న కొన్ని నిర్ణ‌యాల వ‌ల్ల దెబ్బ‌తింది అంటారు బాలీవుడ్ అన‌లిస్టులు.

అయితే ఆమెకి మ‌న తెలుగుల‌నే కాదు సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఇప్ప‌టికీ మంచి క్రేజ్ ఉంది. ఇరవై సంవ‌త్స‌రాల వ‌య‌సులోనే ఆమె సినిమాల్లోకి వ‌చ్చారు. స‌రైన ప్లానింగ్ లేక ఆమె సినిమాల‌కు దూరం అయ్యారు. మ‌ళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీ తెలుగులో ఆమె న‌టిస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నారు ఫ్యాన్స్ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments