ప్రపంచంలోనే ఖరీదైన టీ పొడి
కిలో 10 కోట్లు
సాధారణంగా టీ పొడి రేటు ఎంత ఉంటుంది. కేజీ 300 నుంచి 1000 రూపాయలు, లేదా బ్రాండ్ బట్టి 2 వేలు ఉంటుంది. ఇంకా ఖరీదైనవి ప్రీమియం టీ పొడులు మార్కెట్లో ఎన్నో ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరు ఈ టీపొడి రేటు గురించి చెబితే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మార్కెట్లో ఈ టీ పొడి కేజీ 9 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయలు ఉంటుంది. పైగా ఆ ఒక్క ప్రాంతంలో తప్ప ఎక్కడా ఈ టీ పొడి దొరకదు. సో ఈ ఒక్క కేజీ టీ పొడికి పెట్టే డబ్బుతో ఒక విలాసవంతమైన బంగ్లా, ఖరీదైన కారు కూడా కొనుక్కోవచ్చు.
ఇంతకీ ఈ టీ పొడి ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నారా, చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లో వుయి పర్వాతల దగ్గర కొండ చరియల్లో ఈ టీ ఆకులు దొరుకుతాయి. ఇవి చాలా ప్రత్యేకమైనవి. అంతేకాదు చైనాలో ఈ ప్రాంతంలోనే ఈ ఆకులు కనిపిస్తాయి.. దీనిని బిగ్ రెడ్ రోబ్ అని కూడా పిలుస్తారు. ఇది చాలా పాత తేయాకు. గతంలో అంటే 2005లో ఈ టీఆకులు వేలం వేస్తే, పదిగ్రాములు 15 లక్షలకు అమ్ముడు అయ్యాయి అంటే వంద గ్రాములు కోటిన్నర దీని ఖరీదు అంత ఉంటుంది.
అయితే ఈ టీ పొడికి అంత పేరు అంత రేటు ఎందుకు అంటే, గతంలో వందల ఏళ్ల క్రితం మింగ్ రాజవంశంలో ఒక యువరాణికి తీవ్ర అనారోగ్య సమస్య వచ్చింది. ఎన్ని మందులు వేసినా నమయం కాలేదు. ఈ సమయంలో ఈ టీ తాగడం వల్ల ఆమె బతికింది అంటారు. అప్పటి నుంచి రాజులు అక్కడ వంశాల వారు దీనిని రాయల్ ట్రీగా పిలుస్తారు. ఆ తేయాకు మొక్కలను ఎర్రటి రాజ వస్త్రాలతో కప్పేవారు. ఎవరూ వాటిని తెంపకుండా రక్షణ ఉండేవారు భటులు.
దీనికి డా హాంగ్ పావో అని పిలుస్తారు. ఒకసారి ఈ టీ తాగితే సుమారు 10 గంటల వరకూ ఈ సువాసన ఉంటుంది. అయితే పదుల సంఖ్యలో ఉండే మొక్కలు ఇప్పుడు ఆరు మాత్రమే మిగిలాయి. అందుకే వాటిని ఎవరూ కోయకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఆరు మాతృ పొదల నుండి మాత్రమే ఆకులు వస్తాయి, ప్రస్తుతం వీటిని ఎవరూ కోయడం లేదు , మార్కెట్లో ఎప్పటివో మాత్రమే అమ్ముతున్నారట.

