సినిమా హైప్ ఈ మధ్య ఎక్కువగా ఉంటున్నాయి. కాని విడుదల తర్వాత కొన్ని సినిమాలు చాలా నీరసించి పోతున్నాయి. కంటెంట్ పరంగా బాగుంటేనే చూసేందుకు సినిమా ఫ్యాన్స్ ఇష్టం చూపిస్తున్నారు. మౌత్ టాక్ అన్నింటికంటే పెద్ద పబ్లిసిటీ అనేది చిత్ర యూనిట్లు ఇంకా తెలుసుకోవడం లేదు. గ్లింప్స్ సాంగ్స్ ఫైట్లు టీజర్లు ట్రైలర్లు విడుదలకు ముందు రిలీజ్ చేసినా, తెరపై సినిమా చూసిన తర్వాత బాగుంది అనే మౌత్ టాక్ వస్తేనే సినిమా టికెట్లు తెగుతున్నాయి.
ఇక ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ వారం రోజులు గడిచింది. సో మొత్తం వసూళ్లు ఎన్ని వచ్చాయి అనేది చూస్తే, ఈ సినిమా మీడియం రేంజ్ కలెక్షన్స్ తీసుకువచ్చింది అనేది తెలుస్తోంది. ఈ సినిమా విడుదలకు ముందు ఓజీని దాటేస్తుంది అని వార్తలు వచ్చాయి. అసలు ఓజి దగ్గరకు కూడా వసూళ్ల పరంగా రాలేదు. ఇక 100 కోట్ల గ్రాస్ తెలుగు స్టేట్స్ అలాగే ఓవర్సీస్ కలిపి వసూళ్లు సాధించింది.
అఫీషియల్ గా చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి ప్రకటనలు కూడా రావట్లేదు. అయితే పెద్ద మైనస్ చెప్పుకోవాల్సింది. ధురంధర్ 2 అనే చెప్పాలి. ఇప్పటికే 1000 కోట్లు తీసుకువచ్చింది ఈ సినిమా.. ఉస్తాద్ థురంధర్ రెండు సినిమాలు ఒకే రోజు రావడం గట్టి పోటి ఇచ్చింది. ఒకటి యావరేజ్ టాక్ సంపాదించుకుని మరొకటి సూపర్ టాక్ సంపాదించుకుంటే కచ్చితంగా ఆ చిత్రానికి వసూళ్లు తగ్గుతాయి. ఇక్కడ అదే కనిపిస్తోంది.
సో పవన్ తదుపరి సినిమా చాలా జాగ్రత్తగా మంచి కంటెంట్ తో చేస్తే, సూపర్ హిట్ ఆయన ఖాతాలో పడుతుంది అంటున్నారు ఆయన ఫ్యాన్స్.

