రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం వారణాసి. ఈ సినిమాలో మహేష్ బాబు లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమా పై ప్రపంచ వ్యాప్తంగా హైప్ ఉంది.. అయితే ఇటీవల ఈ సినిమా సెట్స్ కి సంబంధించి కొన్ని ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫోటోలు చూసి డీటెయిలింగ్ గురించి మాట్లాడుకుంటున్నారు సినిమా అభిమానులు. ఎందుకంటే గతంలో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సెట్స్ తో ఈ సినిమా సెట్ల గురించి పోలికలు చేస్తున్నారు. అయితే రాజమౌళి కంటెంట్ పరంగా సినిమా ఎలా ఉంటే అలాంటి సెట్స్ వేస్తారు. కాని బాహుబలి ఓ రాజ్యం యుద్దం ఈ ధీమ్ తో వచ్చింది.
ఇక సినిమా చూసిన తర్వాత మన ఆలోచన స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఈ వారణాసి సెట్స్ చూసి కంపేర్ చేయడం సరికాదు కదా అంటున్నారు. బాహుబలి సెట్స్ పై ఇవి తేలిపోయాయి అని పోల్చడం సరికాదు కదా. కథ బట్టి ఆ సెట్స్ అనేది ఉంటాయి. కేవలం కథలో 2 లేదా 3 శాతానికి సంబంధించి మాత్రమే ఈ సెట్స్ . విటిని చూసి అంత ఈజీగా జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు.
ఇండియాలోనే మోస్ట్ ఎవెయిటెడ్ మూవీ వారణాసి. సో ఈ సినిమాపై గాసిప్ప్ ఇంకా ఏడాది ముందు నుంచే వినిపిస్తున్నాయి, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ఫ్రీ పబ్లిసిటీ ఈ సినిమా సంపాదించుకుంటుంది. అయితే కొందరికి మాత్రం ఈ కాశీ సెట్స్ చాలా బాగా నచ్చాయి. ఆయన సెట్స్ విషయంలో ఒకటికి పదిసార్లు జాగ్రత్తలు తీసుకుంటారు. డ్రోన్స్ విజువల్స్ వీడియోలు అన్నీ చూసి ఎంతో జాగ్రత్తగా ఈ సెట్స్ వేశారు అని సెట్ వర్కర్లు తెలియచేస్తున్నారు. సో ముందే జడ్జ్ చేయడం స్టోరీ తెలియకుండా ఈజీగా కంపేర్ చేయడం కరెక్ట్ కాదు అనేది చాలా మంది ఓపినియన్.

