అడివి శేష్ నుంచి సినిమా వస్తోంది అంటే ఎంత ఎక్సైట్ మెంట్ ఉంటుందో తెలిసిందే, ఆయన గత సినిమాలు కూడా మనల్ని ఎంతో అలరించాయి. సో మేజర్, హిట్ 2 సినిమాల తర్వాత ఆయన చాలా గ్యాప్ తీసుకుని ఈ సినిమా చేశారు, తన చిన్ననాటి స్నేహితుడు, సినిమాటోగ్రాఫర్ శానిల్ డియోతో కలిసి ఈ సినిమా చేశారు, ముందు ఈ సినిమాలో శృతిహాసన్ అని అనుకున్నారు, తర్వాత ఆమె తప్పుకోవడంతో ఆమె ప్లేస్ లో మృణాల్ చేరింది, మరి ఎన్నో అంచనాల మధ్య నేడు ఈ సినిమా విడుదల అయింది మరి ఈ చిత్రం ఎలా ఆకట్టుకుంది అనేది రివ్యూలో చూద్దాం
**స్టోరీ**
అడివి శేష్ హరిదాస్ సీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఓ అగ్రకుల అమ్మాయిని ప్రేమిస్తాడు ఆమె సరస్వతి మృణాల్. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరు విడిపోతారు.అయితే విడిపోయిన తర్వాత ఓ కారణంతో జైలుకి కూడా వెళతాడు హరిదాస్. జీవిత ఖైదు అనుభవిస్తున్న అతను ఇలా అవ్వడానికి కారణం సరస్వతి అని తెలుస్తుంది, దీంతో ఆమెపై పగ పెంచుకుంటాడు, ఈ సమయంలో అతనికి ఓ అవకాశం వస్తుంది. అయితే ఆ అవకాశం అతను ఉపయోగించకున్నాడా? అసలు ఎందుకు హరి జైలుకి వెళ్లాల్సి వస్తుంది? ఆ తర్వాత వారిద్దరు ఎలా కలిశారు, ఇవన్నీంటికి సమాధానాలు తెలియాలంటే వెండి తెరపై ఈ సినిమా చూడాల్సిందే.
**విశ్లేషణ**
ఈ సినిమాలో అడివిశేష్ చాలా అద్బుంగా నటించాడు.. మదనపల్లె యాసలో పలికిన కొన్ని పదాలు కొత్తగా అనిపిస్తాయి. ఇక లుక్స్ యాక్షన్ పరంగా శేష్ చాలా బాగా కనిపిస్తాడు. ఫైట్స్ సీక్వెన్స్ లో ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాడు. ఇక ప్రధానంగా సరస్వతి పాత్ర చేసిన మృణాల్ చాలా బాగా చేసింది. నటనకు ఆస్కారం ఉన్న పాత్ర ఆమెకి దక్కింది. ఇక బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ పాత్ర చాలా బాగుంది. సునీల్ ప్రకాష్ రాజ్ పాత్రలు సినిమాకి ప్లస్ అయ్యాయి.
ఇక సినిమాకి పెద్ద అసెట్ భీమ్స్ మ్యూజిక్ అనే చెప్పాలి .. ఆర్ ఆర్ చాలా బాగుంది. విజువల్స్ కెమెరా పనితనం తెరపై కనిపిస్తుంది, ఇక నిర్మాణ విలవలు చాలా బాగున్నాయి. ఇక యాక్షన్ తో పాటు ఎమోషన్స్ పండించే పాత్రలు చాలా బాగా చేశారు. డెకాయిట్ తో మరో భారీ హిట్ ని శేష్ తన ఖాతాలో వేసుకున్నాడు అనే చెప్పాలి.

