బుల్లితెరలో ఎంత మంది యాంకర్స్ ఉన్నా రవికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. షోని అద్బుతంగా ముందుకు తీసుకువెళ్లడంలో రవి కింగ్ మాస్టర్ అనే చెప్పాలి.. దాదాపు 15 ఏళ్ల క్రితం బుల్లితెరలో షో అంటే టక్కున రవి పేరు గుర్తుకు వచ్చేది. ప్రస్తుతం చాలా మంది యాంకర్లు రావడంతో రవికి షోలు తగ్గాయి. అయినా కొన్ని పెద్ద పెద్ద షోలకి రవి హోస్ట్ గా చేస్తున్నారు. యాంకర్ గా కూడా పలు ఈవెంట్లు చేస్తున్నారు. అప్పట్లో సంథింగ్ స్పెషల్, అలాగే పటాస్, ఆడాళ్లు మీకు జోహార్లు ఇలా అనేక ప్రోగ్రామ్స్ చేసేవారు. ఇక సినిమాలు ఈవెంట్లు బుల్లితెర షోలతో అస్సలు నిమిషం ఖాళీ లేకుండా ఉండేవారు రవి..తెలుగు బిగ్ బాస్ షోలో కూడా పాల్గొని అందరికి దగ్గర అయ్యాడు.
తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గొన్న రవి తన కెరియర్ గురించి అనేక ఇంట్రస్టింగ్ విషయాలు తెలియచేశారు. తాను జీవితంలో ముఖ్యంగా ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో ఎన్నో వెన్నుపోట్లు ఎదుర్కొన్నానని. చాలా మంది నన్ను తొక్కాలి అని చూశారు. ఏకంగా ఓ లేడీ యాంకర్ తనపై చేతబడి చేయించింది అని ఆవేదన వ్యక్తం చేశారు.మనుషులు ఇంత దారుణంగా ఉంటారా అని బాధకలిగింది అని తెలియచేశారు రవి. తాజాగా వర్ష హోస్ట్ చేస్తున్న కిస్సిక్ టాక్ షోకి గెస్ట్ గా వచ్చిన రవి ఇంటర్వ్యూలో ఈ విషయాలు తెలియచేశారు.
గతంలో చాలా షోలు చేసేవారు, ఈవెంట్లలో కనిపించేవారు ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదు అంటే, తాను 15ఏళ్లుగా ఎన్నో ఛానల్స్ లో పనిచేశా, ఎన్నో రికార్డులు ఉన్నాయి. కానీ ఎప్పుడు నాకు ఓ ప్రశ్న వస్తుంది, వాట్ నెక్ట్స్ అని వచ్చిన అవకాశాలని చేసుకుంటూ ముందుకు సాగాను అంతే అన్నారు రవి. తన జీవితంలో ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూశాను అని తెలిపారు.
టీవీ ఆర్టిస్ట్ లు సినిమాల్లోకి రావాలి అంటే చాలా కష్టం, కనిపించని గోడలు ఇండస్ట్రీలో ఉంటాయి. ఇలా తనపై ఓ లేడీ యాంకర్ క్షుద్రపూజలు చేయించింది అని చెప్పంతో ఈ మాట విని అందరూ షాక్ అయ్యారు. అయితే సినిమా పరిశ్రమలో హీరోలు హీరోయిన్ల మధ్య ఇలాంటివి మనం విన్నాం, ఏకంగా బుల్లితెరలో కూడా ఇలాంటివి జరుగుతాయా అనే అనుమానం ఇప్పుడు కనిపిస్తోంది. అయితే తాను దీనిపై దేవుడి దగ్గరకు వెళ్లి, నాపై ఇలా చేసిన ఆమెని దేవుడు చల్లగా చూడాలి అని కోరుకున్నాను. నేను ఎవరికి ద్రోహం చేయలేదు, ఏ తప్పు చేయలేదు.కొంతమంది రవి ఉంటే మేము షో యాంకరింగ్ చేయము అని చెప్పిన సందర్బాలు ఉన్నాయి, అయినా నేను టాలెంట్ నమ్ముకున్నాను అని తెలిపారు రవి.

