ఏపీలో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతోంది. ఇచ్చిన హామీలతో పాటు కొత్త పథకాలు కూడా ప్రకటిస్తోంది. తాజాగా డ్వాక్రా మహిళలకు అదిరిపోయే శుభవార్త అందించింది కూటమి సర్కార్.
మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ రోజున ఎంతో గ్రాండ్ గా సంబరాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు. ఈ సమయంలో మహిళలు అందరికి తీపి కబురు చెప్పింది చంద్రబాబు సర్కార్.
మహిళా అభ్యున్నతి కోసం రెండు కొత్త పథకాలను ప్రారంభించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఈ రెండు పథకాలు కూడా మహిళలకు ఆర్దికంగా నిలదొక్కుకునేందుకు ఎంతో దోహదపడతాయి. అసలు ఈ రెండు పథకాలు ఏమిటి దీని వల్ల మహిళలకు ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పథకాల పేరు ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి, ఎన్టీఆర్ విద్యా లక్ష్మి. ఈ రెండు పథకాలు డ్వాక్రా మహిళల కోసం తీసుకువస్తున్నారు. మహిళల అర్హత బట్టి 10 వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకూ ప్రభుత్వం ఆ మహిళలకు రుణం మంజూరు చేస్తుంది. అయితే ఈ రుణానికి కేవలం నెలకి పావలా వడ్డీ మాత్రమే వసూలు చేస్తుంది. ఇది మహిళలకు ఎంతో ఆర్దిక చేయూత అందించినట్లు అవుతుంది. రుణం తీసుకున్న రోజు నుంచి
నాలుగేళ్లల్లో వాయిదా పద్దతిలో ఈ రుణాన్ని తిరిగి చెల్లించాలి. డ్వాక్రా గ్రూపులో ఉన్న మహిళలు పిల్లల చదువు కోసం వారి పెళ్లిళ్ల కోసం దీనిని ఉపయోగించుకోవచ్చు.
** ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం పొందాలంటే అర్హతలు చూద్దాం **
1ఈ డ్వాక్రా మహిళ తమ కుటుబంలో పిల్లలు ఎవరైనా స్కూల్, కాలేజీ చదువుకుంటూ ఉంటే ఈ రుణం తీసుకోవచ్చు
2.ఇక డ్వాక్రా గ్రూపులో కనీసం ఆరు నెలల నుంచి కొనసాగుతూ ఉండాలి.
3.ఇప్పటి వరకూ తీసుకున్న రుణాలు అన్నీ సక్రమంగా చెల్లించి ఉండాలి ఎక్కడ డిఫాల్టర్ అవ్వకూడదు..
4. ఆమె గతంలో రుణం చెల్లించన దాని బట్టి 10 వేల నుంచి 1 లక్ష వరకూ రుణం మంజూరు చేస్తారు.
5.ఒకవేళ ఆమె రుణం తీసుకున్న తర్వాత ఏదైనా కారణంతో మరణిస్తే ఆ అప్పు మాఫీ అవుతుంది కుటుంబం చెల్లించక్కర్లేదు.
6. మీ పిల్లల స్కూల్ ఫీజ్ , కాలేజీ ఫీజ్ స్లిప్పులు కచ్చితంగా చూపించాల్సి ఉంటుంది.
** ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం పొందాలంటే అర్హతలు చూద్దాం **
1.డ్వాక్రా సంఘంలో ఉన్న మహిళ 18 ఏళ్లు నిండిన తన కుమార్తె పెళ్లి కోసం, 10 వేల నుంచి 1 లక్ష వరకూ అర్హత బట్టీ రుణం పొందవచ్చు.
2.పెళ్లి శుభలేక ఆ వివాహానికి ఖర్చు ఎంత అవుతుంది అనేది అంచనా రాసి ఇవ్వాలి.
3.అధికారులు దానిని పరిశీలించి వారికి బ్యాంకు ద్వారా రుణం అందిస్తారు
4.ఈ రుణం డ్వాక్రాగ్రూపుతో తీసుకున్న రుణాలతో సంబంధం ఉండదు. ఇది కేవలం మహిళ ఖాతాకు మాత్రమే చూపిస్తుంది. దీనికి ప్రతీ నెల నగదు చెల్లించుకోవాలి.

