ఆడ పిల్లలు పుట్టిన సమయంలో వారికంటూ పొదుపు చేస్తే, ఆ నగదు వారి చదువుకి వారి వివాహానికి ఉపయోగపడుతుంది అనేది మన అందరికి తెలిసిందే. అయితే ఏ స్కీమ్ లోచేరితే మంచి బెనిఫిట్ ఉంటుంది అనేదానిపై చాలా మందికి అనుమానాలు ఉంటాయి. మంచిరాబడి ఉన్నా ఈ విషయాలు తెలియక కొందరు ప్రభుత్వ స్కీములకి దూరం అవుతున్నారు. ఈరోజు మనం ఇలాంటి ఓ ప్రభుత్వ స్కీమ్ గురించి తెలుసుకుందాం మన దేశంలో ఎంతో మంది ఆడపిల్లలకు ఈ స్కీమ్ ఓ రక్షణగా నిలుస్తోంది మరి ఆ స్కీమ్ వివరాలు చూద్దాం.

చిన్న పొదుపు పథకాలలో సుకన్య సమృద్ధి యోజన పథకం ఒకటి. ఇది మహిళల కోసం తీసుకువచ్చిన సూపర్ స్కీమ్. చిన్న చిన్న మొత్తాల్లో పొదుపు చేస్తే రాబడి అంటే (వడ్డీ) చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఈ సుకన్య సమృద్ధి యోజన పథకంలో అత్యధిక వడ్డీ అందుతుంది. అయితే ఇది స్టార్ట్ చేసిన తర్వాత 15 సంవత్సరాల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. మీరు దీర్ఘకాలికంగా దీనిలో పెట్టుబడిగా పెట్టాలి.
ఈ స్కీమ్ మన దేశంలో ఉన్న అన్ని పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉంది. అలాగే ప్రభుత్వ బ్యాంకుల్లో కూడా అమలు చేస్తున్నారు. ఈ స్కీమ్ లో చేరాలంటే మీఇంట్లో ఉన్న ఆడపిల్లకు 10 ఏళ్ల లోపు వయసు ఉండాలి. ఆమె పేరు మీద ఖాతా తెరవాలి. సంవత్సరానికి మీరు కనీసం 250 రూపాయల నుంచి లక్షా 50 వేల రూపాయల వరకూ ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు. నెలవారీ మొత్తంలో ఈ నగదు పెట్టుబడిగా జమచేయవచ్చు.
మీరు 1000, లేదా 10,000 మీ ఆదాయం బట్టి ఇందులో పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఈ కాలపరిమితి 15 సంవత్సరాలు ఉంటుంది. మీ అమ్మాయికి 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఈ పథకం మెచ్యూరిటీ పూర్తి అవుతుంది. ఆ తర్వాత మీరు అమ్మాయి చదువుకి వివాహానికి ఈ నగదు పూర్తిగా ఉపయోగించుకోవచ్చు.
ఒకవేళ మీరు మీ అమ్మాయికి ఏడాది వయసు ఉన్నప్పుడు దీనిని ప్రారంభిస్తే మీరు 15 సంవత్సరాలు ఈ పథకం కట్టాలి. ఆ తర్వాత ఆమెకి 21 సంవత్సరాలు వచ్చే వరకూ ప్రతీ ఏడాది వడ్డీ జమ అవుతుంది. ఆమెకి 21 సంవత్సరాలు నిండిన తర్వాత మీరు ఆ నగదుని తీసుకోవచ్చు.
ఒకవేళ ఆమె ఉన్నత చదువు చదువకోవడానికి ఈ నగదు కావాలి అని కోరితే, 18 ఏళ్లు దాటితే మీరు జమ చేసిన డబ్బులో 50 శాతం తీసుకోవచ్చు. ప్రస్తుతం ఈ పథకంతో 8.2% వడ్డీ రేటు అందిస్తున్నారు.

