మన దేశంలో ప్రజలకు ఎంత భక్తి ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అన్నీ అంశాలు సెంటిమెంట్ తో ముడిపడి ఉంటాయి. పుట్టినా చచ్చినా దేనికైనా భక్తి సెంటిమెంట్ ముడిపడి ఉంటుంది. అలాగే దైవ భక్తి చాలా మెండుగా ఉంటుంది మన భారతీయులకి. మన ఇంటిలో కొత్తగా బిడ్డ పుట్టినా వ్యాపారం మొదలు పెట్టినా పెట్టే పేర్లు కూడా భక్తితో లింక్ అయి ఉంటాయి. ఇక మన పిల్లలకు ఆ దేవుడి పేరు పెడితే వారు జీవితంలో పైకి వస్తారు అనే ఆలోచన ఉంటుంది. ఏదైనా వ్యాపారం మొదలుపెడితే ఆ వ్యాపారానికి దేవుడి పేరు పెడితే అది కలిసి వస్తుంది అని విశ్వాసం కూడా ఉంది.
ఇదే ఫార్ములా సినిమా ఇండస్ట్రీలో కూడా పాటిస్తూ ఉంటారు. గతంలో సినిమా బ్యానర్లు అన్నీ ఇలా దేవుడి పేరు మీద ఉండేవి, ఇప్పుడు కొత్తగా వస్తున్న బ్యానర్లు కూడా చాలా వరకూ దేవుడి పేరుతో వస్తున్నాయి. ఒక ఐదారు సంవత్సరాలుగా చూస్తే దేవుళ్ల పేరు మీద సినిమాలు చాలా వస్తున్నాయి. సక్సస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే చాలా సినిమాలు ఇలాగే వచ్చాయి. అయితే ఇటీవల సెన్సార్ బోర్డు మాత్రం ఇలా వస్తున్న సినిమాలకు క్లియరెన్స్ ఇచ్చేందుకు అభ్యంతరాలు తెలియచేస్తోంది.
ఈరోజు మార్చి 6 వ తేదిన వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన సరస్వతి సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా సరస్వతి అనే పేరుతో రిలీజ్ కు సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పింది. చివరకు ఈ సినిమా ఎస్ సరస్వతిగా నేడు రిలీజ్ అయింది. అలాగే సుహాస్ సినిమా హే భగవాన్ అనే పేరుతో రిలీజ్ చేయాలి అని అనుకున్నారు. భగవాన్ అనే పేరు మార్చాలని సెన్సార్ బోర్డు చెప్పడంతో హే భలవంత్ గా మార్చారు.
**సెన్సార్ బోర్డు ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణం చూస్తే**
కంటెంట్ లో దేవుడి గురించి స్టోరీ ఉండాలి. ఏదైనా దేవుడి గురించి చెబుతున్నా లేదా భక్తుడి గురించి ఈ సినిమా తీసినా సెన్సార్ ఎలాంటి అభ్యంతరం తెలియచేయడం లేదు. ఎందుకంటే మనం హనుమాన్ సినిమా చూశాం, పూర్తిగా దేవుడి గురించి ఉంది. అందుకే వీటికి ఎలాంటి అభ్యంతరం చెప్పడం లేదు. కానీ టైటిల్ దేవుడి పేరు ఉండి స్టోరీ వేరుగా ఉంటే మాత్రం కచ్చితంగా సెన్సార్ బోర్డు నో చెబుతోంది. సెన్సార్ బోర్డు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఆశ్చర్యం కూడా కలిగిస్తున్నాయి.
ఇటీవల కేరళ స్టోరీ 2 రిలీజ్ విషయంలో సుప్రీం కోర్డు చివాట్లు పెట్టింది. ఇక మరో సినిమా చూస్తే తమిళ స్టార్ హీరో విజయ్ జన నాయగన్ ఇది కూడా రిలీజ్ కు సమస్యలు ఎదుర్కొంది. విజయ్ రాజకీయాల్లోకి వచ్చారు టీవీకే పార్టీ పెట్టారు ఈ సినిమాలో రాజకీయ విమర్శలు అంశాలు ఉన్నాయని చెబుతూ ఈ సినిమాకి అభ్యంతరాలు చెప్పింది. సంక్రాంతి రావాల్సిన సినిమా ఇంకా విడుదల ఆలస్యం అవుతూ ఉంది.. సో రానున్న రోజుల్లో దర్శకులు కచ్చితంగా సినిమా టైటిల్ విషయంలో కాస్త జాగ్రతపడతారు అనేది స్పష్టం అవుతోంది.

