Homeవినోదంధురంధర్ 2 ఫస్ట్ రివ్యూ

ధురంధర్ 2 ఫస్ట్ రివ్యూ

ధురంధ‌ర్ సినిమా గ‌త ఏడాది విడుద‌లై ఎంత ఘ‌న విజ‌యం సాధించిందో తెలిసిందే. అయితే ఈసారి సీక్వెల్ కేవ‌లం మూడు నెల‌ల్లో రిలీజ్ చేయ‌డం నిజంగా కొత్త ప్ర‌యోగం అనే చెప్పాలి. గ‌తంలో మ‌నం చూశాం పుష్ప‌2 బాహుబ‌లి, కేజీఎఫ్ ఇవ‌న్నీ కూడా భారీ విజ‌యాలు సాధించాయి. ఇప్పుడు అలాగే ధురంధ‌ర్ 2 రివేంజ్ సినిమా రిలీజ్ ప్లాన్ చేశారు మేక‌ర్స్. ఈ చిత్రం మార్చి 19న విడుద‌ల కానుంది. మ‌రి ఈ సినిమా రివ్యూ ఒక‌సారి చూద్దాం.

ధురంధర్ సినిమాలో మొయిన లీడ్ రోల్ ర‌ణ్ వీర్ సింగ్ న‌టించారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంత గానో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఓవ‌ర్సీస్ మార్కెట్లో ఈ సినిమాకి విప‌రీత‌మైన బ‌జ్ క‌నిపిస్తోంది. పార్ట్ 1 లో ఏం చూపించారు అనేది చూస్తే.

1999 లో జ‌రిగిన ఫ్లైట్ హైజాక్ అలాగే 2001 లో భార‌త్ పార్ల‌మెంట్ పై జ‌రిగిన ఉగ్ర‌దాడి ఘ‌ట‌న‌ల త‌ర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ అజ‌య్ మాధ‌వ‌న్ ఓ నిర్ణ‌యం తీసుకుంటారు. పాకిస్దాన్ని ఎలాగైనా దెబ్బ‌కొట్టాలని అత‌ని ప్లాన్.అక్క‌డ ఉగ్ర‌వాద సంస్ధ‌ల్ని అంతం చేయాలి అని ఆప‌రేష‌న్ ధురంధ‌ర్ అనే సీక్రెట్ మిష‌న్ స్టార్ట్ చేస్తాడు.

పంజాబ్‌లో జైలు జీవితం గడుపుతున్న ఓ కుర్రాడిని ర‌ణ‌వీర్ సింగ్ ని ఓ ఏజెంట్ గా పాక్ లోకి పంపుతారు.
ర‌హ‌స్య ఏజెంట్ గా అత‌ను అక్క‌డ ఏం చేశాడు, క‌రాచీ అడ్డాగా అక్క‌డ ఉగ్ర‌వాదులు చేస్తున్న అరాచ‌కాలు ప్లాన్స్ తెలుసుకుని వాటికి ఎలా చెక్ పెట్టాడు అనేది ఈ స్టోరీ. ఇందులో అక్ష‌య్ ఖ‌న్నా, సంజయ్‌ దత్, అర్జున్‌ రాంపాల్ కీల‌క పాత్ర‌లు చేశారు.ఇప్పుడు దీనికి కొన‌సాగింపుగా ధురంధ‌ర్ 2 వ‌చ్చింది. మ‌రి

**ధురంధ‌ర్ 2 రివ్యూ చూద్దాం**

పార్ట్ 1 కి కంటిన్యూగా గూఢచారి హమ్జా అలీ మజారీ (రణ్‌వీర్ సింగ్) క‌రాచీలో ప్ర‌వేశించి అక్క‌డ రాజ‌కీయ శ‌క్తులు ఆయుధ మాఫీయాల‌ను ఎదుర్కొంటాడు. ఇక్క‌డ ప్ర‌ముఖ రాజ‌కీయ నాయ‌కుడి కుమార్తె యలీనా జమాలితో అత‌నికి ఎలాంటి రిలేష‌న్ ఏర్ప‌డుతుంది. చివ‌రికి క‌థ‌లో వారిద్ద‌రి పరిచ‌యం ఎంత వ‌రకూ తీసుకువెళుతుంది .ఇక అత‌ని గ‌త జీవితం ఏంటి, ఎందుకు క‌రాచీపై ర‌ణ‌వీర్ సింగ్ యుద్దం చేస్తున్నాడు. ఇలాంటి అంశాలు అన్నీ కూడా ఇందులో అత్య‌ద్భుతంగా చూపించారు.

రెహ్మాన్ ప్ర‌భావం క‌రాచీలో త‌గ్గుతుంది. ఆ త‌ర్వాత హ‌మ్జా అలీ మజారీ ర‌ణ‌వీర్ సింగ్ ప్ర‌భావం ఎలా పెరిగింది అనేది కూడా ఆధ్యంతం క‌ట్టిప‌డేసేలా యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో చూపించారు. ఇక స్టోరీని ముందుకు తీసుకువెళ్లే పాత్ర‌లు ఎస్పీ చౌద‌రి సంజ‌య్ ద‌త్, అలాగే ఆర్ మాధ‌వ‌న్ అజ‌య్ స‌న్యాల్ పాత్ర‌లు.ఈ క‌థ‌లో కీల‌కం అవుతాయి. ఈ సినిమా నిడివి కూడా 3 గంట‌లు పైనే ఉంది అని అంటున్నారు. సో పార్ట్ 1 కంటే ఈ రివేంజ్ పార్ట్ 2 మ‌రింత యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో అదిరిపోయింది అని టాక్ వ‌స్తోంది.

దర్శకుడు ఆదిత్య ధర్ ధురంధ‌ర్ 1 తెర‌కెక్కించిన విధానం అంద‌రికి న‌చ్చింది. ఇప్పుడు ఇదే ఫార్ములా పార్ట్ 2లో కూడా క‌నిపిస్తుంది. చాలా రియ‌లిస్టిక్ గా ర‌ణ‌వీర్ సింగ్ న‌ట‌న బాగుంది. ద‌ర్శ‌కుడు ఆదిత్య ధ‌ర్ ప‌నిత‌నం ఈ సినిమాలో స్ప‌ష్టంగా క‌నిపించింది. యాక్ష‌న్ సీక్వెన్స్ సినిమాని మ‌రింత హైట్స్ కి తీసుకువెళ్లాయి. ఫ‌స్ట్ పార్ట్ 1లో సాగ‌తీత ఎక్కువ ఉంది అనే విమ‌ర్శ వ‌చ్చినా, ఇక్క‌డ మాత్రం క‌టింగ్ తో ఎడిటింగ్ ప‌నిత‌నం మెచ్చుకోవాలి. ఎక్క‌డ ఎంత వ‌ర‌కూ అవ‌స‌రం ఉందో అంత వ‌ర‌కూ ట్రిమ్ చేసిన విధానం ప్ల‌స్ అయింది. అయితే పార్ట్ 1 లో డీటెయిలింగ్ కోసం ఎక్కువ సాగ‌దీత తీశారు అనేది మ‌న‌కు ఈజీగా అర్దం అవుతుంది..

సో మొత్తానికి పార్ట్ 1 కి మించి రివేంజ్ కాన్సెప్ట్ చాలా బాగుంది అని టాక్ అయితే వ‌స్తోంది.. తెలుగు స్టేట్స్ లో ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ధురంధ‌ర్ 2 రెండూ కూడా ఒకేరోజు రిలీజ్ అవుతున్నాయి.

 

 

 

 

 

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments