ఓపక్క డిజీల్ పెట్రోల్ ధరలు ఎప్పుడు పెరుగుతాయా అనే టెన్షన్ లో ప్రజలు ఉన్నారు. మరో పక్క జీతాలు పెరగడం లేదు కానీ ఖర్చులు మాత్రం తడిసి మోపెడు అవుతున్నాయి అనే బాధ అందరిలో కనిపిస్తోంది. మరో పక్క కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా 990 రేటు పెరిగింది. మరో పక్క ప్లాస్టిక్ అలాగే సిమెంట్ ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి. ఇక హోటల్స్ రెస్టారెంట్లో గ్యాస్ సమస్యతో ఫుడ్ రేట్లు భారీగా పెంచేశారు. ఇక ఏం కొనే పరిస్దితిలో లేము అంటున్నారు జనం.
ఇలాంటి వేళ నిత్యం వాడుకునే సబ్బులు పేస్టులు పౌడర్ల రేట్లు పెరగనున్నాయి అనే పిడుగులాంటి వార్త షాకిస్తోంది. మన దేశంలో చాలా వరకూ హిందూస్ధాన్ యూనీలీవర్ ప్రొడక్టులు వాడుతూ ఉంటాం. దాదాపు 400 ప్రొడక్టులు ఆ కంపెనీవే ఉంటాయి .హిందూస్థాన్ యూనీలీవర్ తన ఉత్పత్తుల ధరలను పెంచుతున్నాము అని ప్రకటన చేసింది. సో మిడిల్ ఈస్ట్ లో పరిస్దితుల వల్ల మ్యానిఫ్యాక్చురింగ్ కాస్ట్ పెరుగుతోంది. సో మొత్తానికి రవాణా ఖర్చులు పెరుగుతున్నాయి అందుకే కంపెనీలు రేట్లు పెంచక తప్పని పరిస్దితి, కొన్ని సబ్బులు పౌడర్ల తయారీకి, అలాగే ఆయిల్స్ ఇలాంటి తయారీకి విదేశాల నుంచి దిగుమతి అయ్యే రకరకాల ముడి ఉత్పత్తులు ఉంటాయి అవి దిగుమతి తగ్గిపోయింది. మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఈ పరిస్దితికి కంపెనీలకు భారీ నష్టాలు వస్తున్నాయి.
చమురు ధరలు పెరుగుదల వల్ల, కొరత వల్ల దాదాపు ప్యాకేజింగ్ అలాగే మిగిలిన వ్యయాలు 8 నుంచి 10 శాతం పెరిగాయి. అందుకే కంపెనీలు ఈ నిర్ణయాలను తీసుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు 5 నుంచి 10 శాతం ధరలను పెంచాయి. అయితే హిందుస్ధాన్ యూనీలివర్ కొన్ని ప్రొడక్టులు రేట్లు పెంచనుంది, మరికొన్ని ప్రొడక్టులు రేట్లు చాలా తక్కువ మాత్రమే పెంచనుంది. అలాగే ప్యాకెట్ పరిమాణం తగ్గించనుంది. సో మొత్తానికి రానున్న రోజుల్లో మిగిలిన ఎఫ్ ఎం సీజీ కంపెనీలు కూడా ఈ దారిలో నడవనున్నాయి.

