Homeజాతీయరుతుప‌వ‌నాల‌పై గుడ్ న్యూస్ - కూల్ కూల్

రుతుప‌వ‌నాల‌పై గుడ్ న్యూస్ – కూల్ కూల్

ఈ ఏడాది ఎండ‌లు మాములుగా లేవు బ‌య‌ట‌కు వెళ్లాలి అంటేనే జ‌నం భ‌య‌ప‌డుతున్నారు. ఓప‌క్క ఉక్క‌పోత మ‌రో ప‌క్క మండే ఎండ‌, ఇక కార్మికుల క‌ష్టాలు వ‌ర్ణ‌నాతీతం. ఇక ఈ ఎండ‌ల‌తో సూర్యుడు మండిపోతున్నాడు. ఏకంగా 45 డిగ్రీల‌కు ఎండ చేరుకుంది. తీవ్ర‌మైన ఎండ‌తో ఉద‌యం 9 నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కూ బ‌య‌ట‌కు రాలేని ప‌రిస్దితి. అయితే భార‌త వాతావ‌ర‌ణ విభాగం ఇలాంటి వేళ ఓ గుడ్ న్యూస్ అందించింది. ఈ ఏడాది జూన్ వ‌ర‌కూ కాదు ఇంకా ముందుగానే నైరుతి రుతుప‌వ‌నాలు అండ‌మాన్ కు చేర‌తాయ‌ని తెలియ‌చేసింది.

మే 14 వ తేదికి అండ‌మాన్ స‌ముద్రంలోకి నైరుతి రుతుప‌వ‌నాలు ప్ర‌వేశించే అవ‌కాశం ఉంది అని తెలిపింది ఐఎండీ. ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అంటే మ‌నకు కేర‌ళ‌కు కూడా నైరుతి రుతుప‌వ‌నాలు ముందుగానే తాక‌నున్నాయి.

అండ‌మాన్ లో వ‌ర్షాలు మే 16 నుంచి స్టార్ట్ అవుతాయి ఇది చ‌ల్ల‌టి కబురు అనే చెప్పాలి. ఇక మే నెల‌లో స‌గ‌టు వ‌ర్ష‌పాతం కంటే అధికంగానే వ‌ర్ష‌పాతం న‌మోదు అవుతుంది. అయితే ఈశాన్య‌రాష్ట్రాల్లో మాత్రం వ‌ర్షపాతం అనుకున్న‌దాని కంటే త‌క్కువ ఉండ‌నుంది. ఇక మే 3 నుంచి ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త మాత్ర‌మే కాదు రాత్రి ఉష్ణోగ్ర‌త కూడా ఎక్కువ ఉంటుంది అని అధికారులు తెలియ‌చేశారు.

స‌ముద్ర‌ప్రాంతంలో ఉన్న వారికి మ‌రింత వేడి ఉక్క‌పోత ఉంటుంది. ఒడిసా, వెస్ట్ బెంగా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఈ ప్రాంతాల్లో కూడా ఉక్క‌పోత ఎక్కువ ఉంటుంది. కేర‌ళ‌కి ఎప్పుడూ ప్ర‌తీ ఏడాది మే 30 నుంచి జూన్ 2 మ‌ధ్య నైరుతి రుతుప‌వ‌నాలు తాకుతాయి. ఈసారి కూడా జూన్ 1 న కేర‌ళ‌ను తాక‌నున్నాయి. ఇక కేర‌ళ త‌ర్వాత క‌ర్ణాట‌క‌, ఏపీ మీదుగా తెలంగాణ వ‌ర‌కూ ప్ర‌వేసిస్తాయి. జూన్ 10 లేదా 12 కి మ‌హారాష్ట్ర ముంబై ఆ త‌ర్వాత నార్త్ ఇండియా విస్త‌రించి, ఢిల్లీకి జూన్ 30 కి ప్ర‌వేశిస్తాయి. దేశమంతా సుమారు జూలై 15 నాటికి విస్తరిస్తాయి రుతుప‌వ‌నాలు. ఇక జూలై నుంచి వేడి మ‌రింత త‌గ్గుతుంది, ఎండ ఉక్క‌పోత మ‌రింత త‌గ్గ‌నుంది. వ‌ర్షాలు కూడా భారీగా కురుస్తాయి అని అధికారులు తెలియ‌చేస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments