ఈ రోజుల్లో ప్రతీదీ ఆధార్ కార్డుకి లింక్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆధార్ లేనిదే బయట ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ గానీ వేరే లావాదేవీలు కానీ, ప్రభుత్వ పథకాలు కానీ అందని పరిస్దితి. అన్నీ సేవలకు ఆధార్ ఒక ప్రత్యేక కార్డ్ గా మారిపోయింది. మరీ ముఖ్యంగా మన మొబైల్ నెంబర్ కచ్చితంగా ఆధార్ కి లింక్ చేయాల్సిందే. లేకపోతే రేషన్ నుంచి బ్యాంకు సేవల వరకూ అన్నీ కూడా నిలిచిపోతాయి. అయితే ఒక మొబైల్ నెంబర్ కు ఎన్ని ఆధార్ నెంబర్లు లింక్ చేసుకోవచ్చు అనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. మరి దాని గురించి ఈ రోజు క్లుప్తంగా తెలుసుకుందాం.
మీ ఆధార్ నెంబర్ ని మీ ఫోన్ నెంబర్ తో సాధారణంగా లింక్ చేసుకుంటారు. అయితే మీ కుటుంబ సభ్యులు ఉదాహరణకు అమ్మ నాన్న చెల్లి అక్క తమ్ముడు పిల్లలు భార్య ఇలా మీ కుటుంబానికి సంబంధించిన వారి ఆధార్ నెంబర్లకి మీ మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవచ్చు. దీని వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే మీకు పరిచయం లేని వారు, తెలియని వారికి మాత్రం మీ మొబైల్ నెంబర్ కి ఆధార్ లింక్ చేయకూడదు. కేవలం మీ కుటుంబ సభ్యులకి మాత్రమే ఇది పరిమితం అవ్వాలి.
ఒకవేళ ఇలా లింక్ చేసుకుంటే అది ఏమైనా మిస్ యూస్ అయినా, అంటే దుర్వినియోగం జరిగినా మీపై అది ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే మీ కుటుంబ సభ్యుల వరకూ మాత్రమే దీనిని పరిమితం చేసుకోండి. అలాగే కేవలం ఒక మొబైల్ నెంబర్ కి ఆరు ఆధార్ కార్డులు మాత్రమే లింక్ చేసుకునే సదుపాయం ఉంది. అంతకంటే ఎక్కువ లింక్ చేసుకునే సదుపాయం లేదు అనేది గుర్తు ఉంచుకోండి.
ఇక సిమ్ కార్డులు పరిమితి గురించి కూడా చూస్తే మీరు సిమ్ తీసుకునే సమయంలో ఆధార్ సబ్ మీట్ చేస్తారు, ఇలా మనం ఎన్ని సిమ్ కార్డులు పొందవచ్చు అంటే టెలికమ్ శాఖ నిబంధనల ప్రకారం ఒక ఆధార్ కార్డ్ ఉపయోగించి ఒక వ్యక్తి 9 మొబైల్ సిమ్ కార్డులు పొందవచ్చు, అంతకు మించి పొందే అవకాశం లేదు. ఇక దేశం అంతా ఇదే రూల్ లేదు. జమ్మూ కాశ్మీర్ మరియు ఈశాన్య రాష్ట్రాల్లో అయితే ఆరు సిమ్ లు మాత్రమే ఇస్తారు. సో మీరు ఎక్కడైనా ఆధార్ సమర్పించే సమయంలో కచ్చితంగా అది దుర్వినియోగం అవ్వకుండా చూసుకోండి.
ఎక్కువ జిరాక్సులు తీసి వేరే వారికి ఇవ్వడం, మీ ఆధార్ జిరాక్స్ లు ఎక్కడైనా మర్చిపోవడం ఇలాంటివి కూడా చేయకూడదు. అలాగే వేరే వారు మొబైల్ సిమ్ కనెక్షన్ తీసుకున్నా మీరు ఆధార్ ఇవ్వకండి. దీని వల్ల అతను చేసే
తప్పులకి మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇలాంటి కేసులు ప్రతీ ఏడాది సుమారు 10,000 వరకూ నమోదు అవుతున్నాయి.

