కేంద్రంలో నరేంద్రమోదీ సర్కార్ కేబినెట్ విస్తరణ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాజ్యసభకు వెళుతున్న కొందరు సభ్యులు కూడా ఈ కేబినెట్ లో బెర్త్ పొందే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీకి కేబినెట్ లో ఓ స్ధానం దక్కనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీహార్ సీఎం గా ఉన్న నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్తున్నారు. కచ్చితంగా ఆయన్ని కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉందనేది స్పష్టం అవుతోంది. ఇక ఏపీ నుంచి ఎవరికి అవకాశం రానుంది అనేది చూస్తే, కచ్చితంగా జనసేనకు ఈసారి కేబినెట్ బెర్త్ రావచ్చు అంటున్నారు.
పవన్ కల్యాణ్ కు ప్రధాని నరేంద్ర మోదీతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఏపీలో కూటమి పాలన సాగుతోంది.కేబినెట్ విస్తరణలో తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారు బీజేపీ తరపున నరసాపురం ఎంపీ కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక కూటమిలో జనసేన భాగంగా ఉంది. ఈసారి జనసేనకు అవకాశం ఇవ్వాలి అని బీజేపీ భావిస్తోంది.
ఈ ఎన్నికల్లో జనసేన తరపున ఇద్దరు ఎంపీలు గెలుపొందారు. మచిలీ పట్నం నుంచి వల్లభనేని బాలశౌరి, కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్. వీరిద్దరు పార్టీ తరపున ఎంపీలుగా ఉన్నారు. వీరిలో ఎవరికి అవకాశం వస్తుందా అనేది చర్చ సాగుతోంది. బాలశౌరి చాలా సీనియర్ లీడర్ మూడు సార్లు ఎంపీగా గెలుపొందారు. వివాద రహితుడిగా గుర్తింపు ఉంది. ఒకవేళ బాలశౌరిని కాదనుకుంటే యువ నాయకుడు ఉదయ్ శ్రీనివాస్ కి కూడా ఇచ్చే అవకాశం ఉంది.
ఇక వీరిద్దరు కాదు అనుకుంటే జనసేనకు జూన్ నెలలో రాజ్యసభ సీటు వచ్చే అవకాశం ఉంది. ఆ సభ్యుడిని అయినా కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే కేంద్రం ఎప్పుడు కేబినెట్ విస్తరణ చేస్తుందా అనేదానిపై ఎవరికి పదవి వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. ఏపీలో వినిపిస్తున్న వార్తల ప్రకారం జనసేన నుంచి రాజ్యసభకు ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ కి అవకాశం ఇస్తారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటు చంద్రబాబుక పవన్ కి సన్నితుడు కాబట్టి ఆయనకు అవకాశం రావచ్చు.

2024 జూన్ 9న ఏర్పాటు అయిన మోడీ మంత్రివర్గంలో దాదాపుగా మిత్రులు అందరికీ కేంద్ర బెర్తులు దక్కాయి. ఒక్క ఎంపీ గెలిచిన పార్టీలకు కూడా మంత్రి పదవులు దక్కాయి. కానీ ఆనాడు జనసేన కేబినెట్ లో బెర్త్ కోరలేదు. అయితే ఇప్పుడు క్రమంగా జనసేన కూడా కేబినెట్ లో ఉండాలి అనే బలమైన కాంక్షతో ఉంది.ఈసారి జనసేనకు అవకాశం ఉంటుంది అనేది పొలిటికల్ ఈక్వేషన్స్ బట్టి అర్దం అవుతోంది.

