Homeవినోదంఆ స్టార్ హీరో తండ్రి నాకు దేవుడితో స‌మానం - విజ‌యశాంతి

ఆ స్టార్ హీరో తండ్రి నాకు దేవుడితో స‌మానం – విజ‌యశాంతి

టాలీవుడ్ లో విజ‌య‌శాంతికి న‌టిగా ఎంత ప్ర‌త్యేక‌మైన స్ధానం ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. టాలీవుడ్ లేడీ సూప‌ర్ స్టార్ గా ఎవ‌ర్ గ్రీన్ సినిమాలు చేశారు. స్టార్ హీరోల‌కంటే ఎక్కువ రెమ్యున‌రేష‌న్ ఆమె అందుకునేవారు. . రాముల‌మ్మ‌గా అందరూ ఆమెని పిలుస్తారు. ఇక రాజ‌కీయాల్లో కూడా ఆమె ఎంతో పై స్ధాయికి వ‌చ్చారు. టాలీవుడ్ లో ఎన్నో గొప్ప‌చిత్రాల్లో న‌టించారు విజ‌య‌శాంతి. సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లుపెట్టి స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. త‌న‌కు బాగా న‌చ్చిన‌ పాత్ర‌లు మాత్ర‌మే చేస్తున్నారు విజ‌య‌శాంతి.

త‌న సినిమా కెరియ‌ర్ ఇంత‌లా మ‌లుపు తిర‌గ‌డానికి ఎవ‌రు కార‌ణం అనే విష‌యాన్ని విజ‌య‌శాంతి తెలియ‌చేశారు.ఆమెకు సినిమారంగంలో ఇంత పేరు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఆనాటి ద‌ర్శ‌కుడు టి కృష్ణ .ఎన్నో గొప్ప చిత్రాలు చేశారు. ఆయ‌న్ని త‌న సినిమా కెరియ‌ర్ లో దేవుడిగా భావిస్తాను అనే విష‌యాన్ని చెప్పారు విజ‌య‌శాంతి.దర్శకుడు టి. కృష్ణ నేటి భారతం ఇలాంటి చిత్రాల‌తో త‌న‌లో న‌ట‌న‌ని బ‌య‌టకు తీశార‌ని, త‌న‌కు ఆ సినిమాల ద్వారా మరింత దైర్యం వ‌చ్చింది అనే విష‌యాన్ని తెలిపారు విజ‌య‌శాంతి.

న‌ట‌న‌కు స్కోప్ ఉన్న‌ అనేక పాత్ర‌లు చేయించారు. విజ‌య‌శాంతి అంటే గ్లామ‌ర్ న‌టి మాత్ర‌మే కాదు, ఇలాంటి న‌ట‌న‌కు ప్రాధాన్య‌త ఉన్న రోల్స్ కూడా చేయ‌గ‌ల‌దు అని నిరూపించారు. దీనికి పూర్తి క్రెడిట్ ద‌ర్శ‌కుడు కృష్ణ‌గారికే ఇస్తాను అని తెలిపారు. విప్ల‌వాత‌మ్మ చిత్రాల‌కు తాను సెట్ అవుతానా అని ఆలోచించాను, కానీ నువ్వు చేయ‌గ‌ల‌వు నీ హావ‌భావాలు సెట్ వుతాయి అని దైర్యం క‌లిగించి న‌టించేలా చేశారు. న‌న్ను శాంత‌మ్మ అని ఎంతో ఆప్యాయంగా పిలిచేవారు. ఆయ‌న ఏదైనా సినిమా చేస్తే క‌చ్చితంగా అందులో విజ‌య‌శాంతి ఉండాలి అనేలా చూసుకునేవారు.

ఒక‌సారి ప్ర‌తిఘ‌ట‌న సినిమా విష‌యంలో డేట్స్ కుద‌ర‌లేదు, ఈ స‌మ‌యంలో ఏమీ మాట్లాడ‌లేని ప‌రిస్దితి. ఈ సినిమా వేరే హీరోయిన్ తో చేయ‌లేను, ఒక‌వేళ విజ‌య‌శాంతి చేయ‌క‌పోతే సినిమా వ‌దిలేస్తాను అని ప‌ట్టుబ‌ట్టారు. చివ‌ర‌కు డేట్స్ విష‌యంలో మిగిలిన సినిమా నిర్మాత‌ల‌ను ఒప్పించి ఈ సినిమా డేట్స్ తీసుకుని పూర్తి చేశారు. ఈ సినిమా త‌న జీవితంలో గొప్ప సినిమా అని తెలిపారు విజ‌య‌శాంతి. ఇక్క‌డ నుంచి సూపర్‌స్టార్‌ అనే బిరుదు కూడా ఆమె పొందారు. ఇక తెలుగు స్టార్ హీరో గోపీచంద్ ఎవ‌రో కాదు ద‌ర్శ‌కుడు టి. క‌ష్ణ‌గారి కుమారుడు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments