Homeతెలంగాణక‌విత పార్టీపై గంట‌లోనే ట్రోల్స్

క‌విత పార్టీపై గంట‌లోనే ట్రోల్స్

తెలంగాణ‌లో మ‌రో కొత్త రాజ‌కీయ పార్టీ నేడు ఆవిర్భ‌వించింది, తెలంగాణ లో కేసీఆర్ కుటుంబం నుంచి మ‌రో కొత్త పార్టీ వ‌చ్చింది, క‌ల్వ‌కుంట్ల క‌విత ఇటీవ‌ల బీఆర్ఎస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు, ఒక కొత్త పార్టీ పెడ‌తాను అని ప్ర‌క‌ట‌న చేశారు, తాజాగా నేడు పార్టీ పెట్టింది ఆమె. అయితే ఆమె టీఆర్ఎస్ అనే పేరుతొ పార్టీ ప్ర‌క‌టించ‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది, ఎందుకంటే గ‌తంలో టీఆర్ఎస్ అనే పార్టీని కేసీఆర్ బీఆర్ఎస్ గా మార్చారు, అయితే క‌విత మ‌ళ్లీ ఆ టీఆర్ఎస్ పార్టీ పేరుతో తెలంగాణ రాష్ట్ర సేన అని పార్టీ పేరు పెట్ట‌డం చాలా చ‌ర్చ‌కు కార‌ణం అయింది.

అంతేకాదు ఇటీవ‌ల కేటీఆర్ కూడా పార్టీ పేరు మార్పు మాకు బాగా ఇబ్బంది అయింది అని తెలిపారు, వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యానికి బీఆర్ఎస్ కాకుండా టీఆర్ఎస్ అనే పేరు ఆలోచ‌న చేస్తున్నారు అనేలా ఆయ‌న మాట్లాడారు, ఇలాంటి వేళ ఆయ‌న సోద‌రి ఇలా టీఆర్ఎస్ పార్టీ పేరు పెట్ట‌డం నిజంగా ఆ పార్టీ నేత‌లు కూడా ఆశ్చ‌ర్య‌పోయారు, జాగృతి అధ్య‌క్షురాలిగా ఆమె కొన‌సాగారు, అయితే జాగృతి పేరు వ‌చ్చేలా పార్టీ ప్ర‌క‌ట‌న వ‌స్తుంది అని
అంద‌రూ భావించారు. కానీ దానికి భిన్నంగా ఈ పేరు ఉంది.

అయితే పార్టీ ప్ర‌క‌ట‌న వ‌చ్చిన వెంట‌నే స‌టైర్లు కూడా బీఆర్ ఎస్ నుంచి మొద‌లైయ్యాయి, ఇక బీఆర్ఎస్ అయితే ఓ స‌టైర్ కూడా వేసింది, మార్కెట్లో అనేక ర‌కాల బ్రాండెడ్ ఉత్ప‌త్తుల‌కి న‌కిలీ ఉత్ప‌త్తులు క‌నిపిస్తూ ఉంటాయి అలాగే ఇక్క‌డ కూడా ఇలా టీఆర్ఎస్ పేరు వాడుకున్నారు అనేలా ఓ అర్దం వ‌చ్చేలా పోస్టు పెట్టారు.

కోల్‌గేట్ టూత్‌పేస్ట్, బిస్లేరీ వాటర్ బాటిల్‌కు ఆ బ్రాండ్ పేరు వ‌చ్చేలా కొన్ని ఉత్త్ప‌త్తులు ఉంటాయి. అలాగే ఈ పార్టీ పేరు కూడా ఉంది అనేలా కామెంట్లు చేశారు. ఒరిజిన‌ల్ ఒరిజిన‌లే అని కామెంట్లు చేశారు బీఆర్ఎస్ నేత‌లు.

ఇక స్టేట్ లెవ‌ల్లో సోష‌ల్ మీడియా వార్ అప్పుడే మొద‌లైంది. ఇన్ని పేర్లు ఉండ‌గా పాత పార్టీ పేరుని వాడుకుంటున్నారు క‌దా అంటూ కౌంట‌ర్లు ఇస్తున్నారు గులాబీ నేత‌లు. కేసీఆర్ కేటీఆర్ హ‌రీష్, అలాగే పార్టీ వ‌ద్దు అని అనుకున్న‌ప్పుడు మ‌ళ్లీ టీఆర్ఎస్ పేరు ఎందుకు క‌విత‌మ్మా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. మొత్తానికి క‌విత‌కు తొలి రోజే తొలి గంట‌లోనే ఇలా కామెంట్లు రావ‌డంతో వారి టీమ్ కూడా స‌రైన కౌంట‌ర్లు ఇస్తోంది.

అది కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఇది ప్ర‌జ‌ల టీఆర్ఎస్ పార్టీ అంటూ కౌంట‌ర్లు ఇస్తున్నారు. సో ఆ బ్రాండ్ మాది అనేలా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments