Homeతెలంగాణతెలంగాణలో మే 1 నుంచి పెరగనున్న భూముల ధరలు

తెలంగాణలో మే 1 నుంచి పెరగనున్న భూముల ధరలు

తెలంగాణ‌లో ఇళ్లు లేదా స్ధ‌లం పొలం క‌మ‌ర్షియ‌ల్ ప్రాప‌ర్టీ కొనాలి అనుకునేవారికి ఇది కీల‌క‌మైన న్యూస్ అనే చెప్పాలి. ఇల్లు పొలాలు స్దలాల రిజిస్ట్రేష‌న్ కోసం ప్రభుత్వం నిర్ణ‌యించే మార్కెట్ విలువ పెర‌గ‌నుంది. ప్ర‌భుత్వం ఇప్ప‌టి వ‌ర‌కూ నిర్ణ‌యించిన ఈ రేట్లు మే 1 నుంచి పెర‌గ‌నున్నాయి. అంటే రిజిస్ట్రేష‌న్ వాల్యు ఏదైతో ఉందో దాని విలువ పెర‌గ‌నుంది. ఉదాహ‌ర‌ణ‌కు గ‌జం ప‌దివేలు ఉంటే ఇప్పుడు ఆ విలువ ప్ర‌భుత్వ ధ‌ర 13 లేదా 15 వేలు అవ్వ‌నుంది. దీని వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు రిజిస్ట్రేష‌న్ విలువ పెరుగుతుంది.

దీంతో ప్ర‌భుత్వ విలువ పెరుగుతుంది కాబ‌ట్టి స్టాంప్ డ్యూటీ అలాగే రిజిస్ట్రేష‌న్ చార్జీలు ప్ర‌భుత్వానికి పెరుగుతాయి. ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ఆధ్వ‌ర్యంలో వ‌నురుల స‌మీక‌ర‌ణ‌పై మంత్రి వ‌ర్గ ఉప‌సంఘం వేశారు. ఈ క‌మిటి ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. అయితే దీని వ‌ల్ల పార‌ద‌ర్శ‌కత పెర‌గుతుంది అని ప్ర‌భుత్వం కూడా తెలియ‌చేస్తుంది.

ముఖ్యంగా బ‌య‌ట మార్కెట్లో గ‌జం విలువ 40 వేలు 50 వేలు ఉంటే ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన రేటు 15 వేలు 16 వేలు ఉటుంది దీని వ‌ల్ల ప్రభుత్వానికి ఆదాయం త‌క్కువ వ‌స్తుంది. సో ప్ర‌భుత్వం కూడా మార్కెట్ విలువ బట్టి రేటు ఫిక్స్ చేస్తే ఆ శాఖ‌కి ఆదాయం కూడా పెరుగుతుంది. సో ఈ నిర్ణ‌యం వ‌ల్ల న‌ల్ల‌ధ‌నం అరిక‌ట్ట‌వ‌చ్చు అని తెలియ‌చేస్తున్నారు ఆర్దిక రంగ నిపుణులు.

ఇక ఈ కొత్త స‌వ‌ర‌ణ‌ల వ‌ల్ల దాదాపు ప్ర‌తీ ఏడాది 2000 కోట్లు అద‌న‌పు ఆదాయం వ‌స్తుంది అంటున్నారు. 2023లో కొత్త ప్ర‌భుత్వం తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చింది . ఇప్ప‌టి వ‌ర‌కూ రేట్లు పెంచ‌లేదు, గ‌తంలో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చాలా మంద‌గ‌మ‌నంగా సాగింది. అందుకే ఈ నిర్ణ‌యం ఆనాడు తీసుకోలేదు. ఇప్పుడు తాజాగా నిర్ణ‌యం తీసుకుంటున్నారు. ఇక కేసీఆర్ స‌ర్కార్ ఉన్న స‌మ‌యంలో 2021లో ఆనాటి ప్ర‌భుత్వం ఈ విలువ‌ల‌ను పెంచింది. మ‌ళ్లీ ఈ ఏడాది పెంచుతున్నారు.

సో తెలంగాణ స‌ర్కారు తీసుకుంటున్న ఈ నిర్ణ‌యం వ‌ల్ల కొనుగోలుదారులపై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల ఖ‌ర్చు పెరుగుతుంది. ఇక మ‌రో కొత్త వార్త ఏమిటి అంటే, ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో సుమారు మార్కెట్ విలువ 15 నుంచి 20 శాతం పెర‌గ‌నుంద‌ట‌. ఎక్కువ ఇన్వెస్ట్ మెంట్లు కొనుగోళ్లు ఇటువైపే కాబ‌ట్టి స‌ర్కారు ఆలోచ‌న ఆ తీరున ఉంది.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments