Homeజాతీయమెగాస్టార్ కి కేర‌ళ సీఎం క్ష‌మాప‌ణ‌

మెగాస్టార్ కి కేర‌ళ సీఎం క్ష‌మాప‌ణ‌

విన‌డానికి కొంచెం ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఇది నిజం. కేర‌ళ రాజ‌కీయాలు సినిమాల గురించి ఎప్పుడూ వార్త‌లు వింటూ ఉంటాం. అక్క‌డ జ‌రిగే కొన్ని ఘ‌ట‌నలు కూడా ఇటీవ‌ల ఆశ్చ‌ర్యం క‌లిగిస్తున్నాయి. మ‌న‌కు మెగాస్టార్ అంటే చిరంజీవి గుర్తుకు వ‌స్తారు. మ‌రి కేర‌ళ‌లో కూడా మెగాస్టార్ ఉన్నారు ఆయ‌నే మ‌మ్ముట్టీ. ఆయ‌న‌కు ఏకంగా కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ క్ష‌మాప‌ణ చెప్ప‌డం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. అస‌లు జ‌రిగిన ఘ‌ట‌న ఏమిటి అనేది చూస్తే

వ‌య‌నాడ్ ప్ర‌జ‌ల క‌ష్టాలు తెలుసుకోవాలి అని మెగాస్టార్ మ‌మ్ముట్టి ఇటీవ‌ల అక్క‌డకు వెళ్లారు. అయితే ఆయ‌న వ‌స్తున్నారంటే ఏ రాజ‌కీయ పార్టీ నేత‌లైనా అక్క‌డ‌కు వ‌స్తారు. ఈ స‌మయంలో ఆయ‌న పార్టీ రంగు పులుముకోకూడ‌దు అని ఓ కామెంట్ చేశారు. ఇది వివాదం మారింది సోష‌ల్ మీడియాలో… జ‌రిగింది ఏమిటి అనేది చూస్తే

సీపీఎం జిల్లా కార్యదర్శి రఫీక్‌తో మ‌మ్ముట్టి మాట్లాడుతున్న స‌మ‌యంలో నువ్వు నా ప‌క్క‌న ఉంటే నేను నీ కోసం వ‌చ్చాను అని జ‌నం భావిస్తారు. ద‌య‌చేసి నువ్వు కాస్త‌దూరంగా ఉండు అని చెప్పారు.ఇదంతా అక్క‌డ ఉన్న కెమెరాల్లో రికార్డ్ అయింది. ఇక ఈ వీడియో వైర‌ల్ కావ‌డంతో సీపీఎం కార్య‌క‌ర్త‌లు సోష‌ల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున మ‌మ్ముట్టిని విమ‌ర్శిస్తున్నారు. దీనికి ఎంతో బాధ‌ఫ‌డిన మ‌మ్ముట్టి ర‌ఫీక్ కు ఫోన్ చేసి మాట్లాడారు. ర‌ఫీక్ కూడా వెంట‌నే ఓ వీడియో విడుద‌ల చేశారు. ఈ వివాదానికి ముగింపు ప‌ల‌కాలి అని కోరారు. ఆయ‌న నాకు చాలా సున్నితంగా చెప్పార‌ని ఆయ‌న ప్ర‌జ‌ల మ‌నిషి అని రాజ‌కీయాల‌కు ఆయ‌న‌కు సంబంధం లేద‌ని ర‌ఫీక్ తెలిపారు.

ఈ విష‌యం ముఖ్య‌మంత్రి విజ‌య‌న్ కు తెలిసి ఆయ‌న భాధ‌ప‌డ్డారు, మ‌మ్ముట్టి మ‌న వ్య‌క్తి రాష్ట్రానికి ఎంతో పేరు తెచ్చిన వ్య‌క్తి, ఆయ‌న ప‌డిన బాధ‌కు చింతిస్తున్నా. ఆయ‌న మ‌న కేర‌ళ గౌర‌వాన్ని ఎంత‌గానో పెంచారని మమ్ముట్టికి మద్దతుగా నిలిచారు.. ఇలా సోష‌ల్ మీడియాలో ఆయ‌న‌పై కామెంట్లు చేయ‌డం బాధాక‌రం. ఆయ‌న్ని ఇలా ఉద్దేశ‌పూర్వ‌కంగా ఎవ‌రైనా బాధ‌పెట్టి ఉంటే దానికి ముఖ్య‌మంత్రిగా నేను క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నా అని పిన‌ర‌యి విజ‌య‌న్ తెలిపారు. దీనిని ప్ర‌భుత్వం కూడా సీరియ‌స్ గా తీసుకుంది. ఆయ‌న‌పై హేటెడ్ కామెంట్లు చేసిన వారిపై పోలీసులు చ‌ర్య‌ల‌కు దిగుతున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments