నిత్యం వందలాది నౌకలతో ఎంతో రద్దీగా ఉండే హర్ముజ్ జలసంధి ఎలాంటి నౌకా ప్రయాణాలు లేకుండా నిలిచిపపోయింది. మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్న వార్ తో ఈ జలమార్గం గుండా ఏమైనా నౌకలు వెళ్లాలి అన్నా భయపడుతున్నారు. దాదాపు 45 దేశాలకు సంబంధించి ఆయిల్ ఈ మార్గం గుండా నౌకల ద్వారా వస్తుంది. అయితే మన దేశం కూడా ఈ మార్గం ద్వారానే 40 శాతం మన అవసరాలకు చమురు రవాణా చేసుకుంటున్నాము, అయితే ఇజ్రాయిల్ అమెరికా సంయుక్తంగా ఇరాన్ పై చేస్తున్న దాడులతో ఈ మార్గాన్ని మొత్తం ఆంక్షలతో కట్టుదిట్టం చేశారు. తాజాగా భారత్ కు ఇరాన్ గుడ్ న్యూస్ చెప్పింది.
నౌకలపై ఆయా దేశాల జెండాలు ఉంటాయి. కచ్చితంగా ముందు భాగం వెనుక భాగం మధ్య భాగంలో ఈ జెండాలు ఉంటాయి. అయితే మన భారతదేశ జెండాలు ఉన్న నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కచ్చితంగా భారత్ కు సంబంధించి ఏఏ నౌకలు ప్రయాణం చేస్తున్నాయో తెలియచేయాలి అని వాటికి పర్మిషన్ ఇస్తాం అని తెలిపింది. భారత్ నౌకలను ఎట్టి పరిస్దితుల్లో ఆపమని తెలిపింది. తాజాగా ఆయిల్ గ్యాస్ తో వస్తున్న రెండు నౌకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మరో వారం రోజుల్లో ఇవి చేరుకోనున్నాయి. నిన్నఒక థాయ్ నౌకపై దాడి జరిగింది దీంతో వివిధ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఓపక్క ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఈ రూట్ లో రవాణాకి చేతులెత్తేశాయి. కంపెనీలు డేర్ గా ఇటు వైపు రవాణా చేయాల్సిన పరిస్దితి వచ్చింది. మన దేశంలో ఇప్పటికే గ్యాస్ ఎఫెక్ట్ కనిపిస్తోంది, చాలాచోట్ల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ లు దొరక్కపోవడంతో హోటల్స్ మూసివేస్తున్నారు. ఇక గృహ అవసరాలకు కూడా రిఫిల్ బుకింగ్ కి బుకింగ్ కి మధ్య 25 రోజుల గ్యాప్ ఉండాలని తెలిపారు. .మొత్తానికి ఇరాన్ దేశం మైన్స్ ని ఈ మార్గంలో స్టోర్ చేసిందని వార్తలు రావడంతో అమెరికా ఈ ప్రాంతంలో దాడులకు పాల్పడుతోంది. ఇరాన్ కూడా ధీటుగా సమాధానం చెబుతోంది.

