2024 ఎన్నికల్లో జగన్ ఓటమి వైసీపీ నేతలకు పెద్ద షాక్ అయితే, గుడివాడలో కొడాలి నాని ఓటమి కూడా మరింత షాక్ ని కలిగించింది. ఓటమి ఎరుగని నాయకుడిగా నాని పేరు తెచ్చుకున్నారు. అలాంటిది గుడివాడలో ఈసారి టీడీపీ గెలవడంతో కొడాలి నానికి షాక్ తగిలింది, ముఖ్యంగా పేదల ఓటు బ్యాంక్ అంతా గంపగుత్తగా పడేది నానికి, గుడివాడలో అదే పెద్ద అసెట్ గా ఆయన రాజకీయాల్లో ముందుకు సాగారు. కానీ ఈసారి అనుకున్న ప్రాంతాల్లో గ్రామాల్లో కూడా ఆయనకు మెజార్టీ రాలేదు. ఇది నానికి కొన్ని నెలలు వేదన కలిగించింది. తమని ప్రజలు ఓడించారు కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీకి కాస్త టైమ్ ఇస్తాం అని ఓ సందర్బంలో అన్నారు. తర్వాత కాస్త అనారోగ్యంతో ఇబ్బంది పడ్డారు. ఇలా రెండు సంవత్సరాల్లో పెద్దగా నాని బయటకు వచ్చిన సందర్బాలు తక్కువ.

అధికారంలో ఉన్న సమయంలో నాని నిత్యం వార్తల్లో ఉండేవారు. ఆయన ఏం మాట్లాడినా జగన్ వారియర్స్ దానిని వైరల్ చేసేవారు. అయితే ఎన్నికల్లో చంద్రాబు లోకేష్ పవన్ పై ఆయన దూషణలు కూడా మైనస్ అయ్యాయి. ఇక జరగాల్సిన నష్టం జరిగింది. మరో మూడు సంవత్సరాల వరకూ ఎన్నికలు లేవు .ఎన్నికలకు ఏడాది ముందు నుంచి మాత్రమే గ్రౌండ్ లో తమ ప్రతాపం చూపిస్తారు నాయకులు. అయితే నాని ఇటీవల తన వాయిస్ పెంచడం వైసీపీ కేడర్ కు కొత్త జోష్ తీసుకువచ్చింది. గతంలో నాని ఎలా ఉండేవారో అలాంటి నాని కావాలి అని వైసీపీ నేతలు కేడర్ కూడా కోరుకుంటున్నారు.
అయితే నాని ఎందుకు ఇంత సైలెంట్ అయ్యారు అంటే అనేక కారణాలు ఉన్నాయి. రెడ్ బుక్ లో నాని పేరు ఉందని సరైన టైమ్ కోసం వేచి చూస్తున్నారు అని మరో పక్క కూటమి నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.
వరుసగా నాలుగు సార్లు గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నేత, అలాంటి నానిని టచ్ చేస్తే రాజకీయంగా అక్కడ మరింత ఇబ్బంది అవుతుందా అనే ఆలోచన కూడా, టీడీపీకి ఉంటుంది అనేది రాజకీయ విశ్లేకుల వాదన. జగన్ సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబుని అరెస్ట్ చేయడంతో జగన్ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. ఈ ఘటనతో చంద్రాబుకి ఎంతో మైలేజ్ వచ్చింది. ఇలాంటి నిర్ణయాలు రాజకీయాల్లో ఆచితూచి తీసుకోవాలి. అందుకే నాని విషయంలో కూడా కూటమి ప్రభుత్వం సరైన సమయం కోసం చూస్తోంది అనే చర్చ సాగుతోంది.
కొడాలి నాని వైసీపీ ప్రభుత్వంలో మూడేళ్ల పాటు కీలకమైన పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. గుడివాడ మీద పట్టున్న నేత, 18 నెలలుగా సైలెంట్ గా ఉన్న నాని తాజాగా సీరియస్ అయి తన వాయిస్ పెంచారు.
ఇటీవల ఆయన వైసీపీ సీనియర్ లీడర్ మాజీ మంత్రి అంబటి రాంబాబుని కలిశారు.
ఈ సమయంలో మీడియాని అడ్రస్ చేశారు నాని. కచ్చితంగా కూటమి ప్రభుత్వ పని అయిపోయింది. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు అంటూ మాట్లాడారు.

అంతేకాదు జైలుకు రెడ్ బుక్ కి ఎవరూ భయపడేది లేదన్నారు నాని. కూటమి ప్రభుత్వం తమపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము పట్టించుకోమని దేనికైనా సిద్దం అన్నారు. ఈ సంకేతాలు దేనికి అర్దం అనేది చూస్తే, కూటమి నాయకులు ఏం చేసినా తాము వెనకడుగు వేసేది లేదనే సంకేతాలు ఇచ్చారు. తాజాగా కొడాలి నాని వ్యాఖ్యలతో ఆయన రాజకీయంగా దూకుడు పెంచారు అనేది అర్దం అవుతోంది. ఏపీలో ప్రజలకు కూటమి ప్రభుత్వం పై వ్యతిరేకత మొదలైందని, అందుకే నాని ఇది గమనించి ఇలాంటి కామెంట్లు చేశారు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయంగా తెలియచేస్తున్నారు.
తాజా కామెంట్లతో గుడివాడలో కొడాలినాని కేడర్ కు కొత్త జోష్ వస్తోంది.

