Homeఆంధ్ర ప్రదేశ్కొత్త పింఛ‌న్ల పై గుడ్ న్యూస్ ఎప్పుడ‌య్యా?

కొత్త పింఛ‌న్ల పై గుడ్ న్యూస్ ఎప్పుడ‌య్యా?

ఏపీలో 2024 లో ఎన్నిక‌లు పూర్తి అయ్యాయి. ఇంక రెండు నెల‌లు గ‌డిస్తే కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి రెండు సంవ‌త్స‌రాలు పూర్తి అవుతుంది. అయితే ఎన్నిక‌ల్లో ఇచ్చిన అన్నీ హామీలు పూర్తి చేశామని సూప‌ర్ సిక్స్ అమ‌లు చేశామ‌ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చెబుతోంది. కానీ గ్రౌండ్ లెవ‌ల్ లో ప‌రిస్దితి ఒక్క‌సారి చూడాలని వైసీపీ కౌంట‌ర్లు ఇస్తోంది. చంద్ర‌బాబు ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలు అన్నీ నెర‌వేర్చ‌లేదు అంటూ ప్ర‌శ్నిస్తున్నారు వైసీపీ నేత‌లు. మ‌హిళ‌ల‌కు ఉచిత‌ బస్పు ప్ర‌యాణం ఫించ‌న్ల పెంపు ఇందులో కూట‌మి స‌క్స‌స్ అయింది.

అయితే ఐదు సంవ‌త్స‌రాల‌కి కొంత కొంత మొత్తం గా పించ‌న్ పెంచుకుంటూ పోతా అని జ‌గ‌న్ హామీ ఇస్తే, తాను అధికారంలోకి వ‌స్తే ఒకేసారి 4000 పించ‌న్ ఇస్తాను అని చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న చేశారు. అలాగే అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఫించ‌న్ ట‌క్కును 4000 చేశారు. ఇది చాలా మందికి ఊర‌ట ఇచ్చింది. అయితే అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మూడు బ‌డ్జెట్ లు ప్ర‌వేశ పెట్టిన చంద్ర‌బాబు స‌ర్కారు, ఈ సారైన కొత్త పించ‌న్ల కోసం చూస్తున్న అవ్వ‌తాత‌ల‌కు గుడ్ న్యూస్ చెబుతారా అని ఎదురుచూస్తున్నారు.

60 ఏళ్ల వ‌య‌సు దాటిన వారు మందుల‌కి చిన్న చిన్న అవ‌స‌రాల‌కైనా ఆ నాలుగు వేలు ఉప‌యోగించుకుంటామ‌ని మా పై క‌నికరం చూపండ‌ని కూట‌మి నేత‌ల‌ను ఎక్క‌డ‌కు వెళ్లినా ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్పటికే గ్రామ వార్డు స‌చివాల‌యాల్లో చాలా మంది కొత్త పించ‌న్ల కోసం అప్లై చేసుకున్నారు. ఈ సంక్రాంతికి కొత్త పించ‌న్లు అందుతాయి అని అనుకుంటే, ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు. అటు ఉద్యోగుల‌ని కూడా చాలా మంది మాకు ఎప్పుడు పించ‌న్ అందిస్తారు అని ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేద‌ని ఓ ప‌క్క ఉద్యోగులు కూడా అప్లై చేసుకున్న వారికి జ‌వాబు ఇస్తున్నారు.

అయితే ఫించ‌న్లు కొత్త‌వి ఇవ్వ‌డానికి చంద్ర‌బాబు స‌ర్కారు సిద్దంగానే ఉంది కాని ఖ‌జానా ఖాళీగా ఉంది. ఖర్చులు చూస్తే మోపెడు అవుతున్నాయి. కాని రాష్ట్ర ఆదాయం మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఇప్ప‌టికే ఉన్న పెండింగ్ ప‌నుల‌కి, ఉద్యోగుల‌ జీతాల‌కి, ప్ర‌స్తుతం అమ‌లు అవుతున్న ప‌థ‌కాల‌కి నిధులు ఖ‌ర్చు చేస్తున్నారు. ఓడీల కోసం తిప్ప‌లు ప‌డుతున్నారు. ఇలాంటి వేళ కొత్త ఫించ‌న్లు అందివ్వాలి అంటే అది క్లిష్ట‌మైన‌దే అని ఆర్దిక నిపుణులు తెలియ‌చేస్తున్నారు.

అయితే కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది. నిధులు రాబ‌ట్ట‌డంలో చంద్ర‌బాబుకి సౌత్ లో అన్నీ స్టేట్స్ కంటే ఎక్కువ ప్ర‌యారిటీ ఉంది. రెండు సంవ‌త్స‌రాలు పూర్తి అవుతున్న వేళ , కొత్త పించన్ల కోసం బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే, ఇది పార్టీకి మ‌రింత మైలేజ్ తీసుకువ‌స్తుంది అంటున్నారు తెలుగు త‌మ్ముల్లు. మ‌రోప‌క్క ఏదైనా కొత్త కార్య‌క్ర‌మానికి హజ‌రుఅవుతుంటే కూట‌మి నేత‌ల‌కు కొత్త పింఛ‌న్ల కోసం అర్హుల నుంచి తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది.
దీనిపై జిల్లాల్లో కేడ‌ర్ కూడా జిల్లా అధ్య‌క్షుల‌కి మంత్రుల‌కి ఈ విష‌యం తెలియ‌చేస్తున్నారు.

చంద్ర‌బాబు పై న‌మ్మ‌కం ఉన్న చాలా మంది ఆయ‌న గెలిస్తే నాలుగు వేల పించ‌న్ అందిస్తా అన్నారు. ఆ హామీ నిల‌బెట్టుకున్నారు. ఇక మూడు నెల‌ల అరియ‌ర్స్ ఇచ్చి ప్ర‌జ‌ల మెప్పు పొందారు. భ‌ర్త చ‌నిపోతే నెల రోజుల్లోపు ఆ పింఛ‌న్‌ను భార్య‌కు బ‌దిలీ చేయ‌డం అనేది ప్ర‌స్తుతం జ‌రుగుతుంది, ఈ కార్య‌క్ర‌మం మిన‌హా కొత్త‌గా ఎవ‌రికి పించ‌న్ అందివ్వ‌లేదు. సో రానున్న రోజుల్లో గుడ్ న్యూస్ వినిపించాలి అని మొర‌పెట్టుకుంటున్నారు అవ్వ‌తాత‌లు.

ఓ వైపు అవ్వాతాత‌ల కోరిక ఇలా ఉంటే మ‌రో ప‌క్క ఎన్నిక‌ల హమీల్లో భాగంగా బీసీల‌కు 50 ఏళ్ల‌కు పించ‌న్ ఇస్తాము అన్నారు చంద్ర‌బాబు. ఆ ప‌థ‌కం గురించి కూడా ఎక్క‌డా ఉలుకు ప‌లుకు లేదు. ఇవ‌న్నీ కూడా వైసీపీ అస్త్రాలుగా మార్చుకుంది. చంద్ర‌బాబు ప‌ది హామీలు ఇచ్చి మూడు హమీలు పూర్తి చేసి, వాటికి ప్ర‌చారం కోసం కోట్ల రూపాయ‌లు డ‌బ్బు ఖర్చు చేసి ప్ర‌చారం చేసుకుంటాడ‌ని, ప్ర‌జా క్షేత్రంలో క‌చ్చితంగా ఈ ఫించ‌న్ల విష‌యంలో నిల‌దీస్తాం అంటూ సోష‌ల్ మీడియాలో వైసీపీ కేడ‌ర్ ప్ర‌శ్నిస్తోంది, మ‌రో ప‌క్క కూట‌మి నేత‌లు ఏపీ ఆర్దిక ప‌రిస్దితి దారుణం చేసి, ఇప్పుడు మ‌మ్మ‌ల్ని ప్ర‌శ్నిస్తున్న వైసీపీకి ప్ర‌జ‌లు వాత పెట్టినా మార్పు రాలేదంటూ కౌంట‌ర్ ఇస్తున్నారు.

ఒక విష‌యం అర్ధం చేసుకోవాలి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లోపు క‌చ్చితంగా చంద్ర‌బాబు స‌ర్కారు దీనిపై గుడ్ న్యూస్ వినిపించ‌వ‌చ్చు అనేది రాజ‌కీయ విశ్లేష‌కులు తెలియ‌చేస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments