Homeవినోదంకోకాపేట్ అల్లు సినిమాస్ - ఈ సినిమాతో స్టార్ట్

కోకాపేట్ అల్లు సినిమాస్ – ఈ సినిమాతో స్టార్ట్

అల్లు సినిమాస్ కోసం న‌గ‌ర వాసులు ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. ఇటు మెగా అల్లు ఫ్యాన్స్ తో పాటు హైదరాబాద్ సినిమా అభిమానులు ఈ సినిమాస్ ఎక్స్ పీరియ‌న్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా థియేట‌ర్ ప్లాన్ చేస్తున్నామ‌ని ప్ర‌క‌ట‌న వ‌చ్చిన స‌మ‌యం నుంచి న‌గ‌ర వాసులు ఇది ఎప్పుడు అందుబాటులోకి వ‌స్తుందా అని ఎదురుచూశారు, తాజాగా సంక్రాంతికి అని అనుకున్నా చివ‌ర‌కు మార్చి నెల‌లో ఈ థియేట‌ర్ అందుబాటులోకి రానుంది తాజాగా అల్లు సినిమా ప్ర‌క‌ట‌న చేసింది.

డాల్బీ సినిమా స్క్రీన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ సినిమాస్ అధికారికంగా విడుద‌ల తేది వ‌చ్చేసింది. ఇది అత్యాధునిక సాంకేతిక‌త‌తో కోకాపేట‌లో అల్లు వారి ప్రాంతంలోనే నిర్మించారు. దీనిని ఈ నెల అంటే మార్చి 12 న ప్రారంభించ‌నున్నారు. ఈ మ‌ల్టిఫ్లెక్స్ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తారు, ఈ కార్య‌క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి, స్టార్ ప్రొడ్యుస‌ర్ అల్లు అర‌వింద్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట రెడ్డి హ‌జ‌రుకానున్నారు.

ఇక మ‌న దేశంలో మూడో అతి పెద్ద డాల్బీ స్కీన్ ఇది. హైద‌రాబాద్ లో ఇదే తొలి స్క్రీన్ అవుతుంది. బ్రాడ్ పిట్ నటించిన ఎఫ్ 1 తొలి సినిమాగా దీనిని ట్ర‌య‌ల్ ర‌న్ వేస్తారు, అంటే ప్రారంభం త‌ర్వాత ఈ సినిమా కొద్ది రోజులు అన్నీ షోలు ప్ర‌ద‌ర్‌శిస్తారు, ఆ ట్ర‌య‌ల్ ర‌న్ నాలుగు రోజుల వ‌ర‌కూ ఉంటుంది ఆ త‌ర్వాత సాధార‌ణ సినిమాలు కూడా ప్ర‌ద‌ర్శిస్తారు అయితే ఈ నెల‌లో రెండు పెద్ద సినిమాలు రిలీజ్ డేట్ వ‌చ్చ‌శాయ‌, ధూరంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ ఈ రెండు సినిమాలు కూడా ఈనెల 19 నుంచి అల్లు సినిమాస్ లో ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. అల్లు సినిమాస్ లో డాల్బీ సినిమా స్కీన్ 1 అన్నింటి కంటే పెద్ద‌ది ఇందులో 644 మంది సినిమా ఎక్స్ పీరియ‌న్స్ చేయ‌వ‌చ్చు. అల్లు ఫ్యాన్స్ కి ఇది పండుగ అనే చెప్పాలి. న‌గ‌రంలో సినిమా ప్ర‌పంచంలో మ‌రో ఎంట‌ర్ టైన్మెంట్ హ‌బ్ గా ఇది ఏర్ప‌డ‌నుంది.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments