టాలీవుడ్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ప్రభాస్ సినిమాలకు ఎనలేని క్రేజ్ ఉంది. దాదాపు 2000 కోట్ల రూపాయల మార్కెట్ సినిమాలు చేస్తున్నారు ప్రభాస్. ఆయన రాజాసాబ్ తో ఇటీవల మన ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఆయన సినిమా లైనప్ మాత్రం చాలా పెద్దదే ఉంది. ఇన్ని సినిమాలు మధ్యలో ఉండగా మళ్లీ ప్రభాస్ మరో ఇద్దరు దర్శకులకి ఒకే చెప్పారు అనే వార్త ఇప్పుడు బాగా వినిపిస్తోంది. ఒకటి తమిళ స్టార్ట్ దర్శకుడు ఓ కథ చెబితే రెండు మూడు మార్పులు చేసి కలవమని చెప్పారట.
అలాగే బాలీవుడ్ దర్శకుడు కూడా చెప్పిన ఓ డివోషనల్ టచ్ స్టోరీ కూడా నచ్చి దానికి ఒకే చెప్పారట. అయితే డేట్స్ విషయంలో మాత్రం ఇప్పుడు ఏమీ చెప్పనని, తనకు ఉన్న అన్నీ ప్రాజెక్టులు పూర్తి అయిన తర్వాత మాత్రమే డేట్స్ ఇస్తాను అని ప్రభాస్ చెప్పినట్లు తెలుస్తోంది.
ఇలా ఉండగా ఇటీవల రాజాసాబ్ ప్రభాస్ కే కాదు మారుతికీ అలాగే నిర్మాత People Media Factory కి ఎంతో నష్టాన్ని తీసుకువచ్చింది. అయితే ప్రభాస్ మంచి మనసు గురించి తెలిసిందే, తాజాగా ఆయన ఈ ఇద్దరికి హమీ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో ఓ మంచి కథ ఉంటే చెప్పమని దర్శకుడిని చూడండి అని, కచ్చితంగా మనం మీ నిర్మాణంలో ఓ సినిమా చేద్దామని నిర్మాతకి చెప్పారట. అంతేకాదు మారుతి కూడా చాలా ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. అందుకే ఆయన కూడా తాను ఎప్పుడు ఏ సాయం కావాలి అని కోరినా చేస్తాను అని హామీ ఇచ్చారట. ఈ వార్త టాలీవుడ్ లో వినిపిస్తోంది. మొత్తానికి ప్రభాస్ కల్కి 2. స్పిరిట్ సలార్ పార్ట్ 2 చిత్రాలు చేస్తున్నారు. దీనితో పాటు హనురాఘవపూడితో ఫౌజీ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రాల తర్వాతే కొత్త సినిమాలు ట్రాక్ ఎక్కనున్నాయి.

