ఇప్పుడు నగదు చెలామణి తగ్గిపోయింది. అంతా ఆన్ లైన్ పేమెంట్లు జరుగుతున్నాయి. యూపీఐ చెల్లింపులతోనే సగానికి సగం చెల్లింపులు జరుగుతున్నాయి. ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే, అమెజాన్ ఈ వ్యాలెట్ల ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. అయితే మోసాలు కూడా ఇదే రేంజ్ లో జరుగుతున్నాయి. కచ్చితంగా పేమెంట్ చేసే సమయంలో ఈ మోసాలకి గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.
ఈమధ్య మనం చూశాం కొందరు వ్యాపారస్దులు క్యూ ఆర్ కోడ్ పెడుతున్నారు. కానీ అక్కడ వేరే వారు మోసం చేసేలా వారి క్యూ ఆర్ కోడ్ స్టిక్కర్లు అంటిస్తున్నారు. దీని వల్ల ఆ దుకాణదారుడికి నగదు వెళ్లకుండా వేరే క్యూ ఆర్ కోడ్ పెట్టిన వ్యక్తి అకౌంట్ కి అమౌంట్ వెళుతుంది. దీని వల్ల దుకాణదారుడికి మనం నగదు చెల్లించినట్లు కాదు. ఇలా ఎన్నో గొడవలు కూడా షాప్ ల దగ్గర జరుగుతున్నాయి.
అందుకే క్యూ ఆర్ కోడ్ మోసాల పట్ల జాగ్రత్త వహించాలి. ముందుగా పే మెంట్ చేసే సమయంలో ఆ క్యూ ఆర్ కోడ్ కరెక్ట్ అవునా కాదా అనేది గమనించాలి. సింపుల్ గా ఆ పైన పేరు ఏమి వస్తుందో అక్కడ క్యూ ఆర్ కోడ్ పై ఉన్న పేరుతో మ్యాచ్ చేయాలి. ఒకవేళ ఇద్దరి పేర్లు ఒకటే అయితే పేమెంట్ చేయవచ్చు. ఇది కేవలం 10 సెకన్ల పని కానీ కొంత మంది దీనిని పట్టించుకోకుండా పేమెంట్లు చేయడం వల్ల నష్టపోతున్నారు.
ఇక సరైన విధంగా క్యూ ఆర్ కోడ్ లేకపోవడం, బ్లర్ గా క్యూ ఆర్ కోడ్ కనిపిస్తున్నాఅప్రమత్తంగా ఉండాలి ఆ దుకాణదారుడిని అప్రమత్తం చేయాలి. మీరు రోజు చేసే దానికి ఈరోజు స్కాన్ చేసి పే చేసే దానికి డిఫరెన్స్ కనిపిస్తే ఆ షాపు వ్యక్తిని కచ్చితంగా అడిగి పేమెంట్ చేయడం మేలు. ఎందుకంటే క్షణం చాలు మోసగాళ్లు ఆ క్యూ ఆర్ కోడ్ మార్చడానికి.
స్క్రీన్ పై కనిపించే పేరు దుకాణదారుడు పెట్టిన క్యూ ఆర్ కోడ్ పై ఉన్న పేరు సరిపోల్చాలి. అన్ని వివరాలు తనిఖీ చేసిన తర్వాత మాత్రమే మీరు ఇలా పేమెంట్ చేయండి.
రోజు దాదాపు కోట్ల రూపాయల లావాదేవీల నగదు ఇలా మిస్ అవుతోంది.
ఈ మోసగాళ్లు చిరు వ్యాపారస్తులు హోటల్స్ రెస్టారెంట్లు వారు రాత్రి పూట షాపు మూసివేసినా తర్వాత, క్యూ ఆర్ కోడ్లు గోడమీద బండ్ల మీద అంటించిన వాటిపై ఈ స్టిక్కర్లు అంటిస్తున్నారు. ఇలా 20 లేదా 50 రూపాయల మోసాలతో రోజు లక్షల్లో గడిస్తున్నారు. మోసపోయామని గ్రహించే సరికి వారు ఆ అకౌంట్ల నుంచి నగదు తీసేసుకుంటున్నారు.

