ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు ఫ్రాంచైజీల అమ్మకం గురించి వార్తలు ఇటీవల హైలెట్ అవుతున్నాయి. రెండు ఫ్రాంచైజీలు అమ్మకానికి సిద్దంగా ఉన్నాయి అనే వార్తలు మనం విన్నాం. ఒకటి ఆర్సీబీ. మరోకొటి రాజస్ధాన్ రాయల్స్. అయితే తాజాగా రాజస్ధాన్ రాయల్స్ కి వచ్చిన ఓ భారీ ఆఫర్ ని వారు తిరస్కరించారు అనే వార్త క్రీడాప్రపంచంలో పెద్ద చర్చకు కారణం అయింది.
రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు 1.7 బిలియన్ డాలర్ల సుమారు రూ.16,000 కోట్లు ఆఫర్ చేసింది ఓ కంపెనీ . అదే కొలంబియా ఫసిఫిక్ క్యాపిటల్. ఈ కంపెనీ అమెరికా, కెనడాలో బిజినెస్‌లు చేస్తోంది.రెండు వారాల్లో మొత్తం డీల్ పూర్తి చేస్తామని క్యాష్ సెటిల్ చేస్తామని కంపెనీ తెలిపింది. కానీ రాజస్ధాన్ మాత్రం ఈ డీల్ కి నో చెప్పింది . దీనికి పలు కారణాలు కూడా తెలియచేస్తున్నారు.
రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీలో మెజార్టీ వాటా మనోజ్ బడాలే గ్రూప్‌కి చెందిన ఎమర్జింగ్ మీడియా వెంచర్స్ చేతిలో ఉంది. మరో కంపెనీ రెడ్ బర్డ్ క్యాపిటల్ కూడా ఇన్వెస్ట్ చేసింది. తాజాగా ఈ ఆఫర్ రిజెక్ట్ చేయడం అంటే ఇంకా ఎక్కువ కోట్ చేసే కంపెనీ కోసం వారు చూస్తున్నట్లు తెలుస్తోంది. మరో పక్క డబ్బు మాత్రమే కాదు తర్వాత వారి ఫ్యూచర్ ప్లాన్ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటాం అంటోంది రాజస్దాన్. మార్కెట్ లో మనం ఒకటి గమనించాలి. ఇంత పెద్ద ఆఫర్ రిజెక్ట్ చేయడంతో కచ్చితంగా మార్కెట్లో తమకు ఎంత వాల్యు ఉందో తెలియచేస్తోంది కంపెనీ.
ఇక ఈ రిజెక్షన్ వార్త రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమ్మకం పై కూడా పడింది. రాజస్ధాన్ రాయల్స్ కంటే బెంగళూరు ఫ్రాంచైజీ వాల్యు ఎక్కువ .అందుకే ఆర్సీబీకి సుమారు 20 వేల కోట్ల ధర పలకవచ్చు అని టాక్ నడుస్తోంది. ఎందుకంటే బలమైన బ్రాండింగ్, ప్రకటనలు, ఆటగాళ్లు ఇవన్నీ కూడా ఆర్బీబీకి పెద్ద అసెట్. సో రానున్న రోజుల్లో ఈ మార్కెట్ లో వాల్యు మరింత పెరుగుతుంది అంటున్నారు.
మణిపాల్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ రంజన్ పాయ్, అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్, సింగపూర్‌కు చెందిన టెమాసెక్ నేతృత్వంలోని కన్సార్టియం ఆర్బీబీని కొనాలి అని చూస్తున్నాయి. సో చూడాలి ఈసారి ఐపీఎల్ సీజన్ మార్చి 28 నుంచి స్టార్ట్ అవుతుంది. మరి ముందు ఈ సేల్ జరుగుతుందా, లేదా సీజన్ పూర్తి అయిన తర్వాత డీల్ జరుగుతుందా అనేది చూడాలి

