Homeతెలంగాణతెలంగాణ‌లో వాహ‌నాలు న‌డిపే వారికి బిగ్ అప్ డేట్

తెలంగాణ‌లో వాహ‌నాలు న‌డిపే వారికి బిగ్ అప్ డేట్

తెలంగాణ‌లో వాహ‌నాలు న‌డిపే వారికి బిగ్ అప్ డేట్ ఇస్తోంది ప్ర‌భుత్వం. కొన్ని క‌ఠిన నిబంధ‌న‌లు తీసుకురానున్నారు. అంతేకాదు పెండింగ్ చ‌లాన్ల విష‌యంలో కూడా రూల్స్ మారుతున్నాయి. వీటిలో నిర్ల‌క్ష్యం వ‌హిస్తే క‌చ్చితంగా తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు తెలియ‌చేస్తున్నారు. ప‌దే ప‌దే నిబంధ‌న‌లు అతిక్ర‌మించేవారు, నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించే వారికి ఇక జ‌రిమానాల‌తో పాటు కేసులు కూడా న‌మోదు అవుతాయి.

ఇక‌పై నిబంధ‌న‌లు పాటించ‌క‌పోతే ఆర్సీ ర‌ద్దు అవుతుంది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తారు .దీనిపై కఠిన నిబంధనలు అమలు చేసేందుకు రవాణా శాఖ సిద్ధమవుతోంది. అయితే ఇప్ప‌టికే వేలాది పెండింగ్ చ‌లాన్లు ఉంటున్నాయి. వాటికి కూడా చెక్ పెట్ట‌నున్నారు. ఇక చ‌లాన్ల విష‌యంలో ఏదైనా వివాదాలు వ‌స్తే వాటి ప‌రిష్కారం కోసం గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేస్తున్నారు.. ప్ర‌తీ దానికి క‌చ్చిత‌మైన స‌మ‌యం ఇస్తున్నారు. ఆ స‌మ‌యంలోపు స‌మ‌స్య పూర్తి అవ్వాల్సిందే.

దీని కోసం తెలంగాణ ర‌వాణా శాఖ గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీని ఏర్పాటు చేయనున్నారు. చ‌లాన్లు జ‌రిమానాలు విధించిన త‌ర్వాత వాటి గురించి ఎలాంటి కేసులు వ‌చ్చినా, ఫిర్యాదుదారుని నుంచి ఏమైనా అభ్యంత‌రాలు ఉన్నా, ఈ అధారిటి చూసుకుంటుంది.ఇక పై ఏదైనా ఫిర్యాదు ఉంటే క‌చ్చితంగా ఆన్ లైన్ పోర్టల్ ద్వారా న‌మోదు చేయాలి. ఏదైనా సాంకేతిక స‌మ‌స్య ఉన్నా, చ‌లాన్ల గురించి కంప్లైంట్ ఉన్నా, మీరు వాహ‌నం అమ్మిన తర్వాత కూడా మీకు చ‌లాన్లు వ‌స్తున్నా ఇక‌పై ఆన్ లైన్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే. ఇవ‌న్నీ కూడా ఉన్న‌తాధికారులు ప‌రిష్క‌రిస్తారు ..ట్రాఫిక్ డీసీపీలు, ఇతర జిల్లాల్లో ఎస్పీలు, రవాణా శాఖలో ఆర్టీవో అధికారులు గ్రీవెన్స్ అధికారులుగా ఉంటారు.

1. చ‌లాన్ల జారీ లో కెమెరాతో ప‌డిన చ‌లాన్ల‌ను 3 రోజుల్లో, అలాగే మాన్యువ‌ల్ గా అధికారులు సిబ్బంది వేసిన చ‌లాన్ల‌ను 15 రోజులులో పంపాలి.

2. ఇక చ‌లాన్ ల వివ‌రాలు అన్నీ వెబ్ సైట్ లో ఉంటాయి. ఆ చ‌లాన్ అందిన త‌ర్వాత వాహ‌న దారుడు 45 రోజుల్లో జ‌రిమానా క‌ట్టాలి. ఒక‌వేళ ఈ చ‌లాన్ పై అభ్యంత‌రం ఉంటే 45 రోజుల్లోపు తెలియ‌చేయాలి.

3.ఒక‌వేళ చ‌లాన్ పై ఫిర్యాదు అందితే 30 రోజుల్లో ఆ స‌మ‌స్య‌కి ప‌రిష్కారం చూపించాలి. ఒక‌వేళ వాహ‌న‌దారుడికి ఆ నిర్ణ‌యం న‌చ్చ‌క‌పోతే 50 శాతం జ‌రిమానా చెల్లించి కోర్టుకు వెళ్ల‌వ‌చ్చు.

4.మ‌రో కీల‌కమైన అంశం ఒకే ఏడాదిలో 5 కంటే ఎక్కువ చ‌లాన్లు కట్ట‌కుండా పెండింగ్ ఉంటే అది నేరుగా ర‌వాణాశాఖకు వెళుతుంది. అత‌ని డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ అధికారులు వెంట‌నే బ్లాక్ చేస్తారు. నోటిస్ పంపుతారు. ఇలా బ్లాక్ అయితే ఆ వాహ‌నం అమ్మ‌లేరు. ఫిట్ నెస్ స‌ర్టిఫికెట్ ఇన్యూరెన్స్ కోసం ఎక్కడా క్లైయిమ్ చేయలేరు.

5. పెండింగ్ లో ఉన్న చ‌లాన్లు అన్నీ పూర్తిగా క‌ట్టిన త‌ర్వాత మాత్ర‌మే మీకు సేవ‌లు అన్నీ తిరిగి క‌ల్పిస్తారు. అయితే ఈ క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లుచేస్తే క‌చ్చితంగా మార్పు త‌ధ్యం అంటున్నారు చాలా మంది. అంతేకాదు వాహ‌న‌దారుల్లో బాధ్య‌త కూడా పెరుగుతుంది అంటున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments